కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/04 పేజీ 1
  • మీ కృతజ్ఞతను చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కృతజ్ఞతను చూపించండి
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • “కృతజ్ఞులై యుండుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • “కృతజ్ఞులై యుండుడి”
    మన రాజ్య పరిచర్య—1997
  • మనకున్న వాటినిబట్టి కృతజ్ఞులము
    మన రాజ్య పరిచర్య—1995
  • యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 5/04 పేజీ 1

మీ కృతజ్ఞతను చూపించండి

1 మనము ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నప్పటికీ, యెహోవాకు కృతజ్ఞులముగా ఉండేందుకు అనేక కారణాలున్నాయి. (2 తిమో. 3:1) వాటిలో అత్యున్నతమైనది, ఆయన మన కోసం తన కుమారుణ్ణి అమూల్యమైన బహుమతిగా ఇవ్వడం. (యోహా. 3:16) అంతేకాక, అబద్ధ మతంలో ఉన్నవారు ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తుంటే, మనం పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాం. (యెష. 65:13) ప్రపంచవ్యాప్త సౌభ్రాత్రుత్వంలో మనం భాగస్తులం, సత్యారాధనను వ్యాప్తి చేయడంలో పాల్గొనే ఉత్తేజకరమైన అవకాశం కూడా మనకుంది. (యెష. 2:3, 4; 60:4-10, 22) యెహోవా మనమీద కుమ్మరిస్తున్న ఆశీర్వాదాలకు, ఆయనకు మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?—కొలొ. 3:15, 17.

2 సంతోషంగా, మనస్ఫూర్తిగా చేసే సేవ: అపొస్తలుడైన పౌలు భౌతికపరంగా ఇవ్వడం గురించి చర్చిస్తున్నప్పుడు, ఇలా వ్రాశాడు: “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరిం. 9:7) ఈ సూత్రం మనం దేవునికి చేసే సేవకు కూడా వర్తిస్తుంది. సత్యం పట్ల మనకున్న ఉత్సాహంలో, క్రైస్తవ కూటాల్లోని మన ఆనందంలో, క్షేత్రసేవలోని మన ఆసక్తిలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోని మన సంతోషంలో కృతజ్ఞత ప్రతిబింబిస్తుంది.—కీర్త. 107:21, 22; 119:14; 122:1; రోమా. 12:8, 11.

3 ప్రాచీన ఇశ్రాయేలులో కొన్ని అర్పణల విషయంలో ధర్మశాస్త్రం ఒక నిర్దిష్ట మొత్తాన్ని విధించలేదు. ప్రతి ఆరాధకుడు తనకు ‘యెహోవా అనుగ్రహించిన దీవెన చొప్పున’ తన కృతజ్ఞతను చూపించవచ్చు. (ద్వితీ. 16:16, 17) అదే విధంగా నేడు, కృతజ్ఞతతో నిండిన హృదయం మన పరిస్థితులు అనుకూలించినంత మేరకు రాజ్య ప్రకటనా పనిని, శిష్యులను చేసే పనిని కొనసాగించేందుకు మనల్ని పురికొల్పుతుంది. వేసవి నెలలు తరచూ, మన కృతజ్ఞతను చూపించేందుకు అదనపు అవకాశాలనిస్తాయి. కొందరు క్షేత్ర సేవలో మరింత సమయం గడపడానికి, లేదా సహాయ పయినీరు సేవ చేయడానికి, తమ ఉద్యోగంలో లేక పాఠశాలలో దొరికే సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ వేసవిలో మీరు మీ పరిచర్యను విస్తరింపజేసుకోగలరా?

4 కృతజ్ఞత పొంగిపోవడం: యెహోవాకు మన కృతజ్ఞతలు తెలిపే చాలా ముఖ్యమైన మార్గం ప్రార్థన. (1 థెస్స. 5:17, 18) దేవుని వాక్యం మనల్ని ‘విశ్వాసంతో కృతజ్ఞత పొంగిపోవాలి’ అని ఉద్బోధిస్తోంది. (కొలొ. 2:6, 7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనం తీరికలేని పనుల్లో లేదా ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మన దైనందిన ప్రార్థనల్లో కృతజ్ఞతలను ఎల్లప్పుడూ చేర్చాలి. (ఫిలి. 4:6) అవును మనం మన పరిచర్య ద్వారా, మన ప్రార్థనల ద్వారా “దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించు[దము]” గాక.—2 కొరిం. 9:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి