“ఎన్నిసార్లు వెళ్లినా ఆయన కలవట్లేదు!”
ఆసక్తి చూపించినవాళ్ల విషయంలో మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా, మీరు నాటిన సత్యపు విత్తనానికి నీళ్లు పోయలేకపోతున్నారా? (1 కొరిం. 3:6) అలాంటప్పుడు, అనుభవమున్న ప్రచారకులు వాళ్లకు ఉత్తరం రాస్తారు లేదా కొన్ని మాటలు పేపరు మీద రాసి వాళ్ల తలుపు దగ్గర పెట్టివెళ్తారు. కొందరు ప్రచారకులు అలాంటి సమస్యను ముందే ఊహించి, “మీకు ఫోను ఉందా?” అని అడిగి వాళ్ల ఫోను నంబరు తీసుకుంటారు. మనం వాళ్లను వెళ్లి కలిసినా లేదా ఉత్తరం, ఈ-మెయిల్, మెసేజ్, ఫోను ద్వారా సాక్ష్యం ఇచ్చినా లేక కొన్ని మాటలు పేపరు మీద రాసి వాళ్ల తలుపు దగ్గర పెట్టినా ఒక పునర్దర్శనం రిపోర్టు చేయవచ్చు. దానివల్ల, మనం వాళ్లను ఎక్కువసార్లు కలవలేకపోయినా వాళ్ల ఆసక్తిని పెంచవచ్చు.