పరిశోధన చేయడానికి కొత్త పరికరం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రచారకులు ఇప్పటివరకు పరిశోధన చేయడానికి వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌ను చక్కగా ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, అది చాలా వివరంగా ఉంటుంది కాబట్టి, కొన్ని భాషల్లోనే ఉంది. అందుకే, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం దాదాపు 170 భాషల్లో తయారుచేశారు. ఆ భాషల్లో కొన్ని: అమెరికన్ సంజ్ఞా భాష, ఇంగ్లీషు, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ. ఈ పుస్తకంలోని రెఫరెన్సులు చాలావరకు 2000 సంవత్సరం, ఆ తర్వాత వచ్చిన ప్రచురణల నుండి తీసుకున్నవి. ఇండెక్స్ ఏయే భాషల్లో ఉందో ఆ భాషల్లో పరిశోధనా పుస్తకం ముద్రించలేదు. కానీ దాన్ని వాచ్‌టవర్ లైబ్రరీ, కావలికోట—ఆన్‌లైన్ లైబ్రరీల్లో పెట్టారు. బైబిలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, మన సమస్యలకు ఉపయోగపడే సమాచారం కనుక్కోవడానికి, సంఘ కూటాలకూ కుటుంబ ఆరాధనకూ సిద్ధపడడానికి పరిశోధనా పుస్తకం సహాయం చేస్తుంది.