దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2011 డిసెంబరు 26తో మొదలయ్యే వారంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
1. కష్టపడి పనిచేసే విషయంలో మనం చీమను ఎలా అనుకరించవచ్చు? (సామె. 30:24, 25) [w09 4/15 16వ పేజీ, 7-10 పేరాలు]
2. నవ్వు “వెఱ్ఱిది” అని ఎందుకు పిలువబడింది? (ప్రసం. 2:1, 2) [w06 11/1 13వ పేజీ, 6వ పేరా]
3. ప్రసంగి 3:1-9లోని సొలొమోను మాటలు విధి సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయన్న ముగింపుకు కొంతమంది వచ్చినా, ప్రసంగి 9:11లో ఆయన రాసిన మాటల్నిబట్టి జీవితంలో ప్రతీదాన్ని విధే నిర్ణయించదని ఎలా స్పష్టమౌతోంది? [w09 3/1 4వ పేజీ, 4వ పేరా]
4. ‘అతి నీతిమంతునిగా’ ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటి? (ప్రసం. 7:16) [w10 10/15 9వ పేజీ, 8-9 పేరాలు]
5. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నవాళ్లు భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో త్వరపడకుండా ఉంటే మంచిదని పరమగీతము 2:7 ఎలా చూపిస్తుంది? [w06 11/15 19వ పేజీ, 1వ పేరా]
6. షూలమ్మీతీ ‘పెదవులు తేనియలొలకడం,’ ‘ఆమె జిహ్వ కింద మధుక్షీరములు ఉండడం’ దేన్ని సూచిస్తుంది? (పరమ. 4:11) [w06 11/15 19వ పేజీ, 6వ పేరా]
7. దుష్టరాజైన ఆహాజుకు యెహోవా ఎందుకు రక్షణను అనుగ్రహించాడు? (యెష. 7:3, 4) [w06 12/1 9వ పేజీ, 4వ పేరా]
8. ఎఫ్రాయిము 65 సంవత్సరాల్లో ఎలా ‘నాశనమైంది’? (యెష. 7:8) [w06 12/1 9వ పేజీ, 5వ పేరా]
9. యేసుక్రీస్తు ఏ విధంగా, “యెష్షయి మొద్దునుండి చిగురు,” అలాగే “యెష్షయి వేరు” అవుతాడు? (యెష. 11:1, 10; రోమా. 15:12) [w06 12/1 9వ పేజీ, 6వ పేరా]
10. యేసు “దావీదు తాళపుచెవి[ని]” ఎప్పుడు పొందాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? (యెష. 22:22) [w09 1/15 31వ పేజీ, 2వ పేరా]