దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 15-16
పాటలు పాడుతూ యెహోవాను స్తుతించండి
సంగీతానికి చాలా శక్తి ఉంది. అది మన మనసుపై, శరీరంపై ప్రభావం చూపిస్తుంది. యెహోవా ఆరాధనలో పాటలకు ముఖ్యమైన స్థానం ఉంది.
ఎర్ర సముద్రం దగ్గర తమను అద్భుత రీతిలో రక్షించినందుకు మోషే, ఇశ్రాయేలీయులు యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడారు
ఆలయంలో సంగీతకారులుగా, గాయకులుగా సేవచేయడానికి రాజైన దావీదు 4,000 మంది పురుషుల్ని నియమించాడు
తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు అలాగే తన నమ్మకమైన అపొస్తలులు యెహోవాకు స్తుతిగీతాలు పాడారు
యెహోవాకు స్తుతిగీతాలు పాడడానికి నాకు దొరికే కొన్ని అవకాశాలు ఏంటి?