కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 3/1 పేజీ 3
  • యుద్ధములు ఎల్లకాలం ఉంటాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధములు ఎల్లకాలం ఉంటాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిరీక్షణా కిరణం
  • యుద్ధములను అంతముచేయు యుద్ధము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యుద్ధాలు అనివార్యమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ‘మీరు యుద్ధాల గురించి వింటారు’
    అదనపు అంశాలు
  • ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 3/1 పేజీ 3

యుద్ధములు ఎల్లకాలం ఉంటాయా?

ఉత్తరఫ్రాన్స్‌నందలి ఉల్లసవంతమైన పంట పొలాల ప్రాంతమగు పికార్డీనందు జూలై 1, 1916లో సొమ్మియొక్క మొదటి పోరాటం ప్రారంభమైంది. భయంకరమైన ఫిరంగిదాడి, విమానదాడులు చేసినపిదప తమ్మును ఎదుర్కొని చొరబడిన జర్మను సైన్యముయొక్క దాడిని, తాము నిరీక్షించిన విధంగా పూర్తిగా నిలిపివేయగాల్గమని బ్రిటీషు మరియు ఫ్రెంచి సైన్యములు తలంచినవి. కాని అది నిలిపివేయబడలేదు. బదులుగా, మొదటి దినమున 20,000 మంది బ్రిటీషు సైనికులు చంపబడ్డారు. వారములు గడిచేకొద్ది పోరాటము నిలిపి వేయబడకుండా కొనసాగుచునేయున్నది. అక్టోబరులో వర్షాలు యుద్ధభూమిని సముద్ర బురదగా మార్చివేసినవి. నవంబరు మధ్యకాలానికి శత్రువులు కేవలం 5మైళ్లు ముందుకు సాగగాల్గరు. ఈలోగా 4,50,000 జర్మనులు, 2,00,000 ఫ్రెంచివారు, 4,20,000 బ్రిటీషువారి ప్రాణాలు కోల్పోబడినవి. పదిలక్షల సైనికులకంటె ఎక్కువగా, వారిలో అధికంగా యౌవనులు ఆ పోరాటంలో సమూలనాశనమయ్యారు!

ఇది కేవలం మొదటి ప్రపంచయుద్ధములో ఒక ఉపచిత్రమే. చరిత్ర అంతటిలో అనేక యుద్ధాలు జరిగినను—మొదటి ప్రపంచయుద్ధము—అప్పటి వరకు జరిగిన వాటిలోకెల్ల దారుణమైనది. మానవుల ప్రాణాలు ఎంత బుద్ధిహీనముగా పాడు చేయబడినవి!

మానవులు ఈ విధంగా ఒకరినొకరు చంపుకొనడాన్కి ఎందుకు పురికొల్పబడుచున్నారు? అనేక కారణాలున్నవి, వాటిలో మనము చెప్పుకోదగినవి, స్వార్ధము, అత్యాశ, దుర్లభాపేక్ష, అధికారము మరియు పరువు ప్రతిష్టలకొరకు వాంఛ. యుద్ధపోరాటములకు గల మరొక కారణము జాతీయతా వాదము. నిజమే, బైబిలునందు మానవ చరిత్రపైజరిగిన పరిశీలనయొక్క నిజరూపమును యుద్ధాలు పతిబింబించుచున్నవి: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.

మతము కూడా తరచు యుద్ధమును చెలరేపింది. మధ్యయుగంలో జరిగిన కృసెడ్లు కేవలం మతంకొరకే పోరాడబడినవి: అనగా క్రీస్తుమతమండలికి పాలస్తీనాను తిరిగి సంపాదించుటకే మతపరమైన దేశాలచే అవి పోరాడబడెను. వివిధ మతశాఖలకు చెందిన మతనాయకులు సైనికులలో మతభావాలను రెచ్చగొట్టి తమ విరోధులను చంపుటకు మరింత యిష్టాన్ని కనపర్చేరీతిగా ఈ శతాబ్ధములలోని రెండు ప్రపంచ యుద్ధాలలోను పురికొల్పారు. ఇప్పుడుకూడా చెలరేగుచున్న పోరాటములలో కొన్ని మతభావనలతో కూడినవే.

నిరీక్షణా కిరణం

ఏనాటికైన యుద్ధాలు లేకుండా ఉండగలవనుటకు నిరీక్షణ ఏదైనా ఉన్నదా? అవును, వున్నది. “సమాధానకర్తయగు రాజు” అని యేసుక్రీస్తు పిలువబడెను. ఆయన భూమిమీదకు వచ్చినప్పుడు తమ్మును ప్రేమించుకొన్నట్లే పొరుగువారిని ప్రేమించవలెనని ప్రజలకు బోధించి, తనపేరుకు తగినట్లు జీవించెను. తమ శత్రువులను సహితం ప్రేమించమని ఆయన వారికి చెప్పెను. (యెషయా 9:6; మత్తయి 5:44; 22:39) తత్పలితంగా, మొదటి శతాబ్దములో ఆయన ఉపదేశాలను లక్ష్యపెట్టినవారు, సమాధానపూరితులై, అంతర్జాతీయ సహోదరబృందమైనారు. ఒకరిపై మరొకరు యుద్ధముచేయుట వారి ఊహకందని విషయము. అయితే, దురదృష్టకరంగా ఈ తొలిక్రైస్తవుల పవిత్రమైన విశ్వాసము అటుపిమ్మట కలుషితంచేయబడింది. కాలంగతించినప్పుడు, చర్చిలు రాజకీయములతో మిళితమైనవి, దేశాలుచేసిన యుద్ధముల కారణంగా చిందిన రక్తముతో వారి హస్తములు మునిగిపోయినవి.

అటుతరువాత, మార్పుతో కూడిన గాలులు ఐరోపామీద వీచుట ప్రారంభించినవి. ఎడతెగని యుద్ధాలతో మానవులు అలసిపోయినట్లు కన్పించినది. 1899 మరియు 1907లోను హేగు నెదర్లాండులలో అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. 1899లో జరిగిన సమావేశములో “అంతర్జాతీయ వివాదములకు సమాధాన పరిష్కారము” అను ఒప్పందము కుదుర్చుకొన్నారు. కనుక 20వ శతాబ్ధప్రారంభములో లోకం క్రమేణ యుద్ధానికి స్వస్తిచెప్పునని ఆశించారు. అయితే, మొదటి ప్రపంచయుద్ధ తుపాకిలతో అట్టిఆశలు ఫటాపంచలైనవి. సమాధానముకొరకు మానవుని ఆశలు ఎప్పటికి నెరవేర్చబడవని దీని అర్ధమా? (w88 11/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి