మడగాస్కర్లో మంచివార్త బ్రోషురును ఉపయోగిస్తున్న సహోదరీలు
ఇలా ఇవ్వవచ్చు
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం)
ప్రశ్న: అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల చాలామంది వాళ్ల కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటారు. వాళ్లను మళ్లీ కలుసుకోవడం సాధ్యమేనా?
వచనం: అపొస్తలుల కార్యములు 24:14,15
ఇలా చెప్పవచ్చు: చనిపోయినవాళ్లందర్నీ మళ్లీ దేవుడు బ్రతికిస్తాడు. దీన్ని నమ్మడానికి మూడు కారణాలు ఈ కరపత్రంలో ఉన్నాయి.
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం) చివరి పేజీ
ప్రశ్న: మనుషులు కేవలం 70, 80 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ కొన్ని తాబేళ్లు 150 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని చెట్లు అయితే వేల సంవత్సరాలు ఉంటాయి. మరి మనుషులు ఎందుకు ఇంత తక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు? మీరేమంటారు?
వచనం: ఆదికాండము 3:17-19
ఇలా చెప్పవచ్చు: ఈ ప్రశ్నకు జవాబు దేవుడు చెబుతున్న మంచివార్త! అనే ఈ బ్రోషురులో 6వ పాఠంలో ఉంటుంది.
దేవుడు చెబుతున్న మంచివార్త!
ఇలా చెప్పవచ్చు: మీకు బైబిలు విషయాలను ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి వచ్చాను. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు బైబిల్లో ఎక్కడ ఉన్నాయో ఈ బ్రోషురు చూపిస్తుంది.
ప్రశ్న: మీరెప్పుడైనా బైబిలు చదివారా? ఈ బ్రోషురులో పాఠాలు ఎంత సులువుగా ఉంటాయో మీకు చూపిస్తాను. [2వ పాఠంలో మొదటి ప్రశ్న చూడండి.]
వచనం: ప్రక 4:11
మీరు ఎలా ఇస్తారో రాయండి
మీరు ఎలా ఇస్తారో రాయండి