కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/07 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 4/07 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట ఏప్రి. 15

“క్రూరమైన కృత్యాలు సర్వసాధారణమౌతున్నట్లుగా అనిపిస్తున్నాయి. [స్థానిక ఉదాహరణ లేదా పత్రికలో నుండి ఒక ఉదాహరణను పేర్కొనండి.] ప్రజలు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలరని మీరెప్పుడైనా అనుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మన కాలంలో క్రూరత్వం పెరుగుతుందని బైబిలు ముందుగానే చెప్పింది. [2 తిమోతి 3:1-5 చదవండి.] ఈ పత్రిక ‘క్రూరత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“వ్యాధులతో జరుగుతున్న పోరాటంలో వైద్యవిజ్ఞానం ఎంతో ప్రగతి సాధించింది, కానీ వ్యాధులు ఇక ఉండని ప్రపంచాన్ని మనం ఎప్పటికైనా చూస్తామని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ వాగ్దాన నెరవేర్పుగా, భూమ్మీదున్న ప్రజలందరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే పరిస్థితి గురించి ఈ పత్రిక వివరిస్తోంది.” యెషయా 33:24 చదవండి.

కావలికోట మే 1

“తమ పిల్లల మరణం తల్లిదండ్రులకు ఎంతోకాలం ఉండే తీవ్రమైన బాధను కలిగిస్తుంది. వారు ఎవరి నుండి ఓదార్పు పొందవచ్చని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత రోమీయులు 15:5 చదవండి.] దుఃఖిస్తున్నవారికి దేవుడు ఓదార్పునందించే మార్గాల్లో కొన్నింటిని ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“ప్రజలు సాధారణంగా వినయాన్ని బలహీనతకు గుర్తుగా పరిగణిస్తారేగానీ బలానికి కాదు. అది నిజమని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత సామెతలు 22:4 చదవండి.] ఈ లక్షణాన్ని గురించి బైబిలు ఏమి చెబుతోందో ఈ పత్రిక తెలియజేస్తుంది.” 20వ పేజీలోని శీర్షికను చూపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి