పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఉపోద్ఘాతాన్ని ముందే సిద్ధం చేసుకోండి
ఎందుకు ప్రాముఖ్యం? ఉపోద్ఘాతం ఆసక్తికరంగా లేకపోతే, మన సందేశాన్ని వినకుండానే ఇంటివాళ్లు మనల్ని వెళ్లిపొమ్మని అనవచ్చు. అందుకే చాలామంది ప్రచారకులు, సాక్ష్యమిస్తున్నప్పుడు ప్రారంభ మాటలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మన రాజ్య పరిచర్యలో, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలో సంభాషణ ఎలా మొదలుపెట్టాలో ఉంటుంది. అయితే వాటిలో తరచూ, మనం ఇంటివాళ్లకు తగినట్లు మలచుకోగలిగేలా ఉపోద్ఘాతంలోని కొంతభాగమే ఉంటుంది. ఒకవేళ వాటిలో పూర్తి ఉపోద్ఘాతం ఉన్నా, ప్రచారకులు దానికి కొన్ని మార్పులు చేసుకోవచ్చు లేదా సొంత ఉపోద్ఘాతం తయారు చేసుకోవచ్చు. ఇంటివాళ్లు తలుపు తెరవగానే, అప్పుడు మనకు ఏది తోచితే అది చెప్పే బదులు, మన ప్రారంభ మాటలను జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.—సామె. 15:28.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
ఉపోద్ఘాతాన్ని సిద్ధం చేసుకోవడానికి, ప్రాక్టీసు చేయడానికి కుటుంబ ఆరాధనలో కొంత సమయం కేటాయించండి.
పరిచర్య చేస్తున్నప్పుడు, ఇంటివాళ్లతో ఏమి మాట్లాడాలని అనుకుంటున్నారో తోటి ప్రచారకునికి చెప్పండి. (సామె. 27:17) ఒకవేళ మీ ఉపోద్ఘాతం సమర్థవంతంగా లేకపోతే దాన్ని మార్చుకోండి.