కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g22 No. 1 పేజీలు 13-15
  • 4 | ఆశ వదులుకోకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 4 | ఆశ వదులుకోకండి
  • తేజరిల్లు!—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకో తెలుసా?
  • మీకు తెలుసా?
  • ఇప్పుడు ఏం చేయాలి?
  • బైబిలు మనలో ఆశ నింపుతుంది
  • ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మంచి రోజులు వస్తాయని దేవుడు మాటిస్తున్నాడు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మంచి రోజులు వస్తాయని దేవుడు మాటిస్తున్నాడు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోవడం మొదలుపెట్టండి
  • 2024లో ఆశతో జీవిద్దాం—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
తేజరిల్లు!—2022
g22 No. 1 పేజీలు 13-15
ఫ్లవర్‌ వాజ్‌ పక్కన తెరిచివున్న బైబిలు ఉంది.

ప్రపంచమంతా గందరగోళం

4 | ఆశ వదులుకోకండి

ఎందుకో తెలుసా?

పరిస్థితులేంటి ఇంత గందరగోళంగా ఉన్నాయనే ఆందోళన ఆరోగ్యాన్ని పాడుచేయడంతో పాటు, మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాంటి ఒత్తిడివల్ల, ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయనే ఆశ చాలామందిలో చచ్చిపోతోంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు?

  • కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించడమే మానేస్తారు.

  • ఇంకొంతమంది మందుకు, డ్రగ్స్‌కు అలవాటుపడతారు.

  • కొందరు బ్రతకడంకన్నా, చావడం మేలనే ముగింపుకు వచ్చేస్తారు.

మీకు తెలుసా?

  • మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని రోజులే ఉండొచ్చు. ఆ తర్వాత, ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారచ్చు.

  • ఒకవేళ మీ సమస్య అలాగే ఉన్నా, దాన్ని తట్టుకుని ముందుకు వెళ్లడానికి మీకు ఇంకా చాలా మార్గాలు ఉంటాయి.

  • మనుషుల సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం రాబోతోందని బైబిలు మాటిస్తోంది.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.”—మత్తయి 6:34.

ఏ రోజు గురించి ఆరోజు ఆలోచించండి. రేపు ఏం జరుగుతుందనే ఆందోళనతో ఈరోజు చేయాల్సిన పనుల్ని చేయలేకపోవడం మంచిదికాదు.

ఖచ్చితంగా జరుగుతాయో లేదో తెలియని విషయాల గురించి అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తు మీద ఆశ ఆవిరైపోతుందే తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు.

సురక్షితంగా జీవించడం ఎలా?—చక్కని చిట్కాలు

మంచి విషయాల మీద మనసుపెట్టండి

ఒకావిడ కిటికీలో నుండి బయటికి చూస్తూ తృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

బైబిలు ఇలా చెప్తుంది: “కష్టాల్లో ఉన్నవాడికి ప్రతీరోజు చెడ్డదే, అయితే సంతోష హృదయం గలవాడికి ప్రతీరోజు విందే.” (సామెతలు 15:15) వచ్చిన సమస్య గురించే ఆలోచిస్తూ కూర్చుంటే, ఎలాంటి పరిష్కారం కనబడదు. ‘ఏదోక పరిష్కారం దొరక్కపోతుందా’ అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదోక దారి దొరుకుతుంది.

  • అదేపనిగా వార్తలు చూస్తూ కూర్చోకండి.

  • ప్రతీరోజు రాత్రి, ఆరోజు మీకు జరిగిన రెండుమూడు మంచి విషయాల్ని గుర్తుతెచ్చుకోండి.

  • రెండుమూడు రోజుల పనులు కాకుండా, ఈరోజు మీరు చేయాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక లిస్టు రాసుకోండి. కొన్ని పనులు పూర్తిచేయడానికి ఎక్కువ రోజులు పడతాయి. అలాంటి పనుల్ని, ఏ రోజుకు ఎంత చేయాలో ముందే అనుకుని దాన్ని పూర్తిచేయండి. అప్పుడు ఆరోజు పూర్తి చేసిన పనిని చూసుకున్నప్పుడు మనసుకు సంతోషంగా అనిపిస్తుంది.

సహాయం తీసుకోండి

ఒక పెద్దాయన ఓ యువకునికి ధైర్యం చెప్తున్నాడు.

బైబిలు ఇలా చెప్తుంది: “తనను తాను వేరు చేసుకునేవాడు . . . తెలివి అంతటినీ తిరస్కరిస్తున్నాడు.” (సామెతలు 18:1) ఒక లోతైన బావిలో నుండి బయటికి రావాలంటే ఎవరోఒకరి సహాయం తీసుకోవాలి. అలాగే కష్టాల్లో నుండి బయటికి రావడానికి కూడా ఎవరోకరి సహాయం తీసుకోవాలి.

  • సహాయం కోసం మీ కుటుంబ సభ్యుల్ని గానీ, స్నేహితుల్ని గానీ అడగండి.

  • మీరు కూడా వాళ్లకు ఎలా సహాయపడగలరో ఆలోచించండి. అలా సహాయం చేసినప్పుడు మీ సమస్యల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు.

  • ఒకవేళ మీరు జీవితం మీద ఆశ కోల్పోయి, ఇక బ్రతకడం దేనికి అని ఆలోచిస్తుంటే ఒకసారి డాక్టరును కలవండి. ఎందుకంటే, అలాంటి ఆలోచనలు డిప్రెషన్‌ లాంటి అనారోగ్య సమస్య లక్షణాలు కావచ్చు. ట్రీట్‌మెంట్‌ తీసుకోవడంవల్ల చాలామంది డిప్రెషన్‌ నుండి బయటపడ్డారు.a

a ఈ తేజరిల్లు! పత్రిక ఫలానా ట్రీట్‌మెంట్‌ మంచిదని చెప్పట్లేదు.

బైబిలు మనలో ఆశ నింపుతుంది

పూర్వకాలంలోని ఒక రచయిత దేవునికి ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు: “నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు.” (కీర్తన 119:105) దేవుని వాక్యమైన బైబిలు ఒక దీపంలా, వెలుగులా ఎలా ఉండగలదని అనుకుంటున్నారా?

చిమ్మచీకట్లో అడుగు ఎక్కడ వేయాలో తెలియనప్పుడు, దీపం మనకు దారి చూపిస్తుంది. అదేవిధంగా, నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు, సరైన నిర్ణయం తీసుకోవడానికి బైబిల్లో ఉన్న తెలివైన సలహాలు సహాయం చేస్తాయి.

వెలుగు, మన ముందున్న దారి ఎలా ఉందో చూపిస్తుంది. బైబిలు కూడా, మన ముందు వేచివున్న అందమైన భవిష్యత్తును మనకు చూపిస్తుంది.

బైబిలు ఒక పవిత్రమైన పుస్తకం. అందులో, మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడు, మనుషులకు కష్టాలు ఎలా మొదలయ్యాయి లాంటి విషయాలతో పాటు మనందరిలో ఆశను నింపే ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి కూడా ఉంది. బైబిలు వీటికి జవాబులు ఇస్తుంది:

ఎలా?

మనుషులకు కష్టాలు ఎలా మొదలయ్యాయి? “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది” అని బైబిలు చెప్తుంది.—రోమీయులు 5:12.

ఎందుకు?

మానవ పరిపాలకులు సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకంటే, “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు” అని బైబిలు చెప్తుంది. (యిర్మీయా 10:23) ఆ మాట నిజమని ప్రపంచంలో ఉన్న పరిస్థితులే నిరూపిస్తున్నాయి.

ఏమిటి?

సమస్యల్ని పరిష్కరించడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు” అని బైబిలు చెప్తుంది.—ప్రకటన 21:4.

“బైబిలు ఎందుకు చదవాలి?” వీడియోలోని ఒక సన్నివేశం. ఒకావిడ, బైబిల్లో చదివిన ఒక విషయాన్ని తన భర్తకు చెప్తోంది.

ఎక్కువ తెలుసుకోండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి