కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/00 పేజీ 1
  • మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసులా ధైర్యంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా బోధిస్తుండండి
    మన రాజ్య పరిచర్య—2005
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2018-2019 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం​—⁠ప్రాంతీయ పర్యవేక్షకునితో
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 12/00 పేజీ 1

మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?

1 వ్యతిరేకులు పేతురు యోహానులను బంధించి, భయపెట్టినప్పటికీ రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో వాళ్లు ధైర్యంతో కొనసాగారు. (అపొ. 4:17, 21, 31) ధైర్యంగా ప్రకటించడమంటే నేడు మనకు ఏ అర్థాన్నిస్తుంది?

2 ధైర్యంగా సాక్ష్యమివ్వడం: “ధైర్యం” అనే పదానికి పర్యాయపదం “ధీరత్వం,” అంటే “నిర్భయంగా ఉండడం, దృఢంగా ఉండడం, తాళుకోవడం” అని అర్థం. నిజ క్రైస్తవుల విషయానికొస్తే ధైర్యంగా ప్రకటించడమంటే ఇతరులతో సువార్తను పంచుకోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా భయపడకుండా మాట్లాడడమేనని అర్థం. (అపొ. 4:20; 1 పేతు. 3:15,16) అంటే సువార్తను గురించి మనం సిగ్గుపడకూడదని దానర్థం. (కీర్త. 119:46; రోమా. 1:16; 2 తిమో. 1:8) అలా ధైర్యమనేది ఈ అంత్యదినాల్లో సువార్తను ప్రకటించే మన నియామకాన్ని నెరవేర్చేందుకు అవసరమైన ఒక లక్షణమైవుంది. ప్రజలు ఎక్కడుంటారో అక్కడ వారితో సువార్తను పంచుకొనేందుకు మనల్ని అది కదిలిస్తుంది.​—అపొ. 4:29, 30బి; 1 కొరిం. 9:23.

3 స్కూల్‌లో ధైర్యంగా ఉండడం: సహజ సిద్ధమైన భయమూ పిరికితనమూ మీ స్కూల్లోని తోటి విద్యార్థులకు ప్రకటించకుండా ఉండేలా మిమ్మల్ని వెనుకకు లాగుతున్నాయా? ప్రకటించడం కొన్నిసార్లు అంత సులభం కాకపోవచ్చు; వాస్తవానికది ఒక నిజమైన సవాలుగా ఉండగలదు. అయినప్పటికీ, ఇతరులకు ప్రకటించేందుకు కావలసిన ధైర్యం కోసం యెహోవాకు మీరు ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని తప్పక బలపరుస్తాడు. (కీర్త. 138:⁠3) యెహోవాసాక్షుల్లో మీరు ఒకరిగా గుర్తించబడేందుకూ, పరిహాసాలను తట్టుకొని నిలబడేందుకూ ధైర్యం మీకు సహాయపడుతుంది. ఫలితంగా, స్కూల్లో మీరు చేసే ప్రకటనాపని మీరు చెప్పేదాన్ని వినేవారిని రక్షించవచ్చు.​—1 తిమో. 4:16.

4 పని స్థలంలో ధైర్యం కలిగివుండడం: మీరు పనిచేసే చోట మీరు యెహోవాసాక్షుల్లో ఒకరని మీ తోటి పనివారికి తెలుసా? మీ తోటి ఉద్యోగస్థులు సువార్తను తెలుసుకోవడానికున్న ఏకైక మార్గం బహుశా మీరు వారికి ప్రకటించడమే కావచ్చు. మీరు చూపించే ధైర్యం, మీరు మీ క్రైస్తవ కూటాలకూ, సమావేశాలకూ హాజరయ్యేందుకు అవసరమైన సెలవులను పొందడానికి సహాయపడుతుంది కూడా.

5 శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ధైర్యంగా ఉండడం: మనం వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు, ధైర్యాన్ని కూడగట్టుకోవడం ప్రాముఖ్యం. (1 థెస్స. 2:1, 2) అది మనం బెదిరింపులకూ, పరిహాసానికీ గురైనప్పుడు అంటే తీవ్రమైన హింసకు గురైనప్పుడు మన విశ్వాసాన్ని గట్టిగా అంటి పెట్టుకొని ఉండేందుకు సహాయపడుతుంది. (ఫిలి. 1:27, 28) మన దేవుడైన యెహోవా ప్రమాణాలకు మనం నమ్మకంగా అంటిపెట్టుకొని ఉంటాం. ధైర్యంగా ఉండడం, దాని విషయంలో రాజీ పడిపోయేంతటి ఒత్తిడికి లోనయినప్పుడు స్థిరంగా నిలబడేలా మనలను దృఢపరుస్తుంది. ఇతరులు వివాదాలకు దిగేలా రెచ్చగొట్టినప్పుడు మనం వారితో సమాధానంగా ఉండేలా మనల్ని బలపరుస్తుంది.​—రోమా. 12:18.

6 వ్యక్తిగతంగా మనమెలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నా ధైర్యంగా సువార్తను ప్రకటించడంలో పట్టుదల కలిగివుందాం.​—ఎఫె. 6:18-20.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి