కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 6/8 పేజీలు 22-23
  • క్రైస్తవులు యుద్ధవ్యతిరేకులుగా ఉండాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవులు యుద్ధవ్యతిరేకులుగా ఉండాలా?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యుద్ధం లేదా హింస ఎడల వ్యతిరేకత
  • యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారా?
  • యుద్ధం అంతమొందడానికి ఏ నిరీక్షణ వుంది?
    తేజరిల్లు!—1993
  • యుద్ధములను అంతముచేయు యుద్ధము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • “శాంతి కోసమైన సమయం” సమీపించింది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 6/8 పేజీలు 22-23

బైబిలు ఉద్దేశము

క్రైస్తవులు యుద్ధవ్యతిరేకులుగా ఉండాలా?

“క్రైస్తవత్వం యొక్క తొలి శతాబ్దాల్లోలాగే చర్చీలు మళ్ళీ యుద్ధ వ్యతిరేకులు అవ్వాలి.”—హ్యూబర్ట్‌ బట్లర్‌ అనే ఐరిష్‌ రచయిత.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం, యుగోస్లేవియాను దర్శించిన తర్వాత, హ్యూబర్ట్‌ బట్లర్‌ 1947లో ఒక వ్యాసంలో పై మాటలను ధైర్యసమేతంగా వ్రాశాడు కానీ, గత సంవత్సరం వరకూ ఆ వ్యాసం ప్రచురించబడలేదు! “యుద్ధం జరిగిన సమయంలో క్రైస్తవ చర్చి భయంకరమైన నేరాలకు సహకరిస్తూ క్రీస్తు బోధలనుండి” ఎలా “వైదొలగిందా” అని ఆశ్చర్యపోయాడు.

ఎవరికీ అంతగా తెలియని సంస్థల కొరకు లేదా గుంపుల కొరకు బాహాటంగా మాట్లాడేందుకు బట్లర్‌ భయపడలేదు. ఆయనలా మాట్లాడినప్పుడు, ఎవరి ఆసరా లేకుండానే తన స్వంత తలంపులను తెలియజేశాడు. ది ఐరిష్‌ టైమ్స్‌లో “అన్ని మత సంబంధ తెగల్లోకెల్లా కచ్చితంగా అత్యంత నిర్దోషులైన నిష్కళంకులైన రాజకీయ జోక్యం లేని మత సంబంధ తెగ” అని వర్ణించబడిన యెహోవాసాక్షుల ధైర్యపూర్వకమైన దృక్పథంతో చర్చి ప్రవర్తనను పోల్చినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెలిబుచ్చాడు. “యుగోస్లేవియాపై నివేదిక” అనే తన వ్యాసంలో, “రాజకీయ నాయకులూ మత నాయకులూ యుద్ధాన్ని సమర్థించేందుకు చేసిన మోసపూరితమైన తర్కాలనన్నింటినీ తిరస్కరించే [తిరస్కరించిన]” సాక్షులు యుద్ధ ఉద్యమంలో చేరడానికి నిరాకరించినందుకు యుగేస్లేవియా అధికారులు వారిని విచారణకు పంపారని బట్లర్‌ వ్రాశాడు.

అయితే, యెహోవాసాక్షులను యుద్ధవ్యతిరేకులు అని వర్ణించడం లేఖనాధారంగా సరైనదేనా? ఈ విషయాన్ని స్పష్టం చేయడం అన్నది “యుద్ధవ్యతిరేకి” అనే పదం ఏ భావాన్ని సూచిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. యుద్ధంలో ఆయుధాలను ధరించేందుకు నిరాకరించడంలో—వ్యక్తిగతంగా ఎంతో కష్టమనుభవించవలసి వచ్చినప్పటికీ—సాక్షులు చూపించిన ధైర్యాన్ని మెచ్చుకునేందుకు బట్లర్‌ ఆ పదాన్ని ఉపయోగించాడు. అయితే, విచారకరంగా, యుద్ధం అనే జ్వరం పట్టుకున్న చాలా మంది ప్రజలు యుద్ధవ్యతిరేకిని కేవలం “ఒక పిరికివానిగా లేదా తన దేశ బాధ్యతనుండి తప్పించుకోవాలన్న ఆతృతగల దేశద్రోహిగా” దృష్టిస్తారు. ఆ దృష్టికోణం సరైనదేనా?

యుద్ధం లేదా హింస ఎడల వ్యతిరేకత

యుద్ధవ్యతిరేకి అంటే “పోరాటాన్ని, ముఖ్యంగా యుద్ధాన్ని దృఢంగా చురుకుగా వ్యతిరేకించే”వాడు అని వెబ్‌స్టర్స్‌ నైన్త్‌ న్యూ కలీజియట్‌ డిక్షనరీ చెబుతుంది. “యుద్ధవ్యతిరేకవాదం” అంటే “యుద్ధం లేదా హింస అనేది వివాదాలను పరిష్కరించే మార్గమని తలంచడాన్ని వ్యతిరేకించడం; ముఖ్యంగా: నైతికత లేదా మత విశ్వాసాల ఆధారంగా ఆయుధాలను ధరించడాన్ని నిరాకరించడం” అని అది నిర్వచిస్తుంది. తొలి క్రైస్తవ సంఘంలోని విశ్వాసులకు ఆ నిర్వచనాలు ఎలా వర్తిస్తాయి?

వాళ్ళు ‘నైతిక లేదా మతవిశ్వాసాల ఆధారంగా ఆయుధాలను ధరించడాన్ని నిరాకరించి,’ సమస్త ‘పోరాటాల నుండి యుద్ధాల’ నుండి దూరంగా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే, తన అనుచరులు “లోక సంబంధులు కారు” అని “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని యేసు అన్నాడని వారికి తెలుసు. (యోహాను 15:19; మత్తయి 26:52) “కనీసం మార్కూస్‌ ఆరేలీయస్‌ [161-180 సా.శ.] పరిపాలన వరకూ, ఏ క్రైస్తవుడూ బాప్తిస్మం తర్వాత సైనికుడయ్యేవాడు కాడు” అని ది ఎర్లీ చర్చ్‌ అండ్‌ ది వర్ల్‌డ్‌ అనే పుస్తకంలో ఒక చరిత్రకారుడు మనకు చెబుతున్నాడు. “పోరాడడం తప్పని తొలి క్రైస్తవులు తలంచారు, సామ్రాజ్యానికి సైనికులు అవసరమైనప్పుడు కూడా వారు సైన్యంలో సేవచేసేవారు కాదు” అని ది న్యూ వర్ల్‌డ్స్‌ ఫౌండేషన్స్‌ ఇన్‌ ది ఓల్డ్‌లో మరో చరిత్రకారిణి చెబుతుంది.

సువార్తను ప్రకటించడమే క్రైస్తవుని నియామకం. (మత్తయి 24:14; 28:19, 20) అంటే, దేవుని శత్రువులకు వ్యతిరేకంగా యుద్ధం చేసే నియామకాన్ని గానీ లేదా దేవుని తీర్పును అమలుచేసే నియామకాన్ని గానీ దేవుడు ఇవ్వలేదని వారు అర్థం చేసుకున్నారు. (మత్తయి 5:9; రోమీయులు 12:17-21) బట్లర్‌ చెప్పినట్లు, నామమాత్ర క్రైస్తవులు ‘క్రీస్తు బోధల నుండి వేరైపోయినప్పుడు’ మాత్రమే లోక యుద్ధాల్లో వారు చిక్కుకుంటారు. అప్పుడు తరచూ పోరాటాల్లోని ఇరు పక్షాల్లోని మత గురువులూ సైన్యాలను దీవించి, విజయం కొరకు ప్రార్థిస్తారు. (యోహాను 17:16; 18:36 పోల్చండి.) ఉదాహరణకు, మధ్యయుగాల్లో ప్రొటెస్టంట్లు మరియు కాథోలిక్కులు అనేక రక్తపాతపు యుద్ధాలను చేయగా, “భయం అనేది పశ్చిమ యూరప్‌ వరకు వ్యాపించింది, ఇరు పక్షాలవారూ తాము దేవుని ప్రతీకార ఉపకరణాలమని తమను తాము ప్రకటించుకున్నారు” అని సివిలైజేషన్‌ అనే తన పుస్తకంలో కెనత్‌ క్లార్క్‌ వ్రాస్తున్నాడు. ఇలాంటి యుద్ధాలను సమర్థించుకునేందుకు చేసిన వాదాలు “అధికారులను తృప్తిపరచాలనే కోరిక వల్లనే వృద్ధియయ్యాయన్నది స్పష్టం. అవి ప్రాచీన క్రైస్తవ సిద్ధాంతాలకు, సువార్త యొక్క మొత్తం స్ఫూర్తికి విరుద్ధమైనవి” అని మాక్క్‌లిన్టక్‌ మరియు స్ట్రాంగ్స్‌ వారి సైక్లోపీడియా ఆఫ్‌ బిబ్లికల్‌, థియోలజికల్‌, అండ్‌ ఎక్లీసియాస్టికల్‌ లిటరేచర్‌ చెబుతుంది.—యాకోబు 4:4.

యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారా?

అయితే, ‘ప్రాచీన క్రైస్తవ సిద్ధాంతమూ సువార్తయొక్క పూర్తి స్ఫూర్తీ’ నిజంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నాయా? ముందు నిర్వచించినట్లు తొలి క్రైస్తవులను యుద్ధవ్యతిరేకులు అని నిజంగా వర్ణించవచ్చా? లేదు! ఎందుకని? ఒక కారణమేమంటే, యుద్ధం చేసేందుకు దేవునికి గల హక్కును వారు గుర్తించారు. (నిర్గమకాండము 14:13, 14; 15:1-4; యెహోషువ 10:14; యెషయా 30:30-32) అంతేకాక, భూమిమీద దేవుని ఏకైక ఉపకరణంగా ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం సేవచేసినప్పుడు వారికి తన కోసం యుద్ధం చేసే అధికారమిచ్చే ఆయన హక్కును వారు ఎన్నడూ తప్పుపట్టలేదు.—కీర్తన 144:1; అపొస్తలుల కార్యములు 7:45; హెబ్రీయులు 11:32-34.

దేవునికి హక్కు మాత్రమే కాక, న్యాయం జరపవలసిన కారణాన దుష్టులను భూమి నుండి తీసివేయవలసిన బాధ్యత కూడా ఉంది. కీడు చేసేవారనేకులు తమ మార్గాలను సరిచేసుకోవాలని దేవుడు తమతో ఓరిమితో చేసే అభ్యర్థనలకు వారు ఎన్నడూ ప్రతిస్పందించరు. (యెషయా 45:22; మత్తయి 7:13, 14) దేవుడు కీడును సహించేందుకు పరిధులున్నాయి. (యెషయా 61:2; అపొస్తలుల కార్యములు 17:30) కనుక, చివరికి దేవుడు కీడు చేసే ప్రజలను బలవంతంగా భూమి మీది నుండి తీసివేస్తాడని క్రైస్తవులు గుర్తిస్తారు. (2 పేతురు 3:9, 10) బైబిలు ప్రవచిస్తున్నట్లు, “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు” అలా జరుగుతుంది.—2 థెస్సలొనీకయులు 1:6-9.

బైబిలులోని చివరి పుస్తకం ఈ పోరాటాన్ని “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” లేదా హార్‌మెగిద్దోను అని పిలుస్తుంది. (ఇటాలిక్కులు మావి.) (ప్రకటన 16:14, 16) ఇందులో యేసుక్రీస్తు నాయకత్వం వహిస్తాడనీ, ఆయన “నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు” అని అది చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) (ప్రకటన 19:11, 14, 15) యేసుక్రీస్తును “సమాధానకర్తయగు అధిపతి” అని సరిగ్గానే పిలువడం జరిగింది. (యెషయా 9:6) కానీ ఆయన యుద్ధ వ్యతిరేకి కాదు. దేవుని తిరుగుబాటుదారులైన శత్రువులను పరలోకం నుండి తొలగించేందుకు ఆయన ఇప్పటికే యుద్ధం చేసేశాడు. (ప్రకటన 12:7-9) “భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు” త్వరలో ఆయన మరో యుద్ధం చేస్తాడు. అయితే, భూమి మీది ఆయన అనుచరులు ఆ దైవిక తీర్పులో ఏ భాగమూ వహించరు.—ప్రకటన 11:17, 18.

నిజ క్రైస్తవులు శాంతిని ప్రేమిస్తారు. ప్రపంచ సైనిక, రాజకీయ, జాతి పోరాటాల్లో వారు పూర్తిగా తటస్థంగా ఉంటారు. కానీ, కచ్చితంగా చెబితే, వారు యుద్ధ వ్యతిరేకులు కారు. ఎందుకని? చివరికి భూమిపై తన చిత్తాన్ని అమలుపరచే దేవుని యుద్ధాన్ని—విశ్వసర్వాధిపత్యాన్ని గూర్చిన గొప్ప వివాదాన్ని తీర్చే యుద్ధాన్ని, శాంతి శత్రువులనందరినీ భూమి మీది నుండి శాశ్వతంగా తీసివేసే ఆ యుద్ధాన్ని—వారు స్వాగతం చేస్తారు.—యిర్మీయా 25:31-33; దానియేలు 2:44; మత్తయి 6:9, 10.

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

క్రీస్తు ఎగతాళి చేయబడ్డాడు/The Doré Bible Illustrations/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి