కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 22-24
  • విమర్శింపబడుటకు నీవు అయిష్టపడుదువా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విమర్శింపబడుటకు నీవు అయిష్టపడుదువా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1. విమర్శనాహ్వానించండి
  • 2. మీస్వంత విమర్శను అదుపులో ఉంచుకొనండి
  • 3. వివరములకొరకు అడగండి
  • 4. నిన్ను విమర్శించే వ్యక్తిని శాంతపరచుము
  • 5. చెప్పిన విధానంపైకాక అసలు విషయం మీద ధ్యానముంచండి
  • 6. తీవ్రతను తగ్గించుము
  • నీవు సమస్య తీర్చుకోగలవు
  • విమర్శ చేయుట
  • నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • నేనెప్పుడు ఏదిచేసినా ఎందుకు బాగుండదు?
    తేజరిల్లు!—1993
  • “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును”
    మన రాజ్య పరిచర్య—2010
  • ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?
    తేజరిల్లు!—2019
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 22-24

విమర్శింపబడుటకు నీవు అయిష్టపడుదువా?

పోయినసారి నిన్ను విమర్శించిన విషయాన్ని జ్ఞప్తికితెచ్చుకోగలవా? ఇది ప్రతి ఒక్కరికి ఒక్కోసారి అనేక కారణాలనుబట్టి జరుగుతుంది.

తనను గొప్పవానిగా చేసుకొనుటకు బహుశా ఒకరు విమర్శించియుండును. అయినను తరచు ఇట్టి విమర్శ నీయెడల శ్రద్ధను కలిగి వున్న వ్యక్తినుండియే రావచ్చును. నీ వంట బాగాలేదని నీ భర్త తప్పుపట్టవచ్చు, నీ సూట్‌కు నీ టై సరిపడడంలేదని నీ భార్య అనవచ్చును; నీ ఆరోగ్యాన్ని నీవు కాపాడుకొనుటలేదని నీ మిత్రుడు నిన్ను విమర్శించును. నీవు చెప్పినదో చేసినదో తప్పని సరిదిద్దుటకు నీ యజమాని లేదా నీ తండ్రి (నీవు చిన్నవానివైతే) శిక్షణ నిమిత్తము నిన్ను విమర్శించవచ్చును.

ఏదిఏమైననూ, విమర్శను నీవు ఆహ్వానించావా? లేక, నీవు కోపపడ్డావా, నీపని నీవుచూసుకో అన్నట్లు చెప్పావా?

చాలామందికి, విమర్శనాహ్వానించుట బాధకరమైన అనుభవం. వారికి కోపమొస్తుంది, అయిష్టపడతారు. ఇతరుల నమ్మకాన్ని పోగొట్టుకొని, ‘నేను మంచిని చేయలేను’ అనే ముగింపు కొచ్చి, కృంగిపోతారు.

విమర్శనసహ్యహించుకొను వారిలో నీవొకడవా? నీవొకడవే కాదు అనేకులు అలా అనుకుంటారు. తక్కువబాధతో, అతిగా ప్రతిస్పందించకుండా విమర్శను అందుకొనుటకు నీవు నేర్చుకొనగలవా? విమర్శను స్వీకరించదగినదిగా చేయవచ్చని ఈ శీర్షిక ఆరు పద్ధతులను చూపిస్తుంది. అవి, విమర్శనా ముల్లును తీసివేయుటకు లేక కనీసం దానిబాధను తగ్గించుకొనుటకు నీకు సహాయపడవచ్చును.

1. విమర్శనాహ్వానించండి

కొందరు విమర్శను కోరుచున్నారని దానికొరకు వెదకుచున్నారని తెలుసుకొనుటకు నీకు ఎబ్బెట్టుగా ఉందా? బిట్స్‌ అండ్‌ పీసెస్‌ అనే పత్రిక ఇలా అన్నది: “తెలివైన నాయకులకు . . . తెలుసు వారెప్పుడో ఒకసారి నిశ్చయంగా తప్పుచేస్తారని. అందుకే తప్పులు చేయకముందే వాటిని తగ్గించుకొను ఉద్దేశముతో వీలున్నంత త్వరగా గత విమర్శలను సరిదిద్దుకొనుటకు వారీ వ్యతిరేక అభిప్రాయాలను కోరుతున్నారు.

మనం గమనించనటువంటి వాటిని—మడతపడిన కాలర్‌, వంకరగావున్న టైని—మన ఆకారాన్ని ఇతరులెలా గమనించగలరో అలాగే మనం గమనించలేని మన వ్యక్తిత్వాన్ని వారు గమనించగలరు. వారు గమనించేవి భయపెట్టేవి గాక సహాయకరంగా వుండునని అనుకోండి. ఏదో నేర్చుకొనే దృష్టితో వారి విమర్శనాహ్వానించండి. దాన్ని బలపరిచే అనుభవంగా చేయండి.

2. మీస్వంత విమర్శను అదుపులో ఉంచుకొనండి

నిన్నునీవే తీవ్రంగా విమర్శించుకుంటున్నావా? నీతప్పులను గూర్చి నీవు అధికంగా ఆలోచిస్తున్నావా? లేక ఎవరైన నీ తప్పును ఎత్తి చూపిస్తే చెప్పజాలని అనేక బలహీనతల పొడవాటి పట్టికకు మానసికంగా దీన్ని చేర్చుకుంటున్నావా?

డా.హెరాల్డ్‌ బ్లూంఫిల్డ్‌ ఇలా సూచిస్తున్నాడు: “మన స్వంత విమర్శవలన మనమిప్పటికే మదన పడుతూవుంటే ఇతరులు విమర్శిస్తే ఇంకా బాధపడతాము. ఎవరైనా మనలను పొగడి, ఒక చిన్న విషయంలో విమర్శిస్తే, మనం చేసిన మంచివాటికంటె అయోగ్యతపైనే అధిక ధ్యానమిస్తాము.”

నిన్ను నీవు పరిశీలించుకొనునపుడు సహేతుకంగా వుండుము. ఏది సహేతుకమైనదో నీవెట్లు నిర్ణయించుకోగలవు? సన్నిహిత మిత్రుడొకడు అలాగే విమర్శింపబడుచున్నాడనుకొనుము. అతడెలా స్పందించాలని నీవు కోరుకుంటావు? తనమీద తానే జాలిపడుటయా లేక కోపపడుటయా? గర్వముతో ఆ మంచి సలహాను విసర్జించుటయా? కాదు. ఏ కొద్దిపాటి బాధతోనో దాన్ని అర్థంచేసికొని, స్వయం అభివృద్ధికొరకు దాన్ని వుపయోగించు కొనునట్లు ఆ విమర్శనతడు వినాలని నీవు ఆశిస్తావు.

మరి నీ విషయములోకూడా నీవెందు కలా చేయకూడదు?

3. వివరములకొరకు అడగండి

“నీ స్వభావము నాకు నచ్చదు!” అలా ఎవరైనా నిన్ను అనవలెనని కోరుకుంటావా? లేదు, అటువంటి మాటలు బాధకల్గించేవి, కాదా?

ఇక్కడ నీ స్వభావమెలా ఉండాలంటే, ఇంకా వివరాలు కావాలని అడుగుము. కాన్‌వర్‌సేషనల్లీ స్పీకింగ్‌ అనే తన పుస్తకంలో అలెన్‌ గార్నర్‌ ఇలా వివరిస్తున్నాడు: “సాధారణ విషయాల్లో విమర్శిస్తుంటారు . . . నువ్వు వివరాలడిగితే ఎదుటి వ్యక్తి ఆక్షేపణలేమిటో ఖచ్చితంగా నీవు తెలుసుకోగలవు . . . విలేఖరి మాదిరి నువ్వుకూడా సమాధానము కొరకు ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నలు వేస్తే సరిపోతుంది.

ఉదహరణకు పైన చెప్పినదానికి నీవిలా ప్రతిస్పందించవచ్చును: ఏ ప్రత్యేక అభిప్రాయము నీ మనస్సులోవుంది? అతడింకా విడమరచి చెప్పక పోతే నీవిలా అడుగవచ్చును: “నీకెందుకు కోపమొస్తుంది? అది నేనెప్పుడు చేశానో ఒక ఉదాహరణ చెప్పగలవా? సవాలు చెయ్యకుండ సంభాషించే కోరిక నీలో వున్నందున ఇటువంటి ప్రశ్నలు కోరే నీకును నిన్ను విమర్శించే వ్యక్తికిని సహాయపడగలవు. విమర్శ విలువైనదా లేక ఉద్రేకపూరితమైనదాయని అవి బయల్పరచవచ్చును. విషయాన్ని నీవు ఇంకా కొంచెం దీర్ఘంగా ఆలోచించుటకు అవి నీకు వ్యవధినిస్తాయి.

4. నిన్ను విమర్శించే వ్యక్తిని శాంతపరచుము

నిన్ను విమర్శించే వ్యక్తి ఆవేశంలో వుంటే ఎలామరి? డా. డేవిడ్‌ బర్‌న్స్‌ ఇలా సిఫారసు చేస్తున్నాడు: “నిన్ను విమర్శించే వ్యక్తిది తప్పుగానీ ఒప్పుగానీ, మొదట నీవు అతనితో లేక ఆమెతో ఏకీభవించుమార్గాన్ని అన్వేషించుము.” ఇది నీకెట్లు ప్రయోజనం చేకూర్చగలదు? నిన్ను విమర్శించే వ్యక్తినది నిరాయుధున్ని చేసి, శాంతపరచి, సంభాషణకు అతడు ఎక్కువ అవకాశమిచ్చునట్లు చేయగలదు.

అయితే వెంటనేనీవు నిన్ను అడ్డుకొనుటకు ప్రయత్నిస్తే—అన్యాయంగా నీమీద నేరంమోపబడినదని అనుకున్నపుడు సర్వసాధారణంగా అలా అడ్డుకోవాలనిపిస్తుంది—అపుడు నీవు నీ విమర్శకునికి ఆయుధాలను అందించినట్లే. డా. బర్‌న్స్‌ తెల్పినట్లు: “నీ శత్రువు దాడి ముమ్మరం చేయుట చూస్తావు.” కాబట్టి వైరుధ్యమున్న విషయాలను చర్చించుటకు ముందు సమ్మతింపదగిన ఏదైన ఒక విషయాన్ని గూర్చి పరిశీలించండి.

5. చెప్పిన విధానంపైకాక అసలు విషయం మీద ధ్యానముంచండి

తనకుమారుడు పొరుగు వారితో ప్రవర్తించిన విధానాన్ని ఒక తల్లికి ఫిర్యాదు అందింది. కఠినంగాను, పోట్లాడే స్వభావంతో ఫిర్యాదిచ్చారు. పొరుగువాని మాటలు అన్యాయమని లేక అసత్యమని ఆమె సులభముగా తిరస్కరించేదే, మరి అలా చేయాలని ఆమె నిశ్చయముగా శోధింపబడింది.

బదులుగా, విమర్శలో ఏదో కొంత వాస్తవమున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత ఆమె తన కుమారునితో ఇట్లన్నది: “మనకు దానివల్ల ప్రయోజనమున్నప్పటికీ, మనకిష్టమైన వాళ్లు ఎప్పుడూ మన తప్పులను గూర్చి చెప్పరు. ఈ సంఘటనను అభివృద్ధి సాధనకు ఒక అవకాశంగా తీసుకుందాం.

నిన్నెవరైనా కఠినంగా మందలించారా? బహుశా ఆ వ్యక్తి ఇంద్రియజ్ఞానంలేనివాడై, అసూయ కల్గివున్నాడా? నీవుగానీ మరో వ్యక్తిగానీ తగిన సమయంలో అతనికి దాన్ని గూర్చి సహాయము చేయవచ్చును. గానీ అతడేదో మూర్ఖంగా అన్నాడని అతని మాటను త్రోసిపుచ్చవద్దు. విమర్శచేసిన విషయం మీద దృష్టిసారించండి. అది సత్యమేనా? అది సత్యమే అయితే, అభివృద్ధి చేసికొనవలసి వచ్చిన ఈ తరుణాన్ని వదలుకోవద్దు.

6. తీవ్రతను తగ్గించుము

ఇది నిన్ను ఆశ్చర్యపరచవచ్చునేమోగాని విమర్శ యొక్క తీవ్రత మీద ఎంత తరచుగా అది వస్తుందో దానిమీద నీవు నియంత్రణ కలిగియున్నావు. అధికారములోనున్న వ్యక్తి చేసే విమర్శ విషయంలో విశేషంగా ఈ సూత్రం సత్యమే. అదెలాగు?

పూర్వం పాలస్తీనాలో నల్లజీలకర్ర ప్రసిద్ధి. కానీ ఇతర మొక్కలవలె దాని పెద్దపెద్ద చక్రాలతో గానీ నూర్చెడి ఉపకరణములతో గానీ త్రొక్కెడివారు కాదు. బదులుగా దాన్ని ఒక కర్రతో లేక చువ్వతో కొట్టెవారు. ఎందుకలా మృదువైన ప్రత్యేకరీతిలో నూర్చెడివారు? ఎందుకంటే అది చాలా చిన్నది, లేత విత్తనాలకు బరువైన రాపిడి అక్కర్లేదు, అలాచేస్తే నిజానికవి నలిగిపోతాయి.

బైబిలునందలి యెషయా పుస్తకము, శిక్షణలోని వివిధ స్థాయిలను తెలుపుటకు ఈ నల్లజీలకర్ర మొక్కను ఉదాహరణగా వాడుచున్నది. ఒక వ్యక్తి తేలికపాటి మందలింపును వింటే అదే విషయంమీద అతన్ని తీవ్రంగా గద్దించనక్కర్లేదు.—యెషయా 28:26, 27.

గనుక తేలికైన విమర్శ చేసినప్పుడు నీవు దాన్నివింటే, తీవ్రమైన గద్దింపు నీకుతొలగి పోతుంది. ఉదాహరణకు, పనికి నీవు ఆలస్యంగా వెళ్తున్నట్లు నీవు గమనించావా? నీ యజమానుడు దాన్నిగూర్చి నీతో మాట్లాడకముందే ఆ ఆలవాటు నిప్పుడే దిద్దుకో. ఈ విషయాన్ని యజమానుడప్పుడే నీ దృష్టికి తెచ్చాడా? ఆయన కఠిన చర్యలుతీసుకోకముందే వెంటనే కాలాన్ని పాటించి స్పందించండి.

నీవు సమస్య తీర్చుకోగలవు

విమర్శింపబడుట బాధకరమే. ప్రజలు నిన్ను ఒంటరిగా వదిలి పెట్టాలని, తీర్పుతీర్చకూడదని, ‘సహాయకరమగు సలహాలు’ ఇవ్వకూడదని నీవాశించవచ్చును.

అయితే అలా ఆశించుట, ఎదిరించుట వల్ల విమర్శ ఆగదు. విమర్శనాత్మకంగా వుండుట ఈనాడు మానవనైజంలోని భాగమే. అంతే గాక, అడుగని సలహానిచ్చుటలో ఇతరులుపయోగించే యుక్తి నీ స్వాధీనములో లేదు.

నీవు పళ్లుకొరికే బదులు నీ అధీనమందున్న దాన్ని సద్వినియోగం చేసుకొనుము: నీవు వినుటయే. ముందు తెలుపబడిన కొన్ని సలహాలను విమర్శనా సమస్య తీర్చుకొనుటకు ఉపయోగించు కొనండి, దాన్ని సులభతరం చేయండి. నీవిలా చేస్తే ఆనందిస్తావు.

విమర్శ చేయుట

విమర్శనందుకొనుటకు నీవు నొచ్చుకుంటే, విమర్శచేయుటకు కూడా నీకు కష్టంగావుండవచ్చును. విమర్శచేయునపుడు జ్ఞాపకముంచుకొనవలసిన కొన్ని మార్గదర్శక సూత్రాలిక్కడున్నవి.

తక్కువ మాట్లాడండి. నీవు విమర్శించే వ్యక్తిని భావోద్రేకాలను నొప్పించకూడదనే తప్పుడు ప్రయత్నాలు తరచూ అధిక మాటల మూలంగానే కలుగును, అవి అస్పష్ట సమాచారాన్ని అందించవచ్చును.

ఒక వ్యక్తిలో నీవు గమనించే ప్రతి స్వల్ప తప్పును పట్టుటకు ప్రయత్నించకుము. ఇందుమూలముగా కోపతాపాలు పెరిగి, చివరకు ప్రజలు నీ అభిప్రాయాలలో ప్రాముఖ్యత లేదని వాటిని తిరస్కరిస్తారు. వారు నిన్నే దూరంగా వుంచవచ్చునేమో. ప్రతి ఒక్కరు అసంపూర్ణులే, తప్పులున్నవారే. వారు ఒక్కసారే అన్నింటిని సరిదిద్దుకోలేరు. నీవు గమనించే తప్పు అంత తీవ్రమైనది కాకపోతే, దాన్ని వదిలెయ్యండి. బైబిలు తెల్పురీతిగా: “ప్రేమ అనేక పాపములను కప్పును.”—1 పేతురు 4:8. (g91 2/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి