కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 6
  • ధైర్యం చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ధైర్యం చూపించండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఏం చేశాడు?
  • యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • యేసులా ఉందాం
  • యేసులా ధైర్యంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?
    మన రాజ్య పరిచర్య—2000
  • ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా బోధిస్తుండండి
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 6

మొదటిసారి మాట్లాడేటప్పుడు

యేసు జక్కయ్యను చెట్టుమీద నుండి దిగమని అడిగేసరికి, చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

లూకా 19:1-7

పాఠం 6

ధైర్యం చూపించండి

సూత్రం: “మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, . . . మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.”—1 థెస్స. 2:2.

యేసు ఏం చేశాడు?

యేసు జక్కయ్యను చెట్టుమీద నుండి దిగమని అడిగేసరికి, చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

వీడియో: యేసు జక్కయ్యకు ప్రకటించాడు

1. వీడియో చూడండి, లేదా లూకా 19:1-7 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. కొంతమంది జక్కయ్యను ఎందుకు దూరం పెట్టి ఉండవచ్చు?

  2. బి. అయినప్పటికీ అతనికి మంచివార్త ప్రకటించేలా యేసును ఏది కదిలించింది?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. పక్షపాతం లేకుండా ప్రతీ ఒక్కరికి దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాలంటే మనకు ధైర్యం అవసరం.

యేసులా ఉందాం

3. యెహోవా మీద ఆధారపడండి. ప్రకటించడానికి పవిత్రశక్తి యేసుకు సహాయం చేసినట్టే మీకు కూడా సహాయం చేస్తుంది. (మత్త. 10:19, 20; లూకా 4:18) మీకు కొంతమందితో మాట్లాడడానికి భయంగా అనిపిస్తే ధైర్యం కోసం యెహోవాను అడగండి.—అపొ. 4:29.

4. ఎదుటి వ్యక్తి గురించి ముందే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. మనం కొందరి ఆర్థిక స్థితి, జీవన విధానం, మత నమ్మకాలు, కనిపించే తీరును బట్టి వాళ్లతో మాట్లాడడానికి వెనుకాడుతుండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి:

  1. ఎ. హృదయాలను చదివే సామర్థ్యం కేవలం యెహోవా, యేసుకు మాత్రమే ఉంది; మనకు లేదు.

  2. బి. యెహోవా చూపించే కరుణను పొందలేని వాళ్లంటూ ఎవరూ ఉండరు.

5. ధైర్యంగా ఉంటూనే, నేర్పుగా జాగ్రత్తగా మాట్లాడండి. (మత్త. 10:16) వాదనలకు దిగకండి. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినా లేదా ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా గౌరవపూర్వకంగా మీ మాటల్ని ముగించండి.—సామె. 17:14.

ఇవి కూడా చూడండి

అపొ. 4:31; ఎఫె. 6:19, 20; 2 తిమో. 1:7

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి