కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 7/1 పేజీలు 10-12
  • మానవుని “నూతనలోక క్రమము” సమీపించినదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మానవుని “నూతనలోక క్రమము” సమీపించినదా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాపమరణములకు దాసత్వము
  • స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచుట
  • ‘మానవుడు తన నడవడిని నిర్దేశించుకోలేడు’
  • ఎవరికి శ్రేష్ఠముగా తెలుసు?
  • స్వతంత్రులేగాని జవాబుదారులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • నిజమైన స్వేచ్ఛకు మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 7/1 పేజీలు 10-12

మానవుని “నూతనలోక క్రమము” సమీపించినదా?

1. మరింత రాజకీయ స్వాతంత్ర్యము కొరకున్న కోరిక ఇటీవలి కాలములలో ఎట్లు వ్యక్తము చేయబడినది?

లక్షలాదిమంది ప్రజలు ఈనాడు అబద్ధమతపు చెరలో ఉన్నారు, మరియు అనేకులు అలానే ఉండుటకు ఎంపిక చేసికొనుచున్నారు. అదే సమయంలో, అనేకులు రాజకీయ స్వాతంత్ర్యముల కొరకు గట్టిగా అడుగుచున్నారు. తూర్పు ఐరోపా మరియు ఇతర ప్రాంతములలో ఇటీవలి కొద్ది సంవత్సరాలలో జరిగిన అసాధారణ సంఘటనలు ప్రజలు స్వేచ్ఛాపూరిత ప్రభుత్వ విధానములను కోరుచున్నారని ప్రదర్శించినవి. దాని ఫలితముగా స్వాతంత్ర్యము యొక్క ఒక క్రొత్త యుగము చేరువలోనే ఉన్నదని అనేకులు చెప్పుచున్నారు. అమెరికా అధ్యక్షుడు దానిని “ఒక నూతనలోక క్రమము” అని పిలిచెను. నిజమే, ప్రతిచోట లోకనాయకులు ప్రచ్ఛన్నయుద్ధం మరియు ఆయుధపోటి సమసిపోయింది గనుక మానవజాతిపై శాంతియుతమైన ఒక క్రొత్త యుగము ఉదయించనైయున్నదని చెప్పుచున్నారు.—1 థెస్సలొనీకయులు 5:3.

2, 3. నిజమైన స్వాతంత్ర్యమునకు వ్యతిరేకముగా ఏ పరిస్థితులు పనిచేయుచున్నవి?

2 అయినను, మానవ ప్రయత్నముల ఫలితముగా ఆయుధములు స్వల్పమై, స్వేచ్ఛాపూరిత పాలనలు వచ్చిననూ, నిజమైన స్వాతంత్ర్యము వాస్తవముగా ఉనికిలోయుండునా? ఉండదు, ఎందుకనగా బీదల సంఖ్య ఎక్కువగుచున్న మరియు ఆర్ధికముగా బ్రతికిబయటపడుటకు లక్షలసంఖ్యలో ప్రజలు పోరాడుచున్న, ప్రజాస్వామ్య దేశాలతోసహా అన్ని దేశాలలో భయంకరమైన సమస్యలు నెలకొనియున్నవి. అమెరికాలోని ఒక నివేదిక తెల్పునదేమనగా, విజ్ఞానశాస్త్రము మరియు వైద్యరంగముల అభివృద్ధియున్ననూ ప్రతిదినము ప్రపంచవ్యాప్తముగా పోషకాహార లోపమువల్ల లేక నిరోధించగల రోగముల వలన సగటున 40,000 మంది పిల్లలు మరణించుచున్నారు. ఈ క్షేత్రమందు నిపుణుడైన ఒకవ్యక్తి ఇలాచెప్పెను: “దారిద్యము ఎలాంటి గుణగణాల రూపాన్ని ధరిస్తున్నదంటే అది నిజముగా మానవజాతి భవిష్యత్తునే బెదిరించుచున్నది.”

3 వీటికి తోడుగా, మరింత కౄరముగా తయారగుచున్న నేరములకు క్రితమెన్నటికంటే ఎక్కువగా ప్రజలు బలియగుచున్నారు. జాతి, రాజకీయ మరియు మత వైషమ్యాలు వివిధ దేశాలను చిన్నాభిన్నము చేయుచున్నవి. కొన్ని ప్రాంతాలలో పరిస్థితి భవిష్యత్తునుగూర్చి జెకర్యా 14:13నందు చెప్పినదానికి ఎంతో దూరములో లేదు. అప్పుడు ప్రజలు, “ఎంత కల్లోలముతో భయముతో ఉందురనగా ప్రతివాడు తన ప్రక్కనున్నవాడిని పట్టుకొని అతనిపై దాడిచేయును.” (టుడేస్‌ ఇంగ్లీషు వర్షన్‌) మాదక ద్రవ్యముల దుర్వినియోగము, సుఖరోగములు ప్రబలమైయున్నవి. లక్షలాదిమందికి ఎయిడ్స్‌వ్యాధి సోకింది; దానిమూలంగా ఒక్క అమెరికాలోనే 1,20,000 మందికి పైగా ఇప్పటికే మరణించిరి.

పాపమరణములకు దాసత్వము

4, 5. ఈనాడు ఉనికిలోనున్న స్వాతంత్ర్యముల విషయమేమైననూ, ఏ విధమైన దాసత్వము ప్రతివారిని తన గుప్పిటిలో ఉంచుకొనియున్నది?

4 ఈ చెడు పరిస్థితులలో ఏదియు ఉనికిలో లేకున్ననూ, ఇంకను ప్రజలు స్వాతంత్ర్యము కలిగియుండరు. అందరు ఇంకనూ దాసత్వములోనే యుందురు. ఎందుకట్లు? దానిని ఉదహరించుటకు, నిరంకుశుడొకడు భూమిపైనున్న వ్యక్తులందరిని బానిసలుగాచేసి వారందరిని హత్యగావించినట్లయిన అప్పుడు సంగతేమి? మన ఆది తలిదండ్రులు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుచేసి అపవాదియొక్క కౄర పరిపాలనకు దాసులైనప్పుడు మానవజాతికి నిజంగా సంభవించినది అదే.—2 కొరింథీయులు 4:4.

5 ఆదికాండము 1, 2 అధ్యాయములు చూపించునట్లుగా దేవుడు మానవులను సృష్టించినప్పుడు, వారు భూమిమీద పరిపూర్ణతతో, పరదైసులో నిత్యము జీవించవలెనని ఆయన సంకల్పించెను. అయితే మన పితరుడగు ఆదాము దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన కారణముగా, గర్భమందుపడిన మరుక్షణమునుండే మనమందరము మరణశిక్ష క్రిందికి వచ్చియున్నాము: “ఒక మనుష్యునిద్వారా [ఆదాము, మానవకుటుంబ శిరస్సు] పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” బైబిలు చెప్పునట్లుగా, “మరణము రాజుగా ఏలెను.” (రోమీయులు 5:12, 14 NW) కావున వ్యక్తిగతముగా మనమెంత స్వాతంత్ర్యము కలిగియున్నను, మనమందరము పాపమరణముల దాసత్వమందు ఉన్నాము.

6. కీర్తన 90:10 వ్రాయబడిన కాలంనాటి జీవనకాలములో ఎందుకు కొద్దిపాటి అభివృద్ధి కలదు?

6 ఇంకనూ, మనమిప్పుడు కలిగియున్న జీవితము చాలా పరిమితము. అదృష్టవంతులకు సహితము, అది కేవలము కొన్ని దశాబ్దములు మాత్రమే. దురదృష్టవంతులకు, అది కేవలము కొన్ని సంవత్సరములు మాత్రమే లేక అంతకంటే తక్కువే. ఒక క్రొత్త అధ్యయనము చూపించునదేమనగా: “మానవ జీవితకాల ఆశను విజ్ఞానశాస్త్రము మరియు వైద్యము దాని సహజ పరిమితులకు తీసుకువెళ్లింది.” ఇలా ఎందుకనగా ఆదాము పాపము ఫలితముగా మన జన్యు విధానము అసంపూర్ణతను కలిగియున్నది మరియు మరణము అందులో అంతర్నిర్మితమై యున్నది. మనము జ్ఞానవంతులమగుటకు, జీవితమును మరిశ్రేష్ఠముగా అనుభవించుటకు ఆరంభించునప్పుడు, మన శరీరములు కృంగి చివరకు మట్టిపాలగునట్లు, మనము కేవలము 70 లేక 80 సంవత్సరములే జీవించుట ఎంత దుఃఖకరము!—కీర్తన 90:10.

7. మనము కోరిన మరియు మనకవసరమగు నిజమైన స్వాతంత్ర్యములకు మానవులెందుకు ఎన్నటికిని ఆధారభూతులు కాలేరు?

7 పాపమరణములకు లోనైన ఈ దాసత్వమును ఏ విధమైన మానవ పరిపాలన ఆపుజేయగలదు? ఏదియు అట్లు చేయలేదు. ఏ ప్రభుత్వ అధికారులైనను, శాస్త్రజ్ఞులైనను, లేక ఎక్కడున్న వైద్యులైనను మనలను రోగము, వృద్ధ్యాప్యము మరియు మరణ శాపములనుండి తప్పించలేరు, లేక వారిలో ఎవరునూ భద్రత లేకపోవుటను, అన్యాయమును, నేరమును, ఆకలిని, దారిద్ర్యమును తీసివేయలేరు. (కీర్తన 89:48) వారెంత ప్రతిభావంతులైన మానవులైననూ, మనము కోరుకొను మరియు మనకవసరమగు నిజమైన స్వాతంత్ర్యములకు ఆధారభూతులగుట వారికి అసాధ్యము.—కీర్తన 146:3.

స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచుట

8, 9. మానవజాతిని ప్రస్తుత దుఃఖకర పరిస్థితిలో ఉంచినదేమి?

8 ఆదాముహవ్వలు తమ స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగము చేసినందుననే మానవజాతి ఈ దుఃఖకర పరిస్థితిలో ఉన్నది. ది జెరూసలేమ్‌ బైబిల్‌ ప్రకారము మొదటి పేతురు 2:16 ఇట్లు చెప్పుచున్నది: “స్వేచ్ఛగల మనుష్యులవలె ప్రవర్తించుడి, మరియు దుష్టత్వమునకు ఒక సాకుగా మీ స్వాతంత్ర్యమును ఎన్నటికిని ఉపయోగించకండి.” కావున, మానవుని స్వాతంత్ర్యము అపరిమితమై యుండవలెనని దేవుడు సంకల్పించలేదనుట స్పష్టమైయున్నది. నీతియుక్తమును మరియు ప్రతివారి ప్రయోజనము కొరకు పనిచేయు దేవుని నియమముల హద్దులలోనే ఆ స్వాతంత్ర్యమును అభ్యసించవలసి యుండెను. ఆలాగే దేవుని పరిపాలన ఎన్నటికిని అణచివేయునదిగా ఉండకుండునట్లు, వ్యక్తిగత ఎంపిక స్వాతంత్ర్యమును అనుమతించుటకు సరిపడునంత వెడల్పుగా దాని సరిహద్దులు ఉండెను.—ద్వితీయోపదేశకాండము 32:4.

9 అయితే, మన మొదటి తలిదండ్రులు సరియైనదేదో చెడ్డదియేదో తమకుతాము నిర్ణయించుకొనుటకు ఎంపిక చేసికొనిరి. వారు ఉద్దేశపూర్వకముగా దేవుని పాలననుండి వైదొలగినందున, ఆయన వారినుండి తన మద్దతును తీసివేసెను. (ఆదికాండము 3:17-19) ఆ విధముగా వారు అసంపూర్ణులైరి, తత్ఫలితముగా రోగము మరియు మరణము వారికి కలిగెను. స్వాతంత్ర్యమునకు బదులు మానవజాతి పాపమరణముల దాసత్వములోనికి వచ్చెను. ఆలాగే వారు అసంపూర్ణతయొక్క చపలతకు మరియు, తరచు మానవ కౄరపాలకులకు దాసోహమైరి.—ద్వితీయోపదేశకాండము 32:5.

10. ఆయా విషయములను ప్రేమతో యెహోవా ఎలా పరిష్కరించాడు?

10 మానవులు తామనుకున్న సంపూర్ణ స్వాతంత్ర్యమును ప్రయోగము చేయుటకు దేవుడు వారిని కేవలము కొంత పరిమిత కాలము కొరకు అనుమతించెను. దేవునినుండి స్వంతంత్రముగా చేయు మానవ పరిపాలన విజయవంతము కానేరదనే సందేహానికి తావులేకుండా ఆ ఫలితములే చూపునని ఆయనకు తెలుసు. సరియైన రీతిలో అభ్యసించు స్వేచ్ఛాచిత్తము ఎంతటి విలువగలదంటే, దేవుడు తన ప్రేమనుబట్టి ఆ స్వేచ్ఛాచిత్తమును విరమింపజేయుటకు బదులు జరిగినదానిని ఆయన తాత్కాలికముగా అనుమతించెను.

‘మానవుడు తన నడవడిని నిర్దేశించుకోలేడు’

11. బైబిలు యథార్థతను చరిత్ర ఎట్లు బలపరచినది?

11 యిర్మీయా 10వ అధ్యాయము 23, 24 వచనముల యథార్థతను చరిత్ర చూపిస్తునే ఉన్నది. అది ఇట్లనుచున్నది: “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు. . . . ఓ, యెహోవా నన్ను సరిదిద్దుము.” (NW) “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని చెప్పిన ప్రసంగి 8:9 యొక్క యథార్థతనుకూడా చరిత్ర చూపించినది. అది ఎంత నిజము! మానవ కుటుంబము వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా అనేక విపత్తులను ఎదుర్కొనినది, చివరకు అందరూ సమాధినే చేరుకొనిరి. రోమీయులు 8:22లో వ్రాయబడిన ప్రకారము, అపొస్తలుడైన పౌలు పరిస్థితిని సవివరముగా వర్ణించెను: “సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.” అవును, దేవుని నియమములనుండి స్వతంత్రత వినాశనకరం.

12. సంపూర్ణ స్వాతంత్ర్యమును గూర్చి కొన్ని లౌకిక మూలములు ఏమని చెప్పుచున్నవి?

12 ఇంక్విజిషన్‌ అండ్‌ లిబర్టీ అను పుస్తకము స్వాతంత్ర్యము మీద ఈ విధముగా వ్యాఖ్యానించినది: “స్వాతంత్ర్యము దానంతటదే గొప్పసంగతి కానవసరము లేదు: అది మరింత అర్హతలేకుండా గర్వించదగిన విషయమేమీ కాదు. వాస్తవానికి అది, స్వార్థ రూపములలో దిగజారిన ఒక రూపమై యున్నది . . . సరియైన కారణముతో మానవుడు సంపూర్ణముగా, స్వతంత్ర ప్రాణి కాడు, మరియు అలా ఉండుటకు ఆశింపనూ లేడు.” ఇంగ్లాండు యువరాజైన ఫిలిప్పు ఒకసారి ఇట్లనెను: “ప్రతి ఆశలోను మరియు ఆలోచనలోను స్వాతంత్ర్యము నాశించుట కోరదగినదిగా ఉండవచ్చు, అయితే అనుభవము పదేపదే బోధించునదేమనగా, స్వయం-నియంత్రణ లేని . . . ఇతరులయెడల శ్రద్ధలేని ప్రవర్తనగల స్వాతంత్ర్యము, దాని బలమెంతయైననూ సరే, సమాజ జీవితనాణ్యతను నిశ్చయముగా నాశనము చేయును.”

ఎవరికి శ్రేష్ఠముగా తెలుసు?

13, 14. మానవ కుటుంబమునకు ఎవరు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యమును దయచేయగలరు?

13 ఇంటిని ఎట్లు తీర్చిదిద్దవలెనో ఎవరికి శ్రేష్ఠముగా తెలియును—ప్రేమగల, సామర్థ్యముగల తలిదండ్రులకా లేక పసివారైన పిల్లలకా? దీనికి జవాబు స్పష్టమే. అదేప్రకారము, మానవుల సృష్టికర్తయైన మన పరలోకపు తండ్రికి మనకేది శ్రేష్ఠమో తెలియును. మానవ సమాజాన్ని ఎలా వ్యవస్థీకరించాలో, ఎలా పరిపాలించాలో ఆయనకు తెలుసు. ప్రతివారికి నిజమైన స్వాతంత్ర్యముయొక్క ప్రయోజనములను తెచ్చుటకు స్వయంచిత్తమును ఎలా క్రమపరచాలో ఆయనకు తెలుసు. మానవ కుటుంబమును దాసత్వమునుండి ఉద్ధరించి వారందరికి నిజమైన స్వాతంత్ర్యమును ఎట్లు దయచేయవలెనో సర్వశక్తిమంతుడగు దేవుడైన యెహోవాకు మాత్రమే తెలుసు.—యెషయా 48:17-19.

14 తన వాక్యమందు, రోమీయులు 8:20లో యెహోవా యీ ఉత్తేజభరితమైన వాగ్దానము చేయుచున్నారు: “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందును.” అవును, ప్రస్తుత పనికిరాని పరిస్థితినుండి మానవ కుటుంబమును పూర్తిగా విడుదల చేయుటకు దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఇది ఎలా జరుగునో తర్వాతి శీర్షిక చర్చించును. (w91 4/1)

మీరెట్లు జవాబిత్తురు?

◻ (ఈ రెండు పఠనశీర్షికలకు కలిపి)

◻ స్వాతంత్ర్యమును గూర్చి మానవులెందుకు దృఢముగా తలంచుదురు?

◻ చరిత్రయంతటిలో ప్రజలు ఏయేవిధములుగా బానిసలుగా తయారైరి?

◻ స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచుటకు యెహోవా ఇంత దీర్ఘకాలము ఎందుకనుమతినిచ్చెను?

◻ మానవజాతికి ఎవరు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యమును తీసుకురాగలరు, ఎందుకు?

[11వ పేజీలోని చిత్రాలు]

కీర్తన 90:10లో 3,500 సంవత్సరముల పూర్వము వ్రాయబడినట్లుగానే మానవ జీవనకాలమున్నది

[క్రెడిట్‌ లైను]

Courtesy of The British Museum

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి