బ్రాంచి ఉత్తరం
ప్రియమైన రాజ్య ప్రచారకులకు:
ఇండియా బ్రాంచి క్షేత్రంలో 2007 సేవా సంవత్సరంలో జరిగిన ప్రగతిని చూసి మేము సంతోషిస్తున్నాం. మార్చి నెలలో క్రమ పయినీర్లు 1,628 శిఖరాగ్ర సంఖ్యకు, ఏప్రిల్ నెలలో సహాయ పయనీర్లు 4,212 శిఖరాగ్ర సంఖ్యకు చేరుకున్నారు. పయినీర్లు ఎక్కువకావడం ప్రకటనాపనిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి నెలలో రిపోర్ట్ చేసిన 27,153 మంది ప్రచారకులు 25,390 బైబిలు అధ్యయనాలను నిర్వహించారు. కొన్ని క్షేత్రాల్లో వ్యతిరేకతవున్నా, మన సహోదరులు రాజ్య ప్రకటనాపనిలో పట్టుదలతో కొనసాగుతున్నారు.
ఇండియా బ్రాంచి క్షేత్రమంతటా, “మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?” అనే రాజ్యవార్త నం. 37 దాదాపు 9.5 లక్షల కాపీలు పంచిపెట్టబడ్డాయి. ఆసక్తిగలవారు రాజ్యవార్త చివరి పేజీలోని కూపన్‌ను ఉపయోగించి అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్ కావాలని, బైబిలు అధ్యయనాలను నిర్వహించమని అడిగారు. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రికలు పంచిపెట్టడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం గొప్ప విజయం సాధించినందువల్ల ఈ సంవత్సరం 73,193 మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు.
బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో యథార్థ హృదయులు తెలుసుకోవడానికి సహాయం చేయడమే అలాంటి కార్యక్రమాల ఉద్దేశం. (మత్తయి 28:19, 20) ప్రకటిస్తున్నప్పుడు ఆసక్తిగలవారి వివరాలు మర్చిపోకుండా వ్రాసుకొని, బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే గురితో తిరిగి వారిని కలుసుకోండి. మేము, ఈ ప్రాముఖ్యమైన పనిలో మీతో కలిసి ఐక్యంగా సేవచేసేందుకు సంతోషిస్తున్నాం, మీకు మా క్రైస్తవ ప్రేమని తెలియజేస్తున్నాం.
మీ సహోదరులు,
ఇండియా బ్రాంచి కార్యాలయం