మార్చి 16తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 16తో మొదలయ్యే వారం
పాట 25, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 5-9 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 6:10-21 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: అతల్యా—అంశం: యెజెబెలు ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండండి —1 రాజు 21:20-25; 2 దిన 21:4-6; 22:1–23:21 (5 నిమి.)
నం. 3: యేసులో నెరవేరిన మెస్సీయ ప్రవచనాలు—igw 11వ పేజీ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’—తీతు 3:1, 2.
10 నిమి: తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్లో. అక్టోబరు 15, 2014 కావలికోట 3-6 పేజీల్లో ఉన్న ఆర్టికల్ ఆధారంగా చర్చ. ఆర్టికల్లోని ప్రచారకులు, వేరే దేశానికి వెళ్లి సేవ చేయడానికి ఎలా సిద్ధపడ్డారు? వాళ్లు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—పత్రికా మార్గం ఏర్పాటు చేసుకోండి.” చర్చ. ఆర్టికల్ చర్చించిన తర్వాత, ప్రచారకుడు పత్రికా మార్గం ఏర్పాటు చేసుకున్న ఒకరికి బైబిలు అధ్యయనం ప్రతిపాదిస్తున్నట్లు చిన్న ప్రదర్శన చేయించండి. తర్వాత, పత్రికా మార్గం ఏర్పాటు చేసుకున్న ఒక సహోదరుని ఇంటర్వ్యూ చేయండి. అలా ఎంతమందికి పత్రికలు ఇస్తున్నాడు? ప్రతీ సందర్శనానికి ఆయన ఎలా సిద్ధపడతాడు? చెప్పుకోదగిన అనుభవాలు ఉంటే ఆయనను పంచుకోమనండి.
పాట 10, ప్రార్థన