కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/15 పేజీలు 2-4
  • యుద్ధాలు అనివార్యమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలు అనివార్యమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అది జీవుల మనుగడకు అవసరమా?
  • యుద్ధ కారకాలు
  • యుద్ధములను అంతముచేయు యుద్ధము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యుద్ధం యొక్క భవిష్యత్తు ఏమిటి?
    తేజరిల్లు!—1999
  • ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • శాశ్వత శాంతిని ఎవరు తీసుకురాగలరు?
    తేజరిల్లు!—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/15 పేజీలు 2-4

యుద్ధాలు అనివార్యమా?

యుద్ధం కృంగదీసే వార్తాంశంగా ఉంది. అటువంటి క్రూరతను వ్యక్తపర్చే వార్తలు మిమ్మల్ని నిశ్చయంగా కలవరపెడతాయి. అంతేగాక, యిన్ని వివాదాలను తీర్చుకోడానికి ఆయుధాలే ఎందుకు ఉపయోగించబడుతున్నాయనే అనుమానం, బహుశా మీకు కూడ రావచ్చు. మనుష్యులు శాంతియుతంగా జీవించడానికి ఎన్నడూ నేర్చుకోరా?

ఎయిడ్స్‌ వ్యాధికంటే యుద్ధోన్మాదానికి పరిష్కారం కనిపెట్టడమే మరింత భ్రమగా కనిపిస్తోంది. ఇరవయ్యో శతాబ్దంలో, దేశాలన్నీ యుద్ధానికి సమకూడాయి, లక్షలాది మంది మనుష్యులు పోరాడడానికి పంపించబడ్డారు, మరి వందలాది పట్టణాలు నాశనం చేయబడ్డాయి. ప్రజాసంహారానికి అంతం కనిపించడం లేదన్నట్లుగా ఉంది. ప్రపంచ సేనలు—గెరిల్లాలు—మరింత భయంకరంగా పనిచేస్తూ ఉంటాయని లాభప్రదమైన ఆయుధ వ్యాపారం, నిశ్చయపరుస్తోంది.

యుద్ధాయుధాలు మరింత ప్రాణాంతకమౌతున్నకొలది, మరణాల సంఖ్య ఆకాశాన్నంటుతోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 6 కోట్ల 50 లక్షలమంది సైనికుల్లో సగానికంటే ఎక్కువమంది చనిపోయారు లేదా గాయపడ్డారు. ఆ తర్వాత 30 ఏండ్లకు, కేవలం రెండు ఆటం బాంబులు 1,50,000 మంది జపాన్‌ ప్రజల జీవితాలను మట్టుపెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన నాటి నుండి అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. అయితే, అవి మరణకరమైనవే, ప్రత్యేకంగా ఆలా మరణించినవారిలో 80 శాతం మంది సామాన్య ప్రజలే.

దేశాలమధ్యనున్న వివాదాలను తీర్చుకోడానికి ఉపయోగించే యుద్ధాలను నిషేధించేందుకు, ఎన్నడూలేని ప్రయత్నాలు జరిగిన ఈ కాలంలో ఊహించినదానికి భిన్నంగా ఘోరమైన వధ జరిగింది. ఇటీవల ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధంతో, నూతనమైన శాంతియుత లోక విధానం వెల్లివిరుస్తుందనే ఆశలు పెరిగాయి. అయినా, ప్రపంచవ్యాప్త శాంతి ఎప్పటిలాగే ఒక భ్రమలా కనిపిస్తుంది. ఎందుకు?

అది జీవుల మనుగడకు అవసరమా?

మనుగడ కొరకు సాగించే పరిణామక్రమ పోరాటంలో యుద్ధాలు ఒక భాగం గనుక అవి అనివార్యము—అవసరము అని కొందరు చరిత్రకారులూ మనుష్య వర్ణ శాస్త్రజ్ఞులు అంటారు. ఇటువంటి ఆలోచనలవల్ల ప్రభావితుడైన సైనిక విశ్లేషణకారుడు ఫ్రెడ్రిక్‌ వన్‌ బెర్న్‌హార్డీ, 1914లో జరిగిన యుద్ధం “జీవన, సామాజిక, నైతిక విషయాల పురోగతి దృష్ట్యా జరిగింది” అని వాదించాడు. యోగ్యులైన వారిని బ్రతుకనిచ్చి బలహీన దేశాలను వ్యక్తులను ఏరి పారవేయడమే యుద్ధోద్దేశమని ఆ సిద్ధాంతం చెబుతోంది.

అటువంటి వాదన, యుద్ధాలవల్ల విధవరాండ్రు, అనాధలైన లక్షలమంది ప్రజలను ఎన్నడూ ఓదార్చదు. ఈ ఆలోచన నైతికపరంగా విరుద్ధమేకాక, అది ఆధునిక యుద్ధాల పచ్చి నిజాలను పట్టించుకోదు. మెషిన్‌ గన్‌ బలం గలవారియెడల ప్రత్యేక దయను కనపర్చి, వారిని రక్షించదు, బాంబు బలహీనులతో పాటు బలిష్ఠులను సహితం నాశనం చేస్తుంది.

మొదటి ప్రపంచ యుద్ధం నుండి నేర్చుకున్న గంభీరమైన పాఠాలను పట్టించుకోకుండా, అడాల్ఫ్‌ హిట్లర్‌ సైనిక పోరాటం ద్వారా గొప్ప జాతిని, తయారు చేయాలని కలలు కన్నాడు. మెయిన్‌ కాంఫ్‌ అనే తన పుస్తకంలో ఆయన యిలా రాశాడు: “అవిశ్రాంత పోరాటంలో మానవ జాతి గొప్ప స్థితికి ఎదిగింది, అది కేవలం నిత్య శాంతితోనే అంతమొందుతుంది. . . . బలిష్ఠులే అధికారం చెలాయించాలి, వారు బలహీనులతో కలిసిపోకూడదు.” అయితే, హిట్లర్‌ మానవ జాతిని ఉద్ధరించడం బదులు, లక్షలకొలది జీవితాలను బలిచేసి, ఒక ఖండాన్నంతటిని నాశనం చేశాడు.

అయితే, యుద్ధం జీవ మనుగడకు అవసరం కాకపోతే, మానవులను స్వయంనాశనానికి ఏది ప్రేరేపిస్తోంది? ఏ బలం రాజ్యాలను “క్రూరమైన అనాగరికుల చర్యలోకి” నెడుతోంది?a శాంతి స్థాపకుల చక్కటి ప్రయత్నాలను అడ్డగించే కొన్ని మూలాంశాల పట్టిక ఈ క్రింద యివ్వబడింది.

యుద్ధ కారకాలు

జాతీయత. తరచూ రాజకీయ నాయకులూ సేనాధిపతులు ప్రేరేపించిన జాతీయతే, యుద్ధాన్ని రేపడంలో అతి బలమైన శక్తి. అనేక యుద్ధాలు, “జాతీయాసక్తుల” కొరకు లేక “జాతీయ గౌరవం” కొరకు జరిగాయి. జాతీయతా ధోరణి ప్రబలినప్పుడు, తమ శత్రువుల ఆయుధాలు తమపైకి రేగక మునుపే వాటిని నిరుపయోగం చేసే కార్యంగా ఈ ఘోరమైన వివాదాలను సమర్థించడానికి నడిపింది.

జాతి విరోధం. అనేక ప్రాంతాల్లోని యుద్ధాలు, జాతుల, తెగల, వర్గాల మధ్యనున్న దీర్ఘకాలీన ద్వేషంవల్ల చెలరేగి, మరింత ఉద్ధృతమయ్యాయి. మునుపటి యుగోస్లావియా, లైబీరియా, సొమాలియాలందు చెలరేగిన విచారించదగ్గ యుద్ధం యిందుకు సరికొత్త తార్కాణాలు.

ఆర్థిక, సైనిక విరోధం. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు శాంతియుతంగా కనిపించిన రోజుల్లో, ఐరోపా శక్తులు గొప్ప సైన్యాలను తయారుచేసుకున్నాయి. జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్లు యుద్ధ నౌకానిర్మాణ పోటీల్లో నిమగ్నమై ఉన్నాయి. చివరికి ప్రజాసంహారంలో పాల్గొన్న ప్రతి పెద్ద రాజ్యం, యుద్ధం తమను మరింత శక్తివంతులను చేసి, విస్తారమైన ఆర్థిక లాభాలను తెచ్చి పెడుతుందని అనుకోవడం మూలంగా, పరిస్థితులన్నీ యుద్ధానికి అనుకూలంగా ఉన్నాయి.

మతపర కలహం. మత వైషమ్యాలు ప్రత్యేకంగా, జాతి వైషమ్యాలతో బలపర్చబడినప్పుడు, వినాశనకరమైన పరిణామాలను ఉత్పన్నం చేస్తాయి. లెబనాన్‌, తూర్పు ఐర్లాండ్‌లోని వివాదాలు, అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధాలకు మతపర కలహాలే కారణము.

అదృశ్య యుద్ధపిపాసి. “ఈ యుగ సంబంధమైన దేవత,” అపవాదియైన సాతాను, మునుపెన్నటికంటే కూడా యిప్పుడు మరింత చురుకుగా పనిచేస్తున్నాడని బైబిలు బయల్పరుస్తోంది. (2 కొరింథీయులు 4:4) బహు క్రోధంతో నిండినవాడై, తనకు “సమయము కొంచెమే” ఉండడంతో అతను యుద్ధాలతో సహా శ్రమలతోనిండిన భూస్థితిని మరీ ఘోరంగా తయారు చేసే పరిస్థితులను అతను ఉద్ధృతం చేస్తున్నాడు.—ప్రకటన 12:12.

యుద్ధాలకు గల ఈ మూల కారణాలను నివారించడం సులభంకాదు. “చనిపోయినవారు మాత్రమే యుద్ధాంతాన్ని చూశారు” అని ప్లేటో 2,000 సంవత్సరాల క్రితం, అన్నాడు. అతను చేసిన విషాదభరిత మదింపు, మనం అంగీకరించకుండా ఉండలేని కఠోర సత్యమా? లేక ఏదో ఒక రోజున యుద్ధాలు లేని లోకం వస్తుందన్న నిరీక్షణ కల్గివుండడానికి మనకు కారణమేమైనా ఉందా?

[అధస్సూచీలు]

a యుద్ధాన్ని “క్రూరమైన అనాగరికుల చర్య” అని నెపోలియన్‌ పిలిచాడు. తనకు వయస్సు వచ్చిన తర్వాత జీవితమంతటినీ సైన్యంలో గడిపి, దాదాపు 20 సంవత్సరాలు సైన్యాధిపతిగా పనిచేసి, యుద్ధంలోని మృగతత్వాన్ని ఆయన అనుభవించాడు.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover: John Singer Sargent’s painting Gassed (detail), Imperial War Museum, London

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Instituto Municipal de Historia, Barcelona

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి