పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“మన పిల్లలు ఆనందకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలని మనమందరం కోరుకుంటాం. నేటి లోకంలోని ఒత్తిళ్లను తట్టుకోవాలంటే పిల్లలకు ఎక్కువగా ఏమి అవసరమని మీరు భావిస్తున్నారు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 22:6 చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక పిల్లలకు ఏమి అవసరం, వాటిని తల్లిదండ్రులు ఎలా తీరుస్తారు అనే విషయాలను చర్చిస్తుంది.”
కావలికోట ఏప్రి. 15
“తమ జీవితంలో సంభవించే విషాద ఘటనలతోపాటు అన్ని సంఘటనలు దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయని కొంతమంది భావిస్తారు. మీరు ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రార్థన గురించి చాలామందికి తెలుసు. [మత్తయి 6:10బి చదవండి.] ఈ భూమిపట్ల దేవుని చిత్తం ఏమిటి, అదెప్పుడు నెరవేరుతుంది? అనే ప్రశ్నలకు ఈ పత్రిక బైబిలు నుండి జవాబులను ఇస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“అనేకమంది దౌత్య ప్రయత్నాల ద్వారా ప్రపంచ శాంతిని సాధించవచ్చని నమ్ముతారు. అలాంటప్పుడు శాంతి చర్చలు తరచూ పరిమిత విజయాన్నే ఎందుకు సాధిస్తున్నాయి? [ప్రతిస్పందించనివ్వండి.] అలాంటి దౌత్య ప్రయత్నాలు తరచూ విఫలమవడానికి గల నిజమైన కారణాలను ఈ పత్రిక పరిశీలిస్తుంది. ఇది బైబిలు వాగ్దానం చేస్తున్న లోకం గురించి కూడా వివరిస్తుంది, ఆ లోకంలో నిజమైన శాంతి గురించిన మన కోరిక నిజమవుతుంది, ఆ శాంతి నిరంతరం ఉంటుంది! కీర్తన 37:11, 29 చదవండి.”
కావలికోట మే 1
“మానవ సమాజాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో కొందరు మతనాయకులు రాజకీయాల్లో పాల్గొన్నారు. కానీ, యేసును రాజుగా చేయాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఆయనేమి చేశాడో గమనించండి. [యోహాను 6:15 చదవండి.] యేసు ఇతరులకు శాశ్వతంగా మంచిని చేకూర్చేదానిపైనే దృష్టి సారించాడు. అదేమిటో ఈ పత్రిక చర్చిస్తుంది.”