కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 138
  • ‘మీరు యుద్ధాల గురించి వింటారు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మీరు యుద్ధాల గురించి వింటారు’
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఏం బోధించాడు?
  • యేసు ఏం చేస్తాడు?
  • కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • త్వరలోనే యుద్ధంలేని లోకం
    తేజరిల్లు!—1996
  • అర్మగిద్దోను దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యుద్ధ స్వరూపం మారింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 138
చిత్రాలు: యేసు తమ శిష్యులతో మన కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. లోపల ఉన్న చిత్రాల్లో నేటి యుద్ధాల సన్నివేశాలు ఉన్నాయి: కాలి బొగ్గు అవుతున్న నగరం, అణుబాంబు పేలడం వల్ల వస్తున్న పొగ చూడడానికి పుట్టగొడుగు ఆకారంలో ఉంది, ఆయుధాలు ధరించిన సైనికులు వీధిలో నడుస్తున్నారు వెనకాల యుద్ధ ట్యాంకర్లు కూడా ఉన్నాయి.

యేసును చూసి నేర్చుకోండి

‘మీరు యుద్ధాల గురించి వింటారు’

“దాదాపు 60 ఏళ్ల నా కెరీర్‌లో, ప్రపంచవ్యాప్తంగా జరిగిన 40 కంటే ఎక్కువ యుద్ధాల గురించి నేను రిపోర్ట్‌ చేశాను. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య పోరు (cold war) తారాస్థాయికి వెళ్లడం, ఆ తర్వాత చప్పబడిపోవడం నేను చూశాను. అయితే, 2025 సంవత్సరం భయపెట్టినంతగా ముందు ఏ సంవత్సరం నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే, ఈ సంవత్సరంలో చాలా యుద్ధాలు జరిగాయి. అయితే, వాటిలో ఒక యుద్ధం ముందెప్పుడూ లేనంతగా ప్రపంచంలోని చాలా దేశాల మీద ప్రభావం చూపిస్తుంది.”—జాన్‌ సిమ్సన్‌, బిబిసి.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అసలు పరిస్థితులు ఎప్పటికైనా మారతాయా అని చాలామంది ఆలోచిస్తున్నారు. యేసు ఏం చెప్పాడు?

యేసు ఏం బోధించాడు?

మనం నేడు చూస్తున్న పరిస్థితుల గురించి యేసు ముందే చెప్పాడు. ఆయన తన శిష్యుల్ని “మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు” అని హెచ్చరించాడు.—మత్తయి 24:6.

నేడు చూస్తున్న యుద్ధాలు, దాడులు మనల్ని భయం గుప్పిట్లో పడేస్తున్నా మనం ఆశతో ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, పెద్ద-పెద్ద యుద్ధాలు జరగడం, ఇంకా వేరే సంఘటనలు జరగడం, పరిస్థితుల్లో-ప్రజల్లో మార్పు రావడం “ఈ వ్యవస్థ ముగింపుకు సూచన” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:3; లూకా 21:7) అంటే, యేసు భవిష్యత్తులో యుద్ధాలకు తెరపడేలా చేస్తాడని అర్థమౌతుంది. ఎలా?

యేసు ఏం చేస్తాడు?

ఇంకొంతకాలం తర్వాత, దేవుని రాజ్యానికి రాజుగా యేసు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తన 46:9.

భూమంతా ప్రశాంతంగా ఎలా మారబోతుందో, అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఎక్కువ తెలుసుకోవడానికి “యుద్ధాలు దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?” అనే ఆర్టికల్‌ చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి