కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 5
  • నేర్పుగా మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేర్పుగా మాట్లాడండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు ఏం చేశాడు?
  • పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • పౌలులా ఉందాం
  • ‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • వినయం చూపించండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 5

మొదటిసారి మాట్లాడేటప్పుడు

అపొస్తలుడైన పౌలు ఏథెన్సు ప్రజలతో తర్కిస్తూ, వాళ్లకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు.

అపొ. 17:22, 23

పాఠం 5

నేర్పుగా మాట్లాడండి

సూత్రం: “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.”—కొలొ. 4:6.

పౌలు ఏం చేశాడు?

అపొస్తలుడైన పౌలు ఏథెన్సు ప్రజలతో తర్కిస్తూ, వాళ్లకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు.

వీడియో: పౌలు ఏథెన్సు ప్రజలకు ప్రకటించాడు

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 17:22, 23 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. ఏథెన్సు ప్రజలు పాటిస్తున్న అబద్ధమత ఆచారాల్ని చూసినప్పుడు పౌలుకు ఎలా అనిపించింది?—అపొస్తలుల కార్యాలు 17:16 చూడండి.

  2. బి. ఏథెన్సు ప్రజల్ని తప్పుబట్టకుండా వాళ్ల నమ్మకాల్ని ఉపయోగించుకుంటూనే పౌలు మంచివార్తను నేర్పుగా ఎలా ప్రకటించాడు?

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం ఏం చెప్తున్నాం అనే దాంతో పాటు దాన్ని ఎలా చెప్తున్నామో, ఎప్పుడు చెప్తున్నామో కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మాట్లాడితే ప్రజలు మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు.

పౌలులా ఉందాం

3. మంచి పదాల్ని ఎంచుకోండి. ఉదాహరణకు క్రైస్తవులుకాని వాళ్లతో యేసు గురించి, బైబిలు గురించి మాట్లాడేటప్పుడు వాళ్లకు అర్థమయ్యే పదాలను ఉపయోగించండి. అలాగే వాళ్లకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకుండా జాగ్రత్తపడండి.

4. ఎదుటి వ్యక్తిని వెంటనే సరిచేయకండి. ఆయన్ని తన మనసులో ఉన్నదంతా ఫ్రీగా చెప్పనివ్వండి. ఒకవేళ బైబిలు బోధలకు విరుద్ధంగా ఏమైనా చెప్తే వాదించకండి. (యాకో. 1:19) ఆయన చెప్పేది వినడం ద్వారా ఆయన ఏం నమ్ముతున్నాడో, ఎందుకు అలా నమ్ముతున్నాడో మీరు తెలుసుకోగలుగుతారు.—సామె. 20:5.

5. వీలైనప్పుడల్లా ఎదుటి వ్యక్తి చెప్తున్న వాటిని ఒప్పుకోండి, వాళ్లను మెచ్చుకోండి. తన మత నమ్మకాలే సరైనవని ఆయన బలంగా నమ్ముతుండవచ్చు. కాబట్టి ముందు మీరిద్దరూ ఒప్పుకునే విషయాలతో మాటలు మొదలుపెట్టి తర్వాత బైబిలు సత్యాల్ని అర్థం చేసుకోవడానికి ఆయనకు మెల్లమెల్లగా సహాయం చేయండి.

ఇవి కూడా చూడండి

సామె. 25:15; 2 తిమో. 2:23-26; 1 పేతు. 3:15

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి