కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g22 No. 1 పేజీలు 7-9
  • 2 | పొదుపుగా జీవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2 | పొదుపుగా జీవించండి
  • తేజరిల్లు!—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకో తెలుసా?
  • మీకు తెలుసా?
  • ఇప్పుడు ఏం చేయాలి?
  • ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?
    అదనపు అంశాలు
  • డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి
    తేజరిల్లు!—2025
  • డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
మరిన్ని
తేజరిల్లు!—2022
g22 No. 1 పేజీలు 7-9
వడ్రంగి ఒక మేకును సుత్తితో కొడుతూ చెక్కలోకి దించుతున్నాడు.

ప్రపంచమంతా గందరగోళం

2 | పొదుపుగా జీవించండి

ఎందుకో తెలుసా?

చాలామందిది, రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. విపత్తులు జరిగినప్పుడు, అంటువ్యాధులు వ్యాపించినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారౌతుంది. ఎందుకు?

  • ఏ ప్రాంతాల్లోనైతే పరిస్థితులు బాలేవో అక్కడ నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోతాయి.

  • మారిన పరిస్థితులవల్ల కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు, లేదా జీతాలు తగ్గిపోవచ్చు.

  • తుఫాన్లు, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు షాపులు, ఇళ్లు కూలిపోతాయి, భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. చాలామంది ఉన్నదంతా పోగొట్టుకుని వట్టిచేతులతో మిగిలిపోతారు.

మీకు తెలుసా?

  • ఇప్పుడు డబ్బును పొదుపు చేస్తే, పరిస్థితులు తారుమారైనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది.

  • మీరు సంపాదించిన డబ్బుకు, ఆస్తులకు ఈరోజు ఉన్న విలువ రేపు ఉండకపోవచ్చు.

  • డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి. సంతోషాన్ని, కుటుంబ బంధాల్ని ఎంత డబ్బు పెట్టినా కొనలేం.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”—1 తిమోతి 6:8.

తృప్తిగా జీవించడమంటే కోరికలు తగ్గించుకుని, రోజువారీ అవసరాలు తీరితే చాలు అనుకోవడం. ముఖ్యంగా, మన ప్రాంతంలో పరిస్థితులు బాలేనప్పుడు ఇలా జీవించడం చాలా అవసరం.

తృప్తిగా జీవించాలంటే తక్కువ డబ్బుతోనే సర్దుకొని బ్రతకాల్సి రావచ్చు. ఒకవేళ సంపాదన కన్నా ఖర్చు ఎక్కువైతే, సమస్యలు ఎక్కువౌతాయే గానీ తగ్గవు.

సురక్షితంగా జీవించడం ఎలా?—చక్కని చిట్కాలు

ప్రపంచంలో పరిస్థితులు బాలేనప్పుడు పొదుపుగా జీవించడానికి ఇలా చేయండి

ఖర్చులు తగ్గించుకోండి

  • ఒక పెద్దావిడ పెరట్లో పెంచిన కూరగాయల తోట నుండి క్యారెట్లు కోస్తోంది.

    ఖర్చులు తగ్గించుకోండి

    నిజంగా అవసరమైతే తప్ప వస్తువుల్ని గానీ, బట్టల్ని గానీ కొనకండి. మీకు బైక్‌ గానీ, కారు గానీ ఉంటే పెట్రోల్‌కు అయ్యే ఖర్చు తగ్గించుకోవడానికి ఏం చేయవచ్చో ఆలోచించండి. ఇంట్లోనే కూరగాయల్ని పండించుకోవడం వీలౌతుందేమో చూడండి.

  • ఏదైనా కొనేముందు ‘అది నిజంగా నాకు అవసరమా? దాన్ని కొనగలిగేంత డబ్బు నా దగ్గరుందా?’ అని ఆలోచించుకోండి.

  • కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వాలు, కొన్ని పథకాలు ఇస్తుంటాయి. వాటిని పొందడానికి మీరు అర్హులైతే అప్లై చేసుకోండి.

“మా కుటుంబమంతా కూర్చుని వేటివేటికి ఎంత ఖర్చుపెడుతున్నామో మాట్లాడుకున్నాం. సరదాల కోసం పెట్టే ఖర్చును తగ్గించుకున్నాం. తక్కువ ఖర్చుతోనే భోజనం వండుకోవడం కూడా మొదలుపెట్టాం.”—గిరీష్‌.

మీ బడ్జెట్‌ రాసుకోండి

ఒకావిడ రసీదు చూస్తూ కాలిక్యులేటర్‌లో లెక్కలేసి, ఆ వివరాల్ని ఒకచోట రాసుకుంటోంది.

మీ బడ్జెట్‌ రాసుకోండి

బైబిలు ఇలా చెప్తుంది: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి, తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.” (సామెతలు 21:5) బడ్జెట్‌ రాసుకోవడం వల్ల, మీ సంపాదనకు మించి ఖర్చు చేయకుండా ఉంటారు.

  • ముందుగా నెలకు మీ సంపాదన ఎంతో రాసుకోండి.

  • తర్వాత, దేనిదేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో రాసుకోండి. వీటిలో ఏవైనా ఖర్చులు తగ్గించుకోవచ్చేమో చూడండి.

  • మీ సంపాదనతో ఖర్చుల్ని పోల్చి చూసుకోండి. ఒకవేళ ఖర్చులు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తే, అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉన్నాయేమో చూసి వాటిని తగ్గించుకోండి.

“నేనూ, నా భార్యా ప్రతీనెల మాకు వచ్చే జీతాన్ని, ఖర్చుల్ని ముందే రాసిపెట్టుకుంటాం. అనుకోకుండా వచ్చిపడే ఖర్చుల కోసం, కొత్త వస్తువుల్ని కొనుక్కోవడం కోసం కొంతతీసి పక్కన పెడుతుంటాం. మాకు వచ్చే జీతాన్ని ఎలా వాడాలో ముందే అనుకోవడంవల్ల ఎలాంటి చింత లేకుండా ఉంటున్నాం.”—కార్తీక్‌.

అప్పు చేయకండి / డబ్బు పొదుపు చేయండి

  • సీసాలో డబ్బులు వేయడానికి ఒక తల్లి తన కూతురికి హెల్ప్‌ చేస్తోంది.

    అప్పు చేయకండి / డబ్బు పొదుపు చేయండి

    అప్పును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే, అసలు అప్పు చేయకండి. ఏదైనా కొనాలి అనుకుంటే, ముందునుండే డబ్బులు దాచుకోండి.

  • ముందున్న ఖర్చుల కోసం, అనుకోకుండా వచ్చిపడే ఖర్చుల కోసం ప్రతీనెల కొంత డబ్బు తీసి పక్కకు పెట్టండి.

కష్టపడి పనిచేయండి / ఏదోక ఉద్యోగం చేయండి

బైబిలు ఇలా చెప్తుంది: “ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది.”—సామెతలు 14:23.

  • వడ్రంగి ఒక మేకును సుత్తితో కొడుతూ చెక్కలోకి దించుతున్నాడు.

    కష్టపడి పనిచేయండి / ఏదోక ఉద్యోగం చేయండి

    చేస్తున్న పనిని ప్రేమించండి. ఎందుకంటే, చేస్తున్న ఉద్యోగం మీకు ఇష్టమైనది కాకపోయినా, దానివల్ల వచ్చే సంపాదన మీరు బ్రతకడానికి ఉపయోగపడుతోంది.

  • కష్టపడి పనిచేయండి, నిజాయితీగా ఉండండి. అలా ఉంటే మీ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటారు. ఒకవేళ ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది.

“నేను ఏ ఉద్యోగం దొరికితే దాన్ని చేస్తుంటాను. అది నాకు నచ్చిన పని కాకపోయినా, అనుకున్నంత జీతం రాకపోయినా దాన్ని చేస్తాను. కష్టపడి పనిచేస్తాను, నిజాయితీగా ఉంటాను. వేరేవాళ్ల కోసం పనిచేస్తున్నట్లు కాకుండా, నా సొంత పని అన్నట్టు దాన్ని మనసుపెట్టి చేస్తాను.—దినేష్‌.

మీరు ఉద్యోగం కోసం వెదుకుతున్నారా?

  • మీరు చేయగల ఉద్యోగాలుండే ఆఫీసులకు మీరే ఫోన్‌ చేయండి. ఫలానా పోస్టులు ఖాళీలు ఉన్నాయని వాళ్లు ప్రకటన ఇవ్వకపోయినా ప్రయత్నించి చూడండి. మీ ఫ్రెండ్స్‌ను, బంధువుల్ని ఎక్కడైనా జాబ్‌ ఉంటే చెప్పమనండి.

  • అన్నివిధాలా మీరు కోరుకున్న ఉద్యోగం దొరక్కపోవచ్చు. కాబట్టి, దొరికిన ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండండి.

పిల్లలు పెరట్లో ఆడుకుంటుంటే, వాళ్ల అమ్మానాన్నలు కూర్చుని ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎక్కువ తెలుసుకోండి. “ఉన్నంతలో ఎలా జీవించవచ్చు” అనే ఆర్టికల్‌ చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి