మే 12తో మొదలయ్యే వారపు పట్టిక
మే 12తో మొదలయ్యే వారం
పాట 34, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 30వ అధ్యా., 10-16 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 27-29 (10 నిమి.)
నం. 1: నిర్గమకాండము 29:19-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసు నిందాస్పదముగా ఒక హింసాకొయ్యపై వేలాడదీయబడ్డాడు—td 42ఎ (5 నిమి.)
నం. 3: అబ్రాహాము—విధేయత, నిస్వార్థ స్ఫూర్తి, ధైర్యం యెహోవాకు సంతోషం కలిగిస్తాయి—ఆది 11:32; 12:6–14:20; నిర్గ 12:40-43; గల 3:17 (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. (యెష. 2:2) ఎన్నో ఏళ్లుగా సత్యంలో ఉన్న ఒక ప్రచారకుణ్ణి, ఈమధ్యే సత్యంలోకి వచ్చిన మరో ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. సత్యంలో వాళ్లను బాగా ఆకర్షించింది ఏమిటి? ఎలాంటి సవాళ్లను వాళ్లు అధిగమించాల్సి వచ్చింది? మొట్టమొదటిసారి సంఘ కూటానికి హాజరైనప్పుడు ఏది వాళ్లను బాగా ఆకట్టుకుంది? మొదటిసారి పరిచర్యలో పాల్గొన్నప్పటి ఏ విషయం వాళ్లకు ఇంకా గుర్తుంది? ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంఘంలోని ఇతరులు వాళ్లకు ఎలా సహాయం చేశారు?
15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఉపోద్ఘాతాన్ని ముందే సిద్ధం చేసుకోండి.” చర్చ. రెండు భాగాలున్న చిన్న ప్రదర్శన చేయించండి. మొదట, అంతగా సిద్ధపడని ఉపోద్ఘాతాన్ని, ఆ తర్వాత బాగా సిద్ధపడిన ఉపోద్ఘాతాన్ని చూపించండి. దీనికి సంబంధించి, పరిచర్య పాఠశాల పుస్తకం 215-219 పేజీల్లో ఉన్న అంశాలను చెప్పండి.
పాట 20, ప్రార్థన