కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీ 32
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • క్రొత్త నిబంధన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కొత్త ఒప్పందం గురించి యెహోవా ముందే చెప్పాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవా నిబంధనల దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీ 32

పాఠకులనుండి ప్రశ్నలు

◼ యేసు కొయ్యపై మరణించినప్పుడు ధర్మశాస్త్రము ముగించబడినదా, మరియు దానిస్థానమున నూతననిబంధన ఎప్పుడు ఉంచబడినది?

సా.శ. 33 నీసాను 14 సాయంసమయమున యేసు హింసాకొయ్యపై మరణించుట, పరలోకములో తన జీవరక్త విలువను అందించుట, మరియు సా.శ. 33లో పెంతెకొస్తు దినమున తాను పరిశుద్ధాత్మను కుమ్మరించుట: ఈ మూడు సంఘటనలను మనస్సునందుంచుకొని అనేకమంది ఈ ప్రశ్నలను అడిగిరి. లేఖనానుసారముగా, ధర్మశాస్త్రము ముగించబడి పెంతెకొస్తునాడు దాని స్థానమున క్రొత్తనిబంధన ఉంచబడినది. ఇది అట్లు ఎందుకో మనమిప్పుడు చూద్దాము.

ధర్మశాస్త్రము క్రింద సాధ్యముకాని, సంపూర్ణ పాపక్షమాపణను అనుమతించు “క్రొత్త నిబంధనను,” తగిన కాలమున ధర్మశాస్త్రముయొక్క స్థానమందుంచుదునని యెహోవా ముందుగనే చెప్పెను. (యిర్మీయా 31:31-34) ఎప్పుడు ఆ మార్పిడి జరిగినది?

పాతనిబంధనయగు ధర్మశాస్త్రము, దాని సంకల్ప నెరవేర్పు తర్వాత తీసివేయబడుట మొదట జరుగవలెను. (గలతీయులు 3:19, 24, 25) అపొస్తలుడైన పౌలు ఇలావ్రాసెను: “దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలవలన మనమీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో హింసాకొయ్యకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించెను.” (కొలస్సయులు 2:13, 14, NW) అంటే యేసు మరణించిన ఆ క్షణమందే, ధర్మశాస్త్రము స్థానే క్రొత్తనిబంధన ఉంచబడినదని దాని భావమా?

లేదు, ఏలయనగా క్రొత్తనిబంధన సరియైన బలిరక్తముతో మరియు క్రొత్త జనాంగమగు ఆత్మీయ ఇశ్రాయేలుతో ప్రారంభము కావలసియుండెను. (హెబ్రీయులు 8:5, 6; 9:15-22) యేసు నీసాను 16న పునరుత్ధానుడై, ఆతర్వాత 40 దినములకు పరలోకమునకు ఆరోహణమయ్యెను. (అ. కార్యములు 1:3-9) ఆరోహణమయిన తర్వాత పది దినములకు, లేక పెంతెకొస్తునాడు తండ్రి యొద్దనుండి తాను పొందిన “వాగ్దానము చేయబడిన” పరిశుద్ధాత్మను యేసు తన శిష్యులమీద కుమ్మరించెను, కాగా ఆత్మీయ ఇశ్రాయేలు ఉనికిలోనికి వచ్చెను. (అ. కార్యములు 2:33) యేసు క్రీస్తను మధ్యవర్తిద్వారా దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలుతో క్రొత్తనిబంధనను చేయును.

పరస్పరసంబంధము కలిగియున్న ఈ సంగతుల దృష్ట్యా, ఏ సమయమందు ధర్మశాస్త్రము స్థానే క్రొత్తనిబంధన ఉంచబడినది?

యేసు మరణముతో ధర్మశాస్త్రము ముగించబడినదని ఎవరు చెప్పలేరు. ఆత్మీయజీవమునకు పునరుత్ధానుడైన తర్వాత 40 దినములపాటు యేసు భూమిమీదనే యుండెను, కాగా ఆయన శిష్యులు ఇంకను ధర్మశాస్త్రమును అనుసరించుచుండిరి. అంతేకాకుండా, ప్రధాన యాజకుడు సంవత్సరమునకొకసారి అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుట ధర్మశాస్త్రములో ఒక ముఖ్యాంశమైయున్నది. అది యేసు పరలోకమునకు పునరుత్ధానమగుటకు చిత్రీకరణగాయుండెను. అక్కడ, దేవుని సముఖమున, క్రొత్తనిబంధనకు మధ్యవర్తిగా ఆయన తన విమోచనా బలివిలువను అర్పించగలడు. (హెబ్రీయులు 9:23, 24) యిర్మీయా 31:31-34యొక్క నెరవేర్పునందు, ఇది క్రొత్తనిబంధనను ఆరంభించుటకు మార్గమును తెరిచినది.

విమోచనా బలిని అంగీకరించినమీదట యెహోవా చర్య గైకొనినప్పుడు క్రొత్తనిబంధన ప్రభావములోనికి వచ్చెను. రాజ్యము కొరకు క్రొత్తనిబంధనలో చేరియుండువారితో తయారగు క్రొత్త జనాంగమగు, ఆత్మీయ ఇశ్రాయేలును ఉనికిలోనికి తెచ్చుటకు ఆయన యేసు నమ్మకమైన శిష్యులమీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించెను. (లూకా 22:29; అ. కార్యములు 2:1-4) అలంకారార్థముగా ధర్మశాస్త్రమును యేసు మరణించిన కొయ్యకు మేకులతో కొట్టివేయుటద్వారా, దేవుడు దానిని రద్దుచేసినట్లు ఇది చూపించినది. కాబట్టి, సా.శ. 33 పెంతెకొస్తునాడు క్రొత్త జనాంగమగు ఆత్మీయ ఇశ్రాయేలు పుట్టుకతో క్రొత్తనిబంధన పనిచేయుటకారంభించినప్పుడు లేక ప్రారంభమైనప్పుడు ధర్మశాస్త్రము ముగించబడెను.—హెబ్రీయులు 7:12; 8:1, 2.

ప్రశ్నకివ్వబడిన ప్రాధమిక సమాధానముకంటే ఎక్కువగా వెళ్ళి, సా.శ. 33లో ధర్మశాస్త్ర ముగింపు మరియు క్రొత్తనిబంధన ఆగమనముతో, సహజ ఇశ్రాయేలీయులను యెహోవా పూర్తిగా విడనాడలేదని మనము గమనించగలము. ఉదాహరణకు, అబ్రాహాము నిబంధన ప్రకారము, సా.శ. 36లో ముగిసిన 70వ “వారము”నందు యూదులు, యూదామత ప్రవిష్టులు, సమరయులయెడల యెహోవా ప్రత్యేక ఆదరణను చూపించెను. (ఆదికాండము 12:1-3; 15:18; 22:18; దానియేలు 9:27; అ. కార్యములు 10:9-28, 44-48) సా.శ. 33తర్వాత ధర్మశాస్త్రమును పాటించనవసరములేదను వాస్తవమునకు తమను సవరించుకొనుటకు, అభిషక్తులైన యూదాక్రైస్తవులకు సహితము కొంత సమయము కావల్సివచ్చినది; సా.శ. 49లో గవర్నింగ్‌ బాడికి తీసుకొనివచ్చిన ప్రశ్నద్వారా దీనిని మనము చూడవచ్చును. (అ. కార్యములు 15:1, 2) సా.శ. 70లో ఆలయమును, అలాగే ధర్మశాస్త్రమునకు సంబంధించిన వంశావళి పట్టికలను రోమన్లు నాశనముచేసి నిర్మూలించినప్పుడు, నిర్వివాదముగా ధర్మశాస్త్రము పూర్తిగా విడిచిపెట్టబడెనని నిరూపించబడినది.—మత్తయి 23:38. (w89 2/1)

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి