కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 3/1 పేజీలు 4-6
  • యుద్ధములను అంతముచేయు యుద్ధము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధములను అంతముచేయు యుద్ధము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక శాంతి సంస్థ
  • యుద్ధములన్నింటికి అంతము
  • ముఖ్యయుద్ధ పిపాసి
  • ప్రళయము తరువాత
  • ‘‘అంత్యదినములలో’’ మనమున్నామని మనకెలాతెలుసు
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • త్వరలోనే యుద్ధంలేని లోకం
    తేజరిల్లు!—1996
  • యుద్ధాలు అనివార్యమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యుద్ధం అంతమొందడానికి ఏ నిరీక్షణ వుంది?
    తేజరిల్లు!—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 3/1 పేజీలు 4-6

యుద్ధములను అంతముచేయు యుద్ధము

ఒకరాత్రివేళ ఆకాశంలో ఒకపెద్ద జర్మను జెప్పిలిన్‌ వెళ్లుచున్నది. లండనుపై దాడిచేసినపిదప అది తిరుగు ప్రయాణంలో ఎస్సెక్సలోని ఒక గ్రామం మీదనుండి వెళ్తు దానిపై బాంబులు వేసినది. అందులోని ఒక బాంబు ఫ్రాన్సులో జరుగుచున్న యుద్ధమునుండి సెలవుమీద వచ్చిన ఒకనర్సును చంపివేసింది.

ఇది మొదటి ప్రపంచయుద్ధముయొక్క చిన్న ఉపచిత్రమే, గాని విస్తృతభావాన్ని కల్గియున్నది. మానవుడు “యుద్ధము చేయనేర్చుకొనక” ఉండేకాలానికి అతీతంగా 20శతాబ్ధము ఆయుధాలను, యుద్ధవిమానాలను ఎంతవిస్తారంగా సమకూర్చుకున్నదో వివరించుటకు ఇది ఒక ఉదాహరణ. (యెషయా 2:2-4) కొన్నివేల సంవత్సరముల నుండి యుద్ధాలు భూమిమీద, సముద్రము మీద జరుగుచు వచ్చాయి. కాని మొదటి ప్రపంచయుద్ధంలో పోరాటము ఆకాశమునకు, సముద్ర అడుగుభాగమునకు వ్యాప్తిచెందింది. ఫలితంగా, యుద్ధభూమినుండి వందలమైళ్ల దూరమునున్న పౌరులు బాంబులమూలంగా చంపబడ్డారు, కంటికి కన్పించని జలాంతర్గాములవలన అనేక ఓడలు సముద్రమున ముంచి వేయబడినవి.

నిజమే, ఆ మొదటి భయంకర ప్రపంచయుద్ధ కాలంలో 80 లక్షలసైనికులు పోరాటంలో మరణించారు, మరియు దాని పర్యావసానంగా ఏర్పడిన క్షామము మున్నగు వాటివలన 120 లక్షల సామాన్యపౌరులు చనిపోయినట్లు అంచనా. చరిత్రకారుడైన హెచ్‌.ఎ.ఎల్‌.ఫిషర్‌ అభిప్రాయం ప్రకారం “ ఈ మహాయుద్ధ (1వ ప్రపంచయుద్ధం) విషాదము ఐరోపాలోని అత్యున్నత నాగరికతగల వారిమధ్య ఒక విషయములో చెలరేగిన పోరాటమని ఏ కొద్దిఅవగాహనగల వ్యక్తియైన యిట్టేపసికట్టగలడు.” ఈ భయంకర ఊచకోతను సమర్ధించుటకు “యుద్ధములను అంతంచేయు యుద్ధమని” అది పిలువబడింది. కాని ఆ పదము వట్టి మాయమాటయని త్వరలోనే తేలిపోయింది.

ఒక శాంతి సంస్థ

ఎప్పుడైతే 1918లో శాంతి ప్రకటించబడిందో, అటువంటి యుద్ధము మరిక ఎన్నడు సంభవించకుండా ఉండునట్లు చర్యలు గైకొనవలెనని యుద్ధమువలన నీరసించి పోయిన తరం పట్టుపట్టింది. అలా, నానాజాతిసమితి 1919లో ఉద్భవించింది. కాని ఆ సమితి గొప్పనిరుత్సాహమును కల్గించింది. 1939లో మరొకసారి లోకము ప్రపంచయుద్ధములో మునిగి పోయింది— ఆ యుద్ధం మొదటి దానికన్నా మరింత నాశనకరమైనది.

రెండవప్రపంచయుద్ధకాలంలో పౌరుల జీవితాలు పీడకలగా మార్చివేయబడి అనేకపట్టణాలు మట్టుపెట్టబడినవి. అటుపిమ్మట 1945లో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేయబడినవి. అది మానవుని పరమాణు యుగంలోనికి తోడుకొనిపోయింది. ఆ రెండు జపాను పట్టణములమీద లేచిన ఆ దట్టమైన పొగలు అప్పటినుండి మానవులను భయాందోళనలో ముంచివేసెను.

అయితే, ఆ బాంబులు వేయబడకమునుపే, నానాజాతి సమితి వంటి ఒక సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరిగినవి. దానిఫలితమే ఐక్యరాజ్యసమితి. దీనికికూడ దానికంటె ముందున్న సంస్థవలె —ప్రపంచ శాంతిని కాపాడుట—అనే ధ్యేయమే ఉన్నది. అది సాధించిన దేమిటి? నిజమే, 1945నుండి ప్రపంచయుద్ధాలు లేవు, కాని లక్షలాదిమంది మరణించిన అనేక చిన్నచిన్న యుద్ధాలు జరిగినవి.

అలా అని, ‘మనుష్యులు యుద్ధముచేయనేర్చుకొనరు’ అని యెషయాద్వారా తెల్పబడిన దేవుని వాగ్ధాననెరవేర్పును మానవులు ఇక ఎన్నడు చూడరని దీని భావమా? కాదు, అది మనుష్యునిద్వారా మాత్రము తేబడదని దాని భావము. ‘మనత్రోవకు వెలుగైయున్నది’ అని చెప్పబడిన బైబిలు, అట్టి ప్రేరేపిత వాగ్ధానమును కల్గియున్న పుస్తకము. యుద్ధము లన్నింటిని మాన్పువాడు దేవుడేగాని మరెవరుకాదని బైబిలు తెల్పుచున్నది.—కీర్తన 119:105.

యుద్ధములన్నింటికి అంతము

దీనిముందు శీర్షికలో తెలుపబడినట్లు, తనసహోదరునికి లేక సహోదరికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు ఒక్కసభ్యుడు కూడ తలంచని ఒక అంతర్జాతీయ సహోదరబృందమును స్థాపించిన ఒక గుంపు మొదటి శతాబ్ధములో ఉండెను. అదే క్రైస్తవ సంఘము, దాని సభ్యులు, అక్షరార్ధంగా ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టారు. నేడు మానవులందరూ యుద్ధమును అంతం చేయుటకు ఎట్టిమార్గమును అన్వేషించుకున్నను, ఇట్టిగమ్యాన్ని సాధించిన గుంపు ఉన్నారు. వారెవరు?

ఈ చిన్నగుంపుకు 1914 నకు ముందున్న సంవత్సరములలో బైబిలు నందు నమ్మకముండెను. కనుకనే యుద్ధమును నిర్మూలించుటకు మానవుని ప్రయత్నాలు ఫలించవని వారికి తెలిసెను. తమ బైబిలు పఠనము ద్వారా 1914 సం. మానవచరిత్రలో ఒక మలుపురాయి అని వారుతెలుసుకొని, దీనిని గూర్చి 40సం.లు హెచ్చరికచేసిరి. బైబిలు ప్రవచనమును నిజంచేస్తు క్షామములు, వ్యాధులు, భూకంపములు, మరియు యుద్ధములచే గుర్తించబడిన సమయము 1914లో ప్రారంభమాయెను. (మత్తయి 24:3, 7, 8; లూకా 21:10, 11) “అప్పటికి తెలిసియున్న లోకమంతా 1914లో అంతమైపోయినది.” అని చరిత్రకారుడైన జేమ్సు కేమెరోన్‌ మొదటి ప్రపంచయుద్ధాన్ని గూర్చివ్రాసెను.

ఆ యుద్ధము ముగియక మునుపు, ఫ్లూ అను ఒక భయంకరమైన తెగులు భూగోళమంతా వ్యాపించి 2కోట్ల మందిని చంపివేసెను—అనగా యుద్ధములో చనిపోయిన సైనికుల సంఖ్యకు రెండింతలు కంటె ఎక్కువమంది చనిపోయారు. అప్పటినుండి కాన్సరువంటి వ్యాధి, మరి యిటీవల ఎయిడ్స్‌ అనువ్యాధి మానవులను భయకంపితులను చేస్తున్నది.

మరొక బైబిలు ప్రవచనమును గమనించండి: “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.” (మత్తయి 24:12) ఇది నెరవేరుచున్నదా? నిశ్చయంగా! అనుదినం, లోకమంతటా విస్తరించిన అవినీతి: హత్యలను, దోపిడి, మరియు సామాన్యకొట్లటలకు నడిపింది. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధము “భయమునుండి స్వతంత్రం” చేయునని రాజకీయ జోస్యము. దానికి భిన్నంగా, మనుష్యులు “లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై ధైర్యముచెడి కూలుదురు” అని బైబిలు ఖచ్చితంగా ప్రవచించెను. (లూకా 21:26) మరోసారి మానవుని తలంపులు తప్పు అయి దేవుని ప్రవచనమాటలు నిజమైనవి.

ముఖ్యయుద్ధ పిపాసి

యుద్ధమును చెలరేపువాడే యుద్ధపిపాసి. రాజకీయవేత్తలు, మతాధిపతులు, వ్యాపారవేత్తలు కూడా ఈ పాత్రను నిర్వహించారు. అయితే ప్రముఖ యుద్ధపిపాసి, అపవాదియైన సాతానే తప్పమరెవ్వరు కాదు. లేఖనములలో అతడు, “ఈ యుగ సంబంధమైన దేవుడు” అని పిలువబడెను.—2 కొరింథీయులు 4:4.

వేలసంవత్సరముల క్రితము సాతాను యెహోవాదేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి, అటుపిమ్మట కొంతమంది దేవదూతలు తనతో చేరునట్లు మోసగించెను. కాని 1914లో అతని సమయము అయిపోయింది. బైబిలు మనకిలా తెల్పుచున్నది. “పరలోకమందు యుద్ధము జరిగెను: మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా, ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధముచేసిరిగాని గెలువలేకపోయిరి. కనుక పరలోకమందువారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను; దానిదూతలు దానితోకూడ పడద్రోయబడిరి.”—ప్రకటన 12:7-9.

ఈ భూమి 1914 నుండి ఎందుకంత భయంకర ప్రదేశంగా మారిందో యిది వివరిస్తున్నది. సాతాను క్రిందికి పడద్రోయబడుటవలన కల్గిన ఫలితంగూర్చి బైబిలు ప్రవచించింది: “భూమికి శ్రమ . . . అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధముగలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) ఆ సమయము ఎంత సంకుచితము? యేసు చెప్పెను: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము [1914లో సంఘటనల ప్రారంభము చూచినవాని] గతింపదు.” (మత్తయి 24:34) ఏ సంగతులు? మన దినమును గూర్చి యేసు ప్రవచించిన అన్ని విపత్తులు శ్రమలు.

అయితే నానాజాతిసమితి వైఫల్యమును, ప్రస్తుత ఐక్యరాజ్యసమితి యొక్క నిస్సత్తువను చూచియున్నను, శాంతిని సాధించుటకు దేశాలు తమ స్వంతప్రయత్నాలు చేయుట మానవని బైబిలు తెల్పుచున్నది. నిజమే, తాము విజయము సాధించామని తలంచే సమయము వస్తుంది. “శాంతి మరియు భద్రతను” గూర్చి గొప్పకేక వినబడును, కాని దానివెనుక ఈ కలుషిత లోకానికి “ఆకస్మిక నాశనము” వచ్చును. అంధకారమందున్నందున, “రాత్రివేళ దొంగవచ్చినట్లు” ఈ హఠాత్‌మార్పు ప్రజలను ఆశ్చర్యపర్చును.—1 థెస్సలొనీకయులు 5:2, 3.

ఇది దేనికి నడిపించును? “యుద్ధములను అంతంచేయు యుద్ధము” అని నిజంగా నిరూపించు యుద్ధమునకు నడుపును: అదే ఆర్మగెద్దోను పోరాటము, బైబిలునందు “సర్వోన్నతుడైన దేవునియొక్క మహాదినయుద్ధము” అని పిలువబడెను. అనగా సమస్త దుష్టమూలకములు వాటి మద్దతుదారుల నాశనమని అర్ధము. “కీడుచేయువారు నిర్మూలమగుదురు”. (ప్రకటన 16:14-16; కీర్తన 37:9) చివరిగా, గొప్పయుద్ధ పిపాసియైన సాతాను, మానవులపై ప్రభావము కల్గియుండని చోట బంధింపబడును. అటుతరువాత అతడు కూడ నిర్మూలించబడును.—ప్రకటన 20:1-3, 7-10.

అయితే, ఇది నేరస్థులను, నిర్దొషులను కూడ అజ్ఞానముతో సంహరించునటువంటి అనాలోచనయైన నాశనముచేయు యుద్ధము వంటిది కాదని గమనించుము. తప్పించుకొనువారు ఉంటారు. వారెవరనగా, “రాత్రింబగళ్లు (దేవునికి) పవిత్రసేవచేయువారు.” అవును, ఇప్పుడుకూడ యుద్ధము చేయనేర్చుకొనుటకు నిరాకరించి, నిజక్రైస్తవుని శాంతియుతమైన మార్గములను అనుసరించువారు, ఈ అంతిమ, మహాయుద్ధమును తప్పించుకొంటారు. ఎక్కువమంది ఉండగలరా? బైబిలు వారిని “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు వచ్చి యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” అని పిలుచుచున్నది. —ప్రకటన 7:9, 14, 15.

ప్రళయము తరువాత

వీరు ఎంత ఉపశమనము పొందగలరు! జాతీయభావములుగల అనేక ప్రభుత్వములకు బదులు, అక్కడ ఒకే ఒక ప్రభుత్వముండును: అదే దేవుని రాజ్యము. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) గర్వము, అత్యాశగలవారికి బదులు, దీనులు భూమిని స్వతంత్రించుకొని “బహుక్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11) “దేవుడు తానే. . . వారికన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:3, 4) యెహోవా “భూమియందంతట యుద్ధములను లేకుండాచేయును.” ఖడ్గములు నాగటినక్కులవలె, ఈటెలు కొమ్మలను నరికే కత్తివలె చేయబడును, మరియు ‘వారు యుద్ధముచేయ నేర్చుకొనుట యిక మానివేస్తారు.’—కీర్తన 46:8, 9; యెషయా 2:4.

అట్టిలోకంలో నీవు జీవించగోరుదువా? నీవు కోరుతావు! అదిసాధ్యపడే అవకాశం ఉంది. మొదటి మెట్టు ఏమనగా నీవు దేవుని వాక్యమైన బైబిలును పఠించి ఈ నిరీక్షణ నిజమని, ఆధారపడదగినదని నిన్ను నీవు ఒప్పించుకొనుము. పిమ్మట, ఇప్పుడు నీ విషయములో దేవుని చిత్తమేమిటో బైబిలునుండి తెలిసికొని దాని ప్రకారంచేయుము. నిజమే, పఠనమంటే ప్రయాసతోకూడినది, కాని అది విలువైనది. నీవు సంపాదించిన జ్ఞానమును సరియైన విధముగా ఉపయోగిస్తే “అది నిత్యజీవము” అని యేసుచెప్పెను. (యోహాను 17:3) దానికంటె ప్రాముఖ్యమైనది ఏమైన ఉన్నదా? (w88 11/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి