కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g22 No. 1 పేజీలు 10-12
  • 3 | బంధాల్ని బలపర్చుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 3 | బంధాల్ని బలపర్చుకోండి
  • తేజరిల్లు!—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకో తెలుసా?
  • మీకు తెలుసా?
  • ఇప్పుడు ఏం చేయాలి?
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?
    తేజరిల్లు!—2022
మరిన్ని
తేజరిల్లు!—2022
g22 No. 1 పేజీలు 10-12
పెద్దవయసున్న ఒక జంట చాలా సంతోషంగా ఉన్నారు.

ప్రపంచమంతా గందరగోళం

3 | బంధాల్ని బలపర్చుకోండి

ఎందుకో తెలుసా?

ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు పెరిగేకొద్దీ ప్రేమలు తగ్గిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి.

  • కొంతమంది తమ స్నేహితుల్ని దూరం పెడుతున్నారు.

  • భార్యాభర్తలైతే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.

  • తల్లిదండ్రులు తమ పిల్లల ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా, వాళ్ల టెన్షన్‌లో వాళ్లుంటున్నారు.

మీకు తెలుసా?

  • స్నేహితులు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం బాలేకపోయినా, మనసు బాలేకపోయినా వాళ్లు తోడుగా ఉంటారు.

  • చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడివల్ల కుటుంబంలో మీరు ఊహించని సమస్యలు తలెత్తవచ్చు.

  • పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో పిల్లలు న్యూస్‌లో విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ వాళ్లు కంగారు పడవచ్చు, భయపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

స్నేహితులు మనకు ధైర్యం చెప్పి, తెలివైన సలహాలిస్తారు. వాళ్లిచ్చే అండతో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవడం తేలికౌతుంది.

సురక్షితంగా జీవించడం ఎలా?—చక్కని చిట్కాలు

ప్రపంచంలో పరిస్థితులు బాలేనప్పుడు బంధాల్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి

మీ భర్తకు లేదా భార్యకు మరింత దగ్గరవ్వండి

పెద్దవయసున్న ఒక జంట చాలా సంతోషంగా ఉన్నారు.

మీ భర్తకు లేదా భార్యకు మరింత దగ్గరవ్వండి

బైబిలు ఇలా చెప్తుంది: “ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది, ఎందుకంటే . . . వాళ్లలో ఒకరు పడిపోతే, తోటివ్యక్తి అతన్ని పైకి లేపుతాడు.” (ప్రసంగి 4:9, 10) భార్యాభర్తలు ఒకే టీంలో ఆడే ప్లేయర్స్‌లా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. అంతేగానీ, వేర్వేరు టీముల్లో ఉంటూ ఒకరితో ఒకరు పోటీపడే ప్లేయర్స్‌లా ఉండకూడదు.

  • ఎవరిమీదో కోపం మీ భార్య మీదగానీ, భర్త మీదగానీ చూపించకండి. ఓర్పుగా ఉండండి.

  • మీ మధ్యవున్న సమస్యల గురించి కనీసం వారంలో ఒక్కసారైనా కూర్చుని మాట్లాడుకోండి. ఒకరితో ఒకరు పోట్లాడుకునే బదులు, ఇద్దరూ కలిసి సమస్యతో పోరాడండి.

  • ఇద్దరికీ ఇష్టమైన పనుల్ని కలిసి చేయడానికి ప్రయత్నించండి.

  • మీ ఇద్దరూ కలిసి గడిపిన ఆనందక్షణాల్ని గుర్తుచేసుకోండి. అందుకోసం మీ పెళ్లి ఫోటోల్ని చూడవచ్చు లేదా వేరే తీపి జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవచ్చు.

“భార్యాభర్తల మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. అంతమాత్రాన వాళ్ల ఆలోచనలు ఎప్పటికీ కలవవు అనికాదు. అలాంటివాళ్లు కూడా కలిసి ఒక నిర్ణయానికి రాగలరు, అనుకున్న పనిని కలిసి పూర్తి చేయగలరు.”—డేవిడ్‌.

మీ స్నేహితుల్ని వదులుకోకండి

  • వేర్వేరు దేశాలకు చెందిన అమ్మాయిలు నవ్వుతూ, సరదాగా కలిసి సమయం గడుపుతున్నారు.

    మీ స్నేహితుల్ని వదులుకోకండి

    మీ స్నేహితులు మీకు అండగా ఉన్నారనుకుంటే సరిపోదు. మీరు కూడా వాళ్లకు ఏవిధంగా అండగా ఉండవచ్చో ఆలోచించండి. వేరేవాళ్లకు ధైర్యం చెప్పినప్పుడు మీ ధైర్యం కూడా పెరుగుతుంది.

  • ప్రతీరోజు మీ ఫ్రెండ్స్‌లో కొంతమందికి ఫోన్‌చేసి పలకరించండి.

  • మీలాంటి సమస్యలు మీ స్నేహితులకు వచ్చుంటే, వాటిని వాళ్లెలా తట్టుకున్నారో అడిగి తెలుసుకోండి.

“సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, స్నేహితులు మన చేయి పట్టుకుని పైకి లాగుతారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు, మర్చిపోయిన విషయాల్ని మనకు ఒకసారి గుర్తుచేసి సరిగ్గా ఆలోచించేందుకు సహాయపడతారు. వాళ్లు మన గురించి ఆలోచిస్తారు, మనం కూడా వాళ్ల గురించి ఆలోచిస్తామని నమ్ముతారు.”—నిఖిల.

మీ పిల్లల ఫీలింగ్స్‌ని పట్టించుకోండి

ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో ర్యాంపు మీద కూర్చుని ప్రకృతి అందాన్ని ఆనందిస్తున్నారు.

మీ పిల్లల ఫీలింగ్స్‌ని పట్టించుకోండి

బైబిలు ఇలా చెప్తుంది: “వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు.” (యాకోబు 1:19) మొదట్లో మీ పిల్లలు వాళ్ల మనసులోని భయాల్ని, ఆందోళనల్ని మీకు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మీరు ఓర్పుతో వింటే వాళ్లే మెల్లగా అన్నీ చెప్తారు.

  • చాలామంది పిల్లలు వాళ్లను కూర్చోబెట్టి అడిగినప్పుడు కన్నా, రిలాక్స్‌గా ఉన్నప్పుడే ఫ్రీగా మాట్లాడతారు. అంటే, సరదాగా అలా కారులో బయటికి వెళ్లినప్పుడో, వాకింగ్‌కు వెళ్లినప్పుడో ఓపెన్‌గా అన్ని విషయాలు చెప్తుంటారు. కాబట్టి, మీ పిల్లలు ఫ్రీగా మాట్లాడాలంటే ఏం చేయాలో ఆలోచించండి.

  • మీ పిల్లల్ని కంగారుపెట్టే వార్తలను ఎక్కువగా చూడనివ్వకండి.

  • మీ కుటుంబం సేఫ్‌గా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మీ పిల్లలకు చెప్పండి.

  • అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో ముందే ఆలోచించి పెట్టుకోండి. దాన్ని మీ పిల్లలతో ప్రాక్టీస్‌ చేయండి.

“మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ల మనసులో ఉన్న భయం, కంగారు, కోపం ఇలా ఏదైనా గానీ బయటికి చెప్పమనండి. మీకు కూడా అలాంటి ఫీలింగ్సే ఉన్నాయని వాళ్లకు తెలియనివ్వండి. వాటినుండి బయటపడడానికి ఏం చేశారో కూడా వాళ్లకు చెప్పండి.”—బెతనీ.

“ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం” వీడియోలోని ఒక సన్నివేశం. ఒక జంట చేతులు పట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నారు.

ఎక్కువ తెలుసుకోండి. ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం వీడియో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి