పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట ఆగ. 15
“ఇక్కడున్న మాటలపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. [హెబ్రీయులు 3:3 చదవండి.] విశ్వానికి ఒక జ్ఞానవంతుడైన రూపకర్త ఉన్నాడని మీరంగీకరిస్తారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, ఒక రూపకర్త ఉన్నాడనే నమ్మకం విజ్ఞానశాస్త్రానికి అనుగుణంగా ఉందో లేదో పరిశీలిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ప్రపంచంలో చాలాచోట్ల నైతిక విలువలు పతనమైపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు, మీరు దానిని గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] నేడు మనం చూస్తున్న పరిస్థితులు ప్రాచీన కాలపు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయి. [2 తిమోతి 3:2-4 చదవండి.] నైతిక పతనం అంటే ఏమిటి, మానవజాతిని అది ఎక్కడికి నడిపిస్తుంది అనే విషయాలను ఈ పత్రిక వివరిస్తుంది.”
కావలికోట సెప్టెం. 1
“చాలామంది ‘పాత నిబంధన’ చారిత్రక సమాచారాన్ని అందిస్తుందని అనుకుంటారు. అయితే అందులోని సలహాలు ఇప్పటికీ ఆచరణయోగ్యమేనా అని వారు ఆలోచిస్తారు. మీరేమనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి, తర్వాత రోమీయులు 15:4 చదవండి.] దైనందిన జీవితం కోసం, భవిష్యత్తు గురించిన నిజమైన నిరీక్షణ కోసం ‘పాత నిబంధన’ ఎలాంటి ప్రయోజనకరమైన సలహాలనిస్తుందో ఈ పత్రిక చూపిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“జీవించడానికి మనందరికీ డబ్బు అవసరం, అయితే జీవితంలో డబ్బు సంపాదనే ముఖ్య ధ్యేయంగా పెట్టుకునే అవకాశం ఉందంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] ధన సంపాదనలో పడిపోవడంవల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఇక్కడ ఏమి చెప్పబడిందో గమనించండి. [1 తిమోతి 6:10 చదవండి.] ఈ పత్రిక ఒకరు తమ జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకొని, తక్కువ డబ్బుతో జీవితాన్ని ఎలా గడపవచ్చు అనే విషయంలో ఆచరణాత్మక సలహాలనిస్తుంది.”