మతభ్రష్టుల విషయమై జాగ్రత్తగా ఉండుము!
యూదా పత్రిక నుండి ఉన్నతాంశములు
యెహోవా సేవకులు “చెడ్డదాని నసహ్యించుకొని, మంచిదానిని హత్తుకొనియుండవలెను.” (రోమీయులు 12:9) దీనిని చేయుటకు దాదాపు సా.శ. 65లో పాలస్తీనానుండి వ్రాసిన తన లేఖలో బైబిలు రచయితయైన యూదా ఇతరులకు సహాయము చేసెను.
యూదా “యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడనని” తనను పిలుచుకొనెను. ఈ యాకోబు స్పష్టముగా యేసుక్రీస్తు సహోదరుడను విషయము అందరికి తెలిసినదే. (మార్కు 6:3; అపొ.కార్యములు 15:13-21; గలతీయులు 1:19) ఆ విధముగా యాకోబు తానుగా యేసు సహోదరుడై యున్నాడు. అయితే, క్రీస్తు ఆత్మీయ వ్యక్తిగా అప్పటికే పరలోకములో మహిమపరచబడి యున్నందున, తమ రక్తసంబంధమును ప్రస్తావించుట సరికాదని ఆయన తలంచియుండవచ్చును. “మంచిదానిని హత్తుకొనియుండి” మతభ్రష్టుల విషయములో జాగ్రత్తపడుటకు మనకు సహాయపడుటలో ఉపదేశమునిచ్చుటయందు యూదా వ్రాసిన పత్రిక చాలా సూటిగాయున్నది.
“తీవ్రముగా పోరాడుము”
యూదా క్రైస్తవులందరికి కలిగెడి రక్షణనుగూర్చి వ్రాయవలెనని ఉద్దేశించినను, తన పాఠకులు “విశ్వాసము విషయమై తీవ్రముగా పోరాడుటకు” వారిని వేడుకొను అవసరమును ఆయన చూసెను. (1-4 వచనములు NW) ఎందుకు? ఎందుకనగా భక్తిహీనులైన మనుష్యులు క్రైస్తవ సంఘములోనికి జొరబడి, ‘దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచుండిరి.’ దేవుని నియమములను ఉల్లంఘించికూడ తాము ఇంకను దేవుని ప్రజలమధ్య ఉండగలమని వారు తప్పుగా భావించిరి. మనము అటువంటి దుష్ట ఆలోచనలకు లొంగిపోకుండా, అన్ని సమయములలో నీతిని వెంటాడుచు, యేసు రక్తముద్వారా దేవుడు కనికరముతో మన పాపములను కడిగివేసెనని కృతజ్ఞత గలిగియుందము గాక.—1 కొరింథీయులు 6:9-11; 1 యోహాను 1:7.
మనయెదుట ఉంచబడిన హెచ్చరికలు
కొన్ని రకములైన దృక్పధములకు, ప్రవర్తనకు మరియు ప్రజల విషయములో జాగ్రత్తగాయుండుట అవసరము. (5-16 వచనములు) ఎందుకంటే ఐగుప్తునుండి రక్షింపబడిన కొంతమంది ఇశ్రాయేలీయులు విశ్వాసము కోల్పోయినవారై నాశనము చేయబడిరి. తమ సరియైన స్థానమును విడిచిన దేవదూతలు “మహాదినమున జరుగు తీర్పువరకు [ఆత్మీయ] కటిక చీకటిలో నిత్యపాశములతో బంధింపబడి” భద్రము చేయబడిరి. ఘోరమైన అవినీతి కారణముగా సొదొమ గొమొర్రాలు . . . “నిత్యాగ్నిదండనను అనుభవించెను.” కాబట్టి, మనము అన్నిసమయములలో దేవుని ప్రీతిపరచుచు “జీవమార్గమును” ఎన్నడును విడిచిపెట్టకుందము గాక.—కీర్తన 16:11.
దూషణకరమైన పదములతో అపవాదికి తీర్పుతీర్చని ప్రధాన దూతయగు మిఖాయేలువలే కాకుండ, భక్తిహీనులు “మహాత్ములను,” స్పష్టముగా దేవుడు మరియు క్రీస్తు అభిషక్తులైన పెద్దలుగా నియమించి మహిమపరచిన వారిని, దూషించి మాట్లాడిరి. మనము దేవుడనుగ్రహించిన అధికారమును అవమానపరచకుందము గాక!
భక్తిహీనులు చెడు మాదిరులైన కయీను, బిలాము కోరహులను అనుసరించిరి. వారు దొంగ మెట్టలను, నిర్జల మేఘములను, కాయలు రాలి ఫలములులేక, రెండుమారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లనుపోలి ఆత్మీయ బెదిరింపును ముందుంచిరి. ఆ మతభ్రష్టులు ‘లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు’ సణుగువారును, నిందించువారునై యుండిరి.
ఎడతెగక ఎదిరించుము
ఆ పిమ్మట యూదా చెడు ప్రభావములను ఎదిరించవలెనని సలహానిచ్చెను. (17-25 వచనములు) “అంత్యకాలమున,” పరిహాసకులుందురు, కాబట్టి నిజమైన క్రైస్తవులు ఈనాడు వారిని, వారిమాటలను సహించవలెను. అటువంటి చెడు ప్రభావములను ఎదిరించుటకు, “అతిపరిశుద్ధమైన విశ్వాసముమీద” మనలను మనము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మతో ప్రార్థించుచు, క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమయందు నిలువవలెను.
అబద్ధ బోధకుల పాత్రలో, భక్తిహీనులు స్పష్టముగా కొందరిలో సందేహములు కలిగియుండుటకు కారణమైరి. (2 పేతురు 2:1-3 పోల్చుము.) సందేహికులకు ఏమి అవసరము? ఎందుకు, నిత్యనాశనమను “అగ్ని” నుండి వారిని తప్పించుటకు వారికి ఆత్మీయ సహాయమవసరము. (మత్తయి 18:8, 9) అయితే పాపములోనికి “తొట్రిల్లకుండ” ఆలాగే మతభ్రష్టుల కొరకు వేచియున్న నాశనమునుండి భక్తులను యెహోవా కాపాడును గనుక వారు భయపడనవసరములేదు. (w91 4/15)
[32వ పేజీలోని బాక్సు]
దొంగ మెట్టలు: ‘ప్రేమవిందులలో దొంగ మెట్టలను’ గూర్చి యూదా తోటి క్రైస్తవులను హెచ్చరించెను. (యూదా 12) విశ్వాసులయెడల ప్రేమను నటించు అటువంటి మతభ్రష్టులు, నీటిలో కనబడకుండయుండి ఓడలను బ్రద్దలుచేయుటకు లేక ఈతగాండ్రు వాటికి కొట్టుకొని మరణించుటకు కారణమగు రాళ్లను పోలియున్నారు. వస్తుదాయకముగా కలిగియున్న క్రైస్తవులు బీదలైన తోటి విశ్వాసులను అటువంటి ప్రేమ విందులకు ఆహ్వానించెడివారు. చర్చి ఫాదర్ అయిన క్రిసోస్టమ్ (సా.శ. 304?-470) ఇట్లనెను: “వారందరు ఒకేచోట విందుకు కూడుకొనెడివారు: ధనవంతులు కావలసినవి తీసుకురాగా, బీదలైనవారు, ఏమిలేనివారు అక్కడకు ఆహ్వానింపబడేవారు అలా వారందరుకూడి ఏకముగా భోజనము చేసెడివారు.” తొలిశతాబ్దపు ప్రేమవిందుల స్వభావమెట్లున్నను, ఆత్మీయ మరణమును తీసుకురాగల మతభ్రష్ట ‘దొంగ మెట్టలను’ గూర్చి జాగ్రత్తపడుడని యూదా చేసిన హెచ్చరిక నమ్మకమైన వారికి సహాయపడెను. క్రైస్తవులు ప్రేమ విందులు ఏర్పాటుచేయవలెనని ఆజ్ఞాపింపబడకపోయినను, మరియు ఈనాడు అలాంటివి జరిగింపబడకపోయినను, అవసరమున్న సమయములలో యెహోవా ప్రజలు ఒకరినొకరు సహాయము చేసుకొందురు మరియు సంతోషకరమైన సహవాసమును కలిగియుందురు.