మనం మన సేవాధిక్యతల్ని విలువైనవిగా ఎంచుతాం!
1 యెహోవా మానవజాతి ఉనికి అంతటిలో, తన ఆరాధకులకు వివిధ రకాల ఆధిక్యతలను ఇచ్చాడు. ఆయన స్త్రీ పురుషులనే, వయస్సు, హోదా అనే తేడా లేకుండా ఆధిక్యతలను అనుగ్రహించాడు. (లూకా 1:41, 42; అపొ. 7:46; ఫిలి. 1:29) నేడు ఆయన మనకెలాంటి ఆధిక్యతలను ఇస్తున్నాడు?
2 మనకున్న కొన్ని ఆధిక్యతలు: యెహోవాచేత బోధించబడే ఆధిక్యత మనకుంది. (మత్త. 13:11, 15) మనమానందించే మరో ఆధిక్యత ఏమిటంటే, సంఘకూటాల్లో వ్యాఖ్యానించడం ద్వారా యెహోవాను స్తుతించడం. (కీర్త. 35:18) వ్యాఖ్యానించే అవకాశాలు మనకు లభించినప్పుడు మనం ఉత్సాహంగా వ్యాఖ్యానిస్తాం. అదేవిధంగా, సంఘంలోని ప్రతీ నియామకాన్ని మనమొక గౌరవంగా దృష్టిస్తే, మనమా నియామకాన్ని సాధ్యమైనంత చక్కగా నిర్వర్తిస్తాం. రాజ్యమందిరాన్ని శుభ్రంచేస్తూ, దానిని భద్రంగా కాపాడుకునే సేవాధిక్యతలో మనం క్రమంగా పాల్గొంటున్నామా?
3 దేవుడు తమ ప్రార్థనలను వింటాడా అనే సందేహాన్ని లక్షలాదిమంది వ్యక్తపరచినా, విశ్వంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి మన ప్రార్థనలు ఆలకించడమనే విశిష్ఠ వరాన్ని మనమానందిస్తున్నాం. (సామె. 15:29) తన సేవకుల ప్రార్థనలను యెహోవా స్వయంగా వింటాడు. (1 పేతు. 3:12) మనమెంత తరచుగా ప్రార్థించాలనే విషయంలో ఆయన ఎలాంటి ఆంక్షలను విధించడు. ‘ప్రతి సమయంలో’ ప్రార్థించగల ఎంత చక్కని ఆధిక్యత మనకుందో కదా!—ఎఫె. 6:18.
4 ‘దేవుని జతపనివారిగా’ ఉండడం: మనకున్న చక్కని ఆధిక్యతల్లో ‘దేవుని జతపనివారిగా’ దేవుని రాజ్యసువార్తను ప్రకటించడం ఒకటి. (1 కొరిం. 3:9) ఇది సంతృప్తిని, సేదదీర్పును ఇచ్చే పని. (యోహా. 4:34) తన పనిని పూర్తిచేసేందుకు యెహోవా మనుష్యులను ఉపయోగించుకోవాల్సిన అవసరంలేదు, అయితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ నియామకాన్ని మనకిచ్చాడు. (లూకా 19:39, 40) అయితే యెహోవా ఆ నియామకాన్ని విచక్షణారహితంగా అందరికీ ఇవ్వలేదు. బహిరంగ పరిచర్యలో పాల్గొనేవారికి నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అర్హతలు ఉండాలి. అంతేకాక, వారు వాటిని కాపాడుకోవాలి. (యెష. 52:11) ప్రతీవారం మనం చేసే పనుల్లో పరిచర్యను ప్రాముఖ్యమైన భాగంగా చేసుకోవడం ద్వారా ఈ ఆధిక్యతను విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తున్నామా?
5 యెహోవా ఇచ్చే ఆధిక్యతలు మన జీవితాన్ని సంతృప్తికరమైనదిగా చేస్తాయి. (సామె. 10:22) వాటిని ఏ మాత్రం తేలికగా తీసుకోకండి! మన సేవాధిక్యతలను మనం నిజంగా విలువైనదిగా ఎంచుతున్నామని చూపించడం ద్వారా, మనం “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే మన పరలోకపు తండ్రిని సంతోషపరుస్తాం.—యాకో. 1:17.