పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం —పత్రికా మార్గం ఏర్పాటు చేసుకోండి
ఎందుకు ప్రాముఖ్యం? మన పత్రికలను ఆసక్తిగా చదివే చాలామంది, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. బహుశా తమ మతంతో సంతృప్తి చెందడంవల్ల లేదా అధ్యయనానికి సమయం లేనందువల్ల కావచ్చు. అయితే, వాళ్లు మన పత్రికలను క్రమంగా చదవడం వల్ల దేవుని వాక్యం మీద వాళ్లకు ఆసక్తి పెరగవచ్చు. (1 పేతు. 2:1-3) ఫలానా ఆర్టికల్ వాళ్ల హృదయాన్ని తాకవచ్చు లేదా వాళ్ల పరిస్థితులు మారవచ్చు. తరచూ కొద్దిసేపు వాళ్లను కలిసి మాట్లాడుతుంటే మనతో పరిచయం పెరుగుతుంది, అంతేకాదు వాళ్లకు ఏ విషయాల్లో ఆసక్తి ఉందో, వేటిగురించి చింతిస్తున్నారో తెలుసుకోగలుగుతాం. చివరికి ఒక బైబిలు అధ్యయనం మొదలవ్వవచ్చు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
ఎవరెవరితో పత్రికా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చో లిస్టు తయారుచేసుకోండి. తాజా పత్రికలను ఇచ్చి, తర్వాతి సంచికను కూడా తెచ్చి ఇస్తారని చెప్పండి.