రాజ్య గీతాలను ఆస్వాదించే ఒక చక్కని పద్ధతి
యెహోవా సేవకుల దృష్టిలో సంగీతం ఆయనిచ్చిన వరం. (యాకో. 1:17) చాలా సంఘాల్లో, కూటాలకు ముందూ తర్వాతా తక్కువ వాల్యూమ్‌లో వినిపించే రాజ్య గీతాలను సహోదరులు ఆస్వాదిస్తారు. మనల్ని కూటాలకు ఆహ్వానించడానికి అదొక ఆహ్లాదకరమైన పద్ధతి. అది ఆరాధనకు మన మనసులను సిద్ధం చేస్తుంది. అంతేకాదు, పాటల పుస్తకంలోని కొత్త సంగీతం వినిపించినప్పుడు, మనం దానితో సుపరిచితులమౌతాం, పాటలను చక్కగా పాడగలుగుతాం. కూటం తర్వాత పెట్టే సంగీతం వల్ల, ఒకరితో ఒకరు సహవసించడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి అనువుగా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి, కూటాలకు ముందూ తర్వాతా, యెహోవాకు కీర్తనలు పాడదాం—పియానో సంగీతం ప్లే చేయడానికి ప్రతీ సంఘంలో పెద్దల సభ తగిన ఏర్పాట్లు చేయాలి. సంస్థ రూపొందించిన రికార్డింగులను కాకుండా వేరే వాటిని ఉపయోగించడం సరికాదు. సంగీతం, సంభాషణకు ఆటంకం కలిగించేంత బిగ్గరగా ఉండకుండా పెద్దలు చూసుకోవాలి.