సంగీతమును ఆనందించుటకు కీలకమేమిటి?
ప్రాచీన లోకమందు మరీనీచమైన అవినీతికార్యములు, విగ్రహారాధన ఆచరించబడుచుండేవి. కనుకనే, క్రైస్తవ ప్రవర్తన విషయములో గట్టిహెచ్చరిక నివ్వవలసిన అగత్యతను పౌలు గమనించెను. ఎఫెసులో ఉన్న సంఘమునకు ఆయనిట్లు వ్రాసెను: “కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.”—ఎఫెసీయులు 4:17, 18.
నేడున్న పరిస్థితులకు కూడ అది సరియైన వర్ణన కాదా? అందు సంగీత రంగము కూడ యిమిడియున్నది. ఆధునిక సంగీతము చాలామట్టుకు ‘దైవికజీవనమునుండి వేరైయున్న’ విధానమును ప్రతిబింబించుచున్నది. ‘కాఠిన్యమునెందిన హృదయమును’ ఆ గీతముల సాహిత్యము తరచు దయ లేక అనురాగములేని రీతిగా మోసగించుచున్నది.
అయితే పౌలు తన హెచ్చరికలో ఒక అడుగుముందుకు వేసియిట్లనెను: “మంచి చెడులనుగూర్చిన వారి వివేచన మందగిల్లినదై ప్రతివిధమైన అపవిత్రకార్యమును అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము లైంగికత్వమునకు అప్పగించుకొనిరి.”—ఎఫెసీయులు 4:19, దిజెరూసలేమ్ బైబిల్.
‘అపవిత్రకార్యమును అత్యాశతో జరిగించుట’ నేడు అధికంగా సంగీతమునుబట్టి జరుగుచున్నది. సాహిత్యము, దానికి సంబంధించిన సంగీతము, లైంగిక దుర్నీతి, హింస, మాదక ద్రవ్యములు, మరియు సుఖానుభవముతో పేరుకుపోయిన తరమునకు తోడ్పడింది. అట్టి దుర్మార్గములను క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు? పౌలు మాటలను గమనించుము: “యేసు నందున్న సత్యమేమిటో మీకు బోధించబడినప్పుడు ఆయన చెప్పినదానిని వినుటలో తప్పియుంటే తప్ప, మీరైతే క్రీస్తునుండి ఆవిధంగా నేర్చుకొనలేదు.”—ఎఫెసీయులు 4:20, 21 జె.బి.
“ఒక ఆత్మీయ పోరాటము” అవసరము
లోక స్వభావానికి ప్రతిరూపమైన సంగీతము విషయములో ఈ సలహాను మనమెట్లు అన్వయించగలము? ఆ విషయములో “క్రీస్తు మనస్సును” మనము కల్గియున్న యెడల అనగా ఆయనకున్న మానసిక దృక్పథమును మనము కల్గియున్నయెడల “భూసంబంధమైన మృగము దయ్యముల సంబంధమైన సంగీతములను వినుటకు మనము యిష్టపడము.”—1 కొరింథీయులు 2:16; యాకోబు 3:15.
అయితే ‘సంగీతము యెడల నాకున్న అభిరుచిని నేనెలా మార్చుకొనగలను?’ అని మీరు అడుగవచ్చును. మరలా పౌలు సహాయము చేయుచున్నాడు. ఆయనిట్లనెను: “నీ పాత జీవన విధానమును నీవు విడిచిపెట్టాలి; మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకోవాలి. ఒక ఆత్మీయ పోరాటము వలన మీ మనస్సు నూతనము కావాలి.”—ఎఫెసీయులు 4:22, 23, జె.బి.
ఆత్మీయ పోరాటము వలన మనస్సును నూతనపర్చడమే, దానికి సమాధానము. సంగీతమునందు మనకున్న అభిరుచికన్నా ఎక్కువ యిందు యిమిడియున్నది. దీనికి మరలా విద్యాభ్యాసము చేయడం, నియమాలను విలువలను ఉన్నతపర్చడం చేయాలి. అనగా మన ఆలోచనా విధానమందు మార్పుచేసి, వేరే విషయాలకు ప్రాధాన్యత యివ్వాలి. దేవుని మరియు క్రీస్తు దృక్పథము దృష్టా సంగతులను పరిశీలించుట యిందు యిమిడియున్నది. పౌలు దీనిని స్పష్టముగా వ్యక్తపర్చినట్లు: “కాబట్టి మీరు భోజనముచేసినను పానముచేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరింథీయులు 10:31.
ఆధునిక సంగీతము అధికభాగము దేవునికి మహిమనిచ్చుటలేదు. బదులుగా ఏ విలువల కొరకైతే క్రైస్తవులు నిలిచియుండి, దేనికొరకైతే అనేకులు చెరసాలలోను కాన్‌సన్‌స్ట్రేషన్ క్యాంపులలోను చనిపోవుటకు సిద్ధపడ్డారో అట్టి వాటిని అది త్రోసిపుచ్చినది. అందుచేత ‘లోకమును లోకములో ఉన్నవాటిని’ ప్రేమించకుండా సంగీతముయెడల మనకున్న అభిరుచిని మార్చుకొనుట ఒక త్యాగమని మనమెందుకు పరిగణించాలి?—1 యోహాను 2:15-17.
మంచి సంగీతము—కీలకమేమిటి?
ఒకవేళ, లేఖన సూత్రముల యెడల మనకున్న గౌరవమునుబట్టి, దిగజారిన సంగీతమును మనము తృణీకరిస్తే దేనితో ఆ ఖాళీని భర్తీచేయగలము? సంగీతముయొక్క క్రొత్త రంగాల కొరకు ఎందుకు అన్వేషించకూడదు? గతములో మనము ఎంచుకొనిన దానికన్నా అవి ఎంతో ఆనందాన్ని ప్రోత్సాహాన్ని యిచ్వేవిగా యుండగలవు. ఉదాహరణకు, గతములో రాక్ సంగీత విద్వాంసునిగా ఉన్నవాడు చేసికొన్న మార్పును గూర్చియిలా చెప్పెను:
“సులభమైన రాక్ స్వరమునుండి అంగీకృతమగు ఖ్యాతిగాంచిన సంగీతమునకు, సాంప్రదాయ సాహిత్యమునకు వెళ్లడాన్కి నేను ప్రయాసపడవలసి వచ్చింది. అయితే వాటికి ఎంతో సారాంశమున్నదని నేను గుర్తించి, అత్యంత ఆధునిక సంగీతములో నేను గుర్తింపు పొందకూడదని తలంచినపుడు అది చాలా సులభమై చాలా సంతృప్తినిచ్చినది. అది అకస్మాత్తుగా సంపూర్ణతను కల్గించింది. ప్రత్యమ్నాయ రకములైన సంగీతముల యెడల పూర్వము నాకున్న ద్వేషమునుబట్టి నేను పోగొట్టుకొన్న దేమిటో తెలిసికొన్నాను.”
బైబిలు సూత్రములకు భిన్నమైన తత్వమును వ్యక్తపర్చని సాంప్రదాయ సంగీతమును, మంచి శ్రావ్యమైన బాణీ, మంచి సాహిత్యముగల గ్రామీణ సంగీతము కొంత ఆధునిక సంగీతము కూడ కలదు. మన ఆలోచనలను చెడు ప్రభావమునకు గురిచేయని సంగీతమును అనగా ‘ఏది సత్యమైనదో, ఏది పవిత్రమైనదో ఏది రమ్యమైనదో ఏది మాన్యమైనదో ఏది ఖ్యాతిగలదో,’ ఆ సంగీతమును కనుగొని ఆనందించుటయే కీలకము.—ఫిలిప్పీయులు 4:8.
క్రైస్తవుని జీవితములో సంగీతముయొక్క పాత్ర
పాడుట మూలంగా లేక ఒక వాద్యమును వాయించుటను నేర్చుకొనుట మూలంగా కొంతమంది మంచి సంగీతమును ఆనందించుచున్నారు. కుటుంబము, స్నేహితులతో కలిసి సమూహముగా పాడినను, ఒంటరిగా పాడుకొన్నను గొప్ప ఆనందమును అనుభవించవచ్చును. అన్ని విషయములవలె దీనిలోను సమతూకము అవసరము ఒక వినోదముగాని కాలక్షేపముగాని క్రైస్తవుని జీవితములో ఎన్నడు ఒక ఆటంకము కాకూడదు. అదే జరిగితే, మంచి సంగీతమైనను, దానిని అమితంగా అనుభవించుటవలన చెడు ప్రభావములను కల్గించగలదు. అప్పుడు క్రైస్తవుడు ‘దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువాడగు’ ప్రమాదములో పడును.—2 తిమోతి 3:4.
యెహోవాకు మనముచేయు ఆరాధనలో సంగీతముకూడ ఒక భాగమైయున్నది. ప్రాచీన ఇశ్రాయేలులో ఆసాపు అతని సహోదరులు యిలా పాడారు: “యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటనచేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుతక్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.” అవును సంగీతము దేవుని స్తుతించగలదు కీర్తించగలదు.—1 దినవృత్తాంతములు 16:8, 9.
యెహోవాసాక్షులు తమ రాజ్యమందిరములలో ఉపయోగించు రాజ్యసంబంధమైన పాటలు బైబిలు వచనములపై కీర్తనలు, ప్రార్థనలు మరియు ఉపదేశములపై ఆధారపడినవి. ఈ పవిత్ర సంగీతమును కూడ మనము పూర్తిగా అనుభవించకూడదా? భావాలతో, ఉత్సాహముతో ఈ పాటలను పాడుచు మన సంతోషాన్ని చూపకూడదా? క్రైస్తవ కూటములలో కాక మరియితర సందర్భములో కింగ్‌డమ్ మెలొడీస్ అని పిలువబడే ఈ పాటల ఏర్పాటుతో మన జీవితములను వెలిగించుకొనకూడదా?
ఈ వాద్య బృందములోని సంగీత విద్వాంసులంతా యెహోవాసాక్షులే. వారిలో కొందరు స్వరమేళనము చేయు వాద్యబృందములో వృత్తిరీత్యా వాయించే వారే. పైన తెల్పబడిన మునుపటి రాక్ సంగీత విద్వాంసులవంటి వారితో కూడిన యితరులు, అనేక విధములైన మంచి సంగీతమును అనుభవిస్తున్న యౌవనులు. లోకసంబంధమైన దయ్యముల సంబంధమైన సంగీతమును విడనాడి నందువలన తాము ఎంతో నష్టపోయామని వారు తలంచడంలేదు. మనము కూడ బైబిలు సూత్రములపై ఆధారపడి ఎంపికచేసుకొంటే, లౌకిక మరియు పవిత్ర సంగీతములలో రెండింటియందు పరిపూర్ణమైన ఆనందమును అనుభవించగలమని వారి మంచి మాదిరి చూపుచున్నది. (w89 6/1)
[21వ పేజీలోని బాక్సు]
“రాక్ సంగీతములో కేవలము అమానుషమైన లైంగిక కోరికను పురికొల్పుటయున్నది—ప్రేమకాదు, ఆప్యాయతకాదు, కేవలము అనాగరికమైన, మొరటైన లైంగిక యిచ్ఛ దానిలో ఉన్నది. . ..రాక్ తాళములో లైంగిక సంపర్కమందలి నడక ఉన్నదని యౌవనులకు తెలియును.”—ది క్లొజింగ్ ఆఫ్‌ది అమెరికన్ మైండ్, బై ఆలన్ బ్లామ్.