నరకము వేడిగా ఉన్నదా?
“పంతొమ్మిది వందల అరవైలో ఒకానొక సందర్భములో, నరకము అదృశ్యమయ్యింది.” ఒక బ్రిటీషు రచయిత తన పుస్తకమైన సోల్స్ అండ్ బాడీస్ నందు అలా పేర్కొన్నాడు, రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దశాబ్దల కాలమందలి అనేక కాథోలిక్ మరియు ప్రొటస్టెంటు వారి ఆలోచనా సరళిని అతని మాటలు ప్రతిబింబించుచున్నవి. అనేక ప్రధాన చర్చిలు నరకాగ్నిని గూర్చిన తమ ముఖ్య సిద్ధాంతమును ఆధునిక దృక్పధమునకు అనువుగా ఉండునట్లుచేయు తమ ప్రయత్నములో కొంత కాలమువరకు దానిని మృదువుగా చేపట్టారు.
మరణానంతర శిక్షనుగూర్చిన తలంపు అనేకులకు అంగీకారముగా లేదు ఎందుకనగా పాపమునుగూర్చిన తలంపే వారి మనస్సులలో మసక కమ్మింది. 1984లో రోమా కార్డినల్ రెట్జింగర్ను ప్రశ్నించినప్పుడు ఆయనిట్లనెను: “నరకము, పర్గేటరీ అనే నమ్మకాలు దేనితో ముడిపడియున్నవో . . . అట్టి అపరాధము, పాపముయొక్క భావనను ప్రజలలోనుండి తొలగించే ప్రయత్నములో అట్టి ఉపశాంతినిచ్చు పరిస్థితులపైన, స్థలాంతరముపైన మన తరము కేంద్రీకరించుచున్నది.”
మరణానంతరము పర్గేటరీ, నరకములో శిక్ష అను సిద్ధాంతమును అంగీకరించకయే, పాపముయొక్క నిజస్వరూపమును నమ్ముట నేడు సాధ్యమగునా? ఇటీవలి సాహిత్యమైన ఎబ్రిగి డిలా ఫోయ్ కెథలిక్ (కాథోలిక్కు విశ్వాస సారాంశము), కొరకు పరిచయ వాక్యములను వ్రాసిన ఫ్రెంచి కార్డినల్ డికోర్టరే, ఇట్టి ప్రశ్నవేసాడు: “నరకమును నమ్ముట అవసరమా?” దానికి సమాధానము: “నరకమును గూర్చిన భయబ్రాంతమైన ప్రశ్నకు ప్రత్యుత్తరమివ్వక తప్పించుకొనడం సాధ్యం కాదు.” వాటికన్ కౌన్సిల్ II—మోర్ పోస్ట్ కాన్సిలియర్ డాక్యుమెంట్స్ (1982) “ది క్రేడొ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్” ను పేర్కొనుచు ఇట్లనెను: “దేవుని ప్రేమాను రాగములకు ప్రతిస్పందించిన వారందరు నిత్యజీవమునకు వెళ్లుదురనియు, అంతము వరకు వాటిని తృణీకరించువారు ఎన్నటికిని ఆరిపోని అగ్నిలో వేయబడుదురని మేము నమ్ముదుము.”
కనుక, భిన్నముగా నిరూపించుటకు వేదాంత ప్రయత్నములెన్ని చేయబడినను, నరకాగ్ని అనేది ఇంకను కాథోలిక్ ప్రముఖ సిద్ధాంతములో ఒక భాగముగా ఉంటూనే యున్నది. అయితే నిత్య నరకదండన సిద్ధాంతము నేడు క్రీస్తు మత సభ్యులనేకులకు ఎట్టి “తత్తరపాటును” మరియు “అసౌఖ్యమును” కలిగించుచున్నదో ఎ న్యూ డిక్షనరీ ఆఫ్ డ్రిస్టియన్ థియాలజీ (1983) తెల్పుచున్నది. ప్రేమగల దేవునిగూర్చిన తలంపుతో ఈ సిద్ధాంతమును ఇముడ్చుట వారికి కష్టముగా ఉన్నది. ‘వేడిగాయుండే నరకము నిజముగా క్రైస్తవుని మరియు బైబిలు సిద్ధాంతమేనా? కానట్లయితే, అది ఎచ్చట ప్రారంభమాయెను’ అని ఆశ్చర్యపడుచున్నారు. (w89 10/1)
[3వ పేజీలోని చిత్రం]
Bourges Cathedral, France