మనం పదే పదే ఎందుకు తిరిగి వెళతాం?
1. మన ప్రకటనా పనికి సంబంధించి ఏ ప్రశ్న తలెత్తుతుంది?
1 అనేక ప్రాంతాల్లో మనం మన క్షేత్రాన్ని తరచూ పూర్తిచేస్తుంటాం. గృహస్థులు తమకు ఆసక్తి లేదని చెప్పినా, అవే ఇళ్ళకి మనం పదేపదే వెళ్తుంటాం. గతంలో అనుకూలంగా ప్రతిస్పందించని వారి దగ్గరికి మనమెందుకు పదే పదే వెళతాం?
2. పరిచర్యలో మనం పట్టుదలతో కొనసాగడానికిగల ముఖ్యకారణమేమిటి?
2 దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమ: మనం పరిచర్యలో పట్టుదలతో కొనసాగడానికిగల ముఖ్యకారణం యెహోవాపట్ల మనకున్న ప్రేమ. మన గొప్ప దేవుని గురించి ఇతరులతో మాట్లాడేందుకు మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుంది. (లూకా 6:45) యెహోవాపట్ల మనకున్న ప్రేమ, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపేందుకు, ఇతరులు కూడా అలాగే చేసేలా వారికి సహాయపడేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. (సామె. 27:11; 1 యోహా. 5:3) ఈ పనిలో మనం నమ్మకంగా కొనసాగడం ప్రజల ప్రతిస్పందనపై ఆధారపడిలేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు హింసించబడినా, వారు “మానక” ప్రకటించడంలో కొనసాగారు. (అపొ. 5:42) ప్రజలు వినడానికి తిరస్కరించినప్పుడు మనం నిరుత్సాహపడే బదులు స్థిరంగా ఉంటూ యెహోవాపట్ల మనకున్న ప్రగాఢమైన భక్తిని, ప్రేమను కనబరుస్తాం.
3. ప్రజలపట్ల ప్రేమ, ప్రకటిస్తూ ఉండేందుకు మనకెలా సహాయం చేస్తుంది?
3 మనం పట్టుదలతో కొనసాగడానికిగల మరో కారణం, మనం మన పొరుగువారిని ప్రేమించడమే. (లూకా 10:27) ఎవరూ నాశనమవకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:9) తరచూ పనిచేసిన క్షేత్రంలో కూడా, యెహోవాను సేవించాలనుకునేవారిని మనమింకా కనుగొంటూనే ఉన్నాం. ఉదాహరణకు, ప్రతీ 56 మందిలో ఒక యెహోవాసాక్షి ఉన్న గ్వాడెలోప్లో గత సంవత్సరం 214 మంది బాప్తిస్మం తీసుకున్నారు, ప్రతీ 22 మందిలో ఒకరు అంటే దాదాపు 20,000 మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు!
4. క్షేత్రాలు ఏయే విధాలుగా మారుతుంటాయి?
4 క్షేత్రంలో మార్పులు: మన క్షేత్రంలోని ప్రజలు తరచూ మారుతుంటారు. గతంలో అనుకూలంగా ప్రతిస్పందించని ఒక ఇంటికి మనం మరోసారి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఇంతకుముందు ఎన్నడూ మన సందేశాన్ని వినని మరో వ్యక్తి తలుపు తెరిచి, మనం చెప్పేదాన్ని వినవచ్చు. లేదా కొత్తగా వచ్చిన ఆసక్తిగలవారిని మనం కలుసుకోవచ్చు. వ్యతిరేకించిన తల్లిదండ్రులుగల పిల్లలు పెద్దవారైన తర్వాత ఇల్లును విడిచిపెట్టివుండవచ్చు. అలాంటివారు రాజ్య సందేశాన్ని వినడానికి సుముఖత చూపించవచ్చు. క్షేత్రాల్లో ఎలాంటి ప్రజలను కలుస్తూనే ఉంటాం?
5. ప్రజలు మరింత ఆసక్తి కనబరిచేందుకు ఏవి దోహదపడవచ్చు?
5 ప్రజలు కూడా మారతారు. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు ‘దూషకునిగా హింసకునిగా హానికరునిగా’ ఉండేవాడు. (1 తిమో. 1:12) అదేవిధంగా, నేడు యెహోవాను సేవించే అనేకులు ఒకప్పుడు సత్యంపట్ల ఆసక్తి కనబర్చని వారే. కొందరు సువార్తను ఒకప్పుడు వ్యతిరేకించి కూడా ఉండవచ్చు. లోక పరిస్థితులు మారుతుండగా, కొంతమంది వ్యతిరేకులు లేదా ఉదాసీనత చూపించినవారు వినేందుకు ఇష్టపడవచ్చు. మరికొంతమంది, కుటుంబంలో ఒకరి మరణం, ఉద్యోగం కోల్పోడం, ఆర్థిక సమస్య లేదా అనారోగ్య సమస్య వంటి వ్యక్తిగత విషాద ఘటనలను అనుభవించిన తర్వాత మరింతగా ప్రతిస్పందించవచ్చు.
6. మనమెందుకు ఉత్సాహంగా ప్రకటిస్తూనే ఉండాలి?
6 ఈ విధానాంతం దగ్గరపడింది, అయితే మనం ప్రకటించే, బోధించే పని వేగవంతమౌతుంది. (యెష. 60:22) కాబట్టి, మనం ఉత్సాహంగా ప్రకటిస్తూ, అనుకూల దృక్పథాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాం. మనం తర్వాత మాట్లాడే వ్యక్తి బహుశా వినొచ్చు. మనం మాట్లాడుతూనే ఉండాలి! ‘మనమీలాగుచేసి మనల్ని మనం, మన బోధ వినేవారిని రక్షించుకుంటాం.’—1 తిమో. 4:16.