కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 25-27
  • ఫిలిప్పీ—నీటి ఊటల స్థలం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిలిప్పీ—నీటి ఊటల స్థలం
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఊటలు లేదా నీళ్లు
  • ప్రశస్తమైన లోహాల ఊటలు
  • రక్త ధారలు
  • జీవపు ఊటలు
  • దాతృత్వపు ఊటలు
  • మా తిరుగు ప్రయాణం
  • “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా వాక్యము వ్యాపించుట!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 25-27

ఫిలిప్పీ—నీటి ఊటల స్థలం

మేము థెస్సలొనీకయకు సమీస్తూ ఐజీన్‌ అనే సముద్రపు అలలమీదుగా ప్రయాణిస్తున్నాము. అకస్మాత్తుగా, విమానాశ్రయంలోని బాట నీళ్ల అంచునుండి మా క్రిందికి వచ్చింది.—మా విమానానికెంత దగ్గరగా వచ్చిందంటే మేము నేలమీద దిగామన్నట్లు నా భార్య అనుకుంది. “మేమెప్పుడు అంత మృదువైన రీతిగా దిగలేదని” ఆమె అన్నది. అప్పుడు విమాన చక్రాలు ఒక్క ఊపుతో నేలతాకినవి.

గ్రీసులోని మాసిదోనియా! అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ను, పిదప రోమా భవిష్యత్తును నిర్ణయించిన ఫిలిప్పీ ప్రాంత యుద్ధాన్ని అనగా ఆనాటి లోకాన్ని తలంచాను. క్రైస్తవ అపొస్తలుడైన పౌలుయొక్క జీవితం, పరిచర్యమీద అది ఎట్టి ప్రభావం కలిగించెనని అనుకున్నాను. “అన్యులకు అపొస్తలుడుగా” పౌలు క్రైస్తవత్వాన్ని ఫిలిప్పీ ప్రాంతంలోనే ప్రారంభించి ఐరోపాలో ప్రవేశపెట్టాడు. (రోమా 11:13) మాకు విజ్ఞానం కల్గించే దేనినైనా మేము చూచెదమా? ఆ ప్రాంతంలో ఏ జాడ లేకుండ చరిత్ర గతించిపోయిందా?

థెస్సలొనీకయకు రెండుగంటల ప్రయాణమంత దూరంలో మాబస్సు కావెల్లా ఓడరేవుకు పైభాగానవున్న పర్వతప్రాంత రోడ్డుమీద మెలికలు తిరుగుతూ ప్రయాణిస్తూంది. కావెల్లా, ముఖ్యంగా పొగాకు ఎగుమతికి ప్రసిద్ధి చెందినప్పటికీ, ఓడ లంగరు వేసిన ప్రాంతంలో జాలరులు చేపలు పట్టుట చూస్తే, కావెల్లా నెపొలిస్‌ అని పిలువబడినకాలంలో అప్పుడు పౌలు చూచిన దృశ్యాన్ని మేమును చూచినట్లే అనిపించింది.— అపొస్తలుల కార్యములు 16:11.

పౌలు నెపోలిస్‌లో బస చేయకపోయిననూ, మాకు క్రిందుగా కొన్ని గజాలదూరంలో ఆయన ప్రయాణించిన గుండ్రని రాళ్లతోనిండిన ఏటవాలు బాట చూడగలిగాము. తర్వాత ఇరుకుగాను, ఇరువైపులా చెట్లుగల బాటనుదాటి ఫిలిప్పీ అని పిలువబడిన పట్టాణాన్ని మొదటిసారిగా కళ్లారచూశాము. షుమారు లోయ సగభాగమంతా పెద్దపెద్ద రాళ్లతో నిండి సులభంగా గుర్తించగల్గిన ఆ ప్రాంతాన్ని గమనించాము.

పండుచున్న పొగాకు పొలాలను మేము చూశాము. పౌలు చిత్తడి పొలాలను చూశాడు. మరియు తొలినివాసులు అచ్చటి కీకరారణ్యమును చూశారు. అపొస్తలుడు ఆ ప్రాంతములో నుండి తాను దిగి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఊపిరిపీల్చుకొనుటకు ఆగివుండవచ్చును. అయితే మేము తొందరపడ్డట్టే ఆయనకూడా ఉత్సాహముతో తొందరగా దిగివుండవచ్చును.

ఊటలు లేదా నీళ్లు

సా.శ.పూ. 356 సం. లో 2 వ ఫిలిప్‌ అధికారానికి వచ్చి అడవులను కొట్టివేసి, పట్టణాభివృద్ధిచేసి దాన్ని తన పేరుతోనే పిలువకముందే ఫిలిప్పీ ఉండేది. దానికి ఐదు సంవత్సరములముందే తేసోస్‌నుండి ఏసిలా మరియు మౌంట్‌పాంగియస్‌లోని గనులలో పనిచేయుటకు ప్రజలు వలస వచ్చారు. వారిగ్రామమును వారు క్రేనైడ్స్‌, అనగా ‘చిన్ననీటిబుగ్గల స్థలం’ అని పిలిచారు. ఎందుకు? ఎందుకంటే ప్రతిచోట నీటి ఊటలున్నవి, ఆవిధంగా ఆ లోయ అధికభాగం చిత్తడినేలగా తయారయింది.

ఈమధ్యనే ఆ ప్రాంతాన్ని జయప్రదంగా ఎండబెట్టారు. కానీ నీటి ఊటలింకను అక్కడ ఉన్నవి, కాలువలింకను పారుచునేయున్నవి. ఒకచోట రోమీయుల ప్రాచీన దారి గాంజైట్స్‌ అనే నదిదాటి పోతుంది. అది పౌలుకు విశేషమైయుండెను, దాన్ని మేము చూడాలనుకున్నాము.

ప్రశస్తమైన లోహాల ఊటలు

త్రాస్‌ వారు భయపెట్టిన తేసియా గని కార్మికులను రక్షించుటకు ఫిలిప్‌, క్రేనైడ్స్‌ గ్రామన్ని పఠిష్టపరచాడు. ఆయన క్రేనైడ్స్‌ సైన్యస్థావరముగా ఉండాలని కోరుకున్నారు. అయితే దురాశతోకూడిన యుద్ధపథకాలకు ఆర్థిక సహాయం కొరకు అతనికి బంగారము అవసరమైంది. సంవత్సరమునకు వెయ్యి తలాంతుల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఆ బంగారు గనులు ఫిలిప్‌ను, అలెగ్జాండర్‌ దిగ్రేట్‌ను సంపన్నులనుగా చేసినవి. బంగారము పోయినప్పుడు ఫిలిప్పీ తెరమరుగయ్యింది.

రక్త ధారలు

ఒక శతాబ్దం గడిచి పోయింది. గ్రీసు రోమా సామ్రాజ్యానికి అధికారం అప్పజెప్పంది. రోమా సామ్రాజ్యానికి రోడ్లు కావాలి, అందుకే మాసిదోనియా మీదుగా వయా ఇబ్నేషియా అనే మార్గాన్ని నిర్మించారు. తీరానికి తొమ్మిది మైళ్ల (148 కి. మీ.) దూరంలో అది ఫిలిప్పీ పట్టణ మధ్యగుండా వెళ్లి అ పట్టణ వాణిజ్య, సైనిక రాకపోకలను మేలుకొల్పింది.

ఫిలిప్పీ యుద్ధ తంత్రముల నెలవాయెను. సా. శ. పూ. 42 సంవత్సరములో రోమీయులకు, దాన్ని స్వాధీన పరచుకోవాలని ప్రయత్నించిన ఆక్రమదారులకును జరిగిన భీకర పోరాటంలో రక్త ధారలు ప్రవహించినవి. రిపబ్లికన్‌ కుట్ర విఫలమై కైసిరియన్‌ సామ్రాజ్యము రక్షింపబడింది. జ్ఞాపకార్థంగా, విజేయుడైన ఓక్టావియన్‌ ఫిలిప్పీ పట్టణాన్ని రోమీయుల వాసంగా చేశాడు.—అపొస్తలుల కార్యములు 16:12.

జీవపు ఊటలు

ఇప్పుడు ఫిలిప్పీలో ఎవరూ నివసించుటలేదు. అదొక భూగర్భశాస్త్ర పరిశోధనా స్థలమే. మేము వయా ఇగ్నేషియా మార్గంగుండా సంచారం చేస్తున్నపుడు నడిచేమార్గంలో మేము చక్రాల గుర్తులను గమనించాము. సంతవీధియంతా తిరిగాము, అక్కడ 50 మంది కూర్చోనే మరుగుదొడ్డిని చూశాము. వ్యాయామశాలలో (నిజానికి అది పెలస్ట్రా లేదా కుస్తీపాఠశాల) కుస్తీదారులు లేనట్లే, గ్రంథాలయములో ఏ గ్రంథమూలేదు. రోమీయుల దేవాలయాలు, గ్రీకుల దేవతాప్రతిమల గూళ్లు యాక్రోపోలిస్‌నందు సగందూరంలోని ఐగుప్తీయుల మందస శిథిలాలన్నింటిని మేము చూశాము. ఆరు-బయటి రంగస్థలములో కూర్చున్నపుడు దాని ధ్వనితరంగ నైపుణ్యానికి విభ్రాంతి నొందాము. న్యాయస్థానం దగ్గర నిల్చొని, న్యాయాధిపతులు వారి గదులలోనుండి బయటికి వచ్చుట, గొడ్డళ్లుచూట్టూర కట్టియున్న చువ్వల కట్టలను మోసికొని వారి వెనుకనే వెళ్తున్న—వారి అధికారానికి సూచనగా—భటులను ఊహించుకున్నాము. సా. శ. 50 సం. లో రోమీయులదిగా తయారైన ఆ ఫిలిప్పి పట్టణాన్ని మా మనోనేత్రములతో చూచుటకు ప్రయత్నించాము.

బైబిలు ప్రకారం, పౌలు మరియు తన సహచరులు “యీ పట్టణములో కొద్దిదినములుండిరి.” (అపొ. 16:12) ఎటువంటి ఎదిరింపులు ఎదుర్కొనలేదు. అయితే ఒక రోజు పాతదేవుళ్లను గాని క్రొత్త వారినిగానీ అనుసరించక పోయిననూ భక్తిపరులమని చెప్పుకునే ఒక చిన్న గుంపును గూర్చి పౌలు విన్నాడు. వారు ఆ నదిని దాటేదగ్గరనున్న స్థలము అంటే, పట్టణానికి వెలుపల గవిని యొద్ద కలిశారు.

“విశ్రాంతి దినమున గవినిదాటి నదితీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చికూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి,” అని లూకా వ్రాశాడు. యేసుక్రీస్తు ద్వారా కలుగు నిత్యజీవ నిరీక్షణను గూర్చియే మాట్లాడుకున్నారు. విశేషంగా “లూదియ అను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణ చూర్ణమును అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.”—అపొ. 16:13, 14. ఫిలి. 2:12, 166; 3:14తో సరిపోల్చుము.

కొన్నిరోజుల తర్వాత ఫిలిప్పీలో చేసిన సంచారము నాటకీయంగా ముగిసింది. ప్రార్థనా స్థలానికి షుమారు ఒక మైలు దూరంవెళ్లగానే దయ్యం పట్టి పీడించబడుతున్న ఒక బాలిక ఆయనకు ఎదురైంది. పౌలు దయ్యాన్ని వెళ్లగొట్టగానే ఆ చిన్నదానివలన ఆమె యజమానులకు సోదె వలన వచ్చే లాభసాధనం పోయెనని వారు మహోద్రేకులయ్యారు. “పౌలును సీలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి.” ‘వారు యూదులని,’ వారిని గూర్చి చెప్పారు. (క్లౌదియ చక్రవర్తి యూదులను రోమానుండి బహిష్కరించిన సంగతి అందరికి తెలుసు) ‘రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రకటిస్తూ మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని’ కూడా అన్నారు. జనసమూహములు బిగ్గరగా అరచారు, న్యాయాధిపతులు ఆజ్ఞాపించారు. ఆలాగే భటులు ఊసలతో “చాలా దెబ్బలు కొట్టిరి.” తదుపరి వారిని చెరసాలలో వేసి, రక్తధారలతో, స్పృహ తప్పిన స్థితిలో వారి కాళ్లకు బొండవేసి బిగించారు. అదే రాత్రి గొప్ప భూకంపము సంభవించి పౌలు సీలయు చెరసాలనుంచి విడిపించబడిరి మరియు చెరసాల నాయకుడు అతని కుటుంబస్థులు క్రైస్తవత్వమును స్వీకరించు సంఘటనలు జరిగెను.—అపొ. 16:16-34.

మరుసటి ఉదయము అధికారులు జరిగిన దానికి విచారించిరిగాని ఈ క్రొత్తవారిని ఊరువదిలి పొమ్మని చెప్పిరి. పౌలు సీలయు మొదట లూదియ ఇంటికి వెళ్లి, వారు థెస్సలొనీకయకు వెళ్లక ముందు విశ్వాసులను పురికొల్పారు. అక్కడే పెరుగుతున్న సంఘాన్ని కాయుటకు లూక అచ్చటనే ఉండిపోయాడు.—అపొ. కా. 16:35-40.

దాతృత్వపు ఊటలు

తన ఇంటికి “రమ్మని ఆమె వేడుకొనెనని” లూక లూదియాను గూర్చి వ్రాశాడు. పౌలున్న చెరసాల నాయకుడు సహితం పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకొనిన తర్వాత మంచి ఆతిధ్యమిచ్చాడు. (అపొ. 16: 1, 33, 34) పౌలు థెస్సలొనీకయలో ఉన్నప్పుడు, ఫిలిప్పీలోనున్న మిత్రులు ఆయనకు అవసరమైన వాటిని రెండు సార్లు పంపించారు.

తదుపరి పౌలు కొరింథులో ధైర్యంగా దేవుని సేవచేస్తున్నపుడు ఫిలిప్పీయులు మరల ఆయనను కనుగొన్నారు. కొన్ని సం. ల తర్వాత కూడా, పౌలు రోమాలో చెరసాలలో వున్నపుడు వారు ఫిలిప్పీనుండి వారి ప్రతినిధి ఒకరు ఆయనకు బహుమతులు తెచ్చి అపొస్తులునికి సేవచేయ బూనుకున్నారు. పౌలు కది మనోజ్ఞమనిపించింది. ఫిలిప్పీయులు ధనవంతులు కారనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఇలా వ్రాశాడు: “వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.”—2 కొరింథీయులు 8:1, 2; 11:8, 9; ఫిలిప్పీయులకు 2:25; 4:16-18.

మా తిరుగు ప్రయాణం

మేము గాంజైట్స్‌ నది చుట్టు తిరుగుచుంటిమి. నేను నాచెయ్యిని నీళ్లలో ముంచాను అవి అతి చల్లగా ఉండెను. మేము చుట్టూ చూశాము. ఈ దగ్గర్లోనే ఎక్కడో ఆనాడు పౌలు, ఇతరులు ఆరాధన కొరకు కూడుకున్న “ప్రార్థనాస్థలము” ఉన్నది.

మరి నన్ను నేను ఇలా ప్రశ్నించుకొన్నాను, ఫిలిప్పీ నాకెందుకింత ప్రత్యేకంగా కనబడుతుంది? నది ప్రక్కనున్న ఈ ప్రాంతమా? గ్రంథాలులేని గ్రంథాలయం, ఖాళీగానున్న వ్యాయమశాల, దేవుళ్లులేని దేవాలయములు, వస్తువులులేని అంగళ్లతో నిండిన సంతవీధియా?

నీటి ఊటలా? అవును నిజమే. ఫిలిప్పీ నిజంగా “నీటి ఊటల స్థలమే.” అదింకను నీటి ఊటలతోనేవున్నది. అది ఒకసారి బంగారమును, మరోసారి ఒక విచారకర సందర్భములో రక్తాన్ని ప్రవహింప జేసింది. అయితే పౌలు లూదియ, చెరసాల యజమానుడు మరి ఇతర ప్రజలనుండి జీవం, ప్రేమ మరియు దాతృత్వం పొంగిపారిన శ్రేష్టమైన సమయము కూడా ఉండెను. అవును వారును ప్రజలే, కాదా? ఆ ప్రత్యేక ప్రజలే ఫిలిప్పీని నాకొక ప్రత్యేకమైనది చేసింది. వారు గతస్మృతులను జ్ఞాపకానికి తెచ్చారు. నా భార్య నా చెయ్యి పట్టుకున్నట్లు నాకనిపించింది. “వెళ్లే సమయమైంది రండి” అని ఆమె మృదువుగా అన్నది.—ఉచితవ్యాసం. (g91 3/22)

[25వ పేజీలోని చిత్రాలు]

పైన: ప్రాచీన ఫిలిప్పీ యొక్క “బిమా”(న్యాయస్థానం); మధ్యలో: గ్యాగిటీస్‌ మరియు “వయా ఇగ్‌నాతియా” దాటు స్థలము; క్రింద: చార్చాస్థలం.

ఫిలిప్పీ

గ్రీసు

ఆగియా సముద్రం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి