పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటమార్చి 15
“మనలో చాలామంది మరణం మూలంగా మన ప్రియమైనవారిని పోగొట్టుకున్న చేదు అనుభవాన్ని ఎదుర్కొనేవుంటాం. ఓదార్పునిచ్చే ఈ వాగ్దానం మీకు తెలుసా? [అపొస్తలుల కార్యములు 24:14 చదవండి. తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఎవరు పునరుత్థానం చేయబడతారు? అది ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? వంటి ప్రశ్నల గురించి చాలామంది ఆలోచిస్తారు. ఈ పత్రిక, ఆ ప్రశ్నలకు బైబిలునుండి సమాధానాలు ఇస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ప్రకృతి విపత్తులు కలిగించే బాధను చూడడం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. [స్థానికంగా తెలిసిన ఒక ఉదాహరణను పేర్కొనండి.] అలాంటి విపత్తులు పెరిగిపోతున్నాయని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక ఆ ప్రశ్ననే చర్చిస్తోంది. అంతేగాక అటువంటి విపత్తుల్లో తమ ప్రియమైనవారిని కోల్పోయినవారికి ఓదార్పును కూడా ఇస్తుంది.” యోహాను 5: 28, 29 చదవండి.
కావలికోటఏప్రి. 1
“ఈ సుపరిచిత లోకోక్తి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెబుతుంది. [మత్తయి 4:4 చదవండి.] కానీ చాలామందికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి.] మీకు బైబిలు అర్థం చేసుకోవడంలో సహాయం చేసేందుకు ఈ పత్రిక ఆచరణాత్మకమైన సూచనలను అందిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“20 లేక 30 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 119:105 చదవండి.] మన భవిష్యత్తులో ఏమి జరగబోతోందో గ్రహించేందుకు బైబిలు మన మార్గాలను ప్రకాశమానంగా చేస్తుంది. ఈ పత్రిక, మనం కాలప్రవాహంలో ఎక్కడ ఉన్నామో తెలిపే ప్రవచనాలను వివరించడమే కాక, మనం ఒక ఉజ్జ్వలమైన భవిష్యత్తును ఎందుకు ఆశించవచ్చో కూడా తెలియజేస్తుంది.”