పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“మన కాలంలోని ఒక విషాదకర వాస్తవమైన బాల వేశ్యావృత్తి గురించి ఈ తేజరిల్లు! సంచిక నివేదిస్తోంది. బాలలపై జరుగుతున్న అతి దారుణమైన ఈ అత్యాచారం త్వరలోనే అంతమౌతుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. [సామెతలు 2:21, 22 చదవండి.] స్వలాభం కోసం పిల్లలను ఇలా వాడుకోవడం వెనుక ఉన్నదేమిటో, అది ఎలా అంతం చేయబడుతుందో ఈ పత్రిక తెలియజేస్తుంది.”
కావలికోట ఏప్రి. 15
“ఇటీవలి సంవత్సరాల్లో ఆధ్యాత్మిక విలువలు దిగజారిపోవడాన్ని చాలామంది గమనించారు. మీరు కూడా గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 119:105 చదవండి.] జీవితంలో అనేక ప్రమాదాలను నివారించడానికి ప్రజలకు ఆధ్యాత్మిక విలువలు సహాయం చేయగలవు. నిజమైన ఆధ్యాత్మిక విలువలు ఎక్కడ లభిస్తాయో ఈ పత్రిక సూచిస్తోంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“నిజాయితీయే అత్యుత్తమ మార్గమని స్కూలు పిల్లలకు నేర్పించబడుతుంది. కానీ చాలామంది పిల్లలు పరీక్షల్లో ఎందుకు కాపీ కొడతారో మీకు తెలుసా? అది నిజంగా ప్రతిఫలదాయకమైనదేనా? [ప్రతిస్పందించనివ్వండి, హెబ్రీయులు 13:18 చదవండి.] ఈ తేజరిల్లు! సంచిక [17వ పేజీ చూపించండి] కాపీ కొట్టడంలో తప్పేముంది? అనే ప్రశ్నకు సమాధానమిస్తోంది.”
కావలికోట మే 1
“కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం మానవ సామర్థ్యానికి మించినది. ఈ ఉదాహరణను గమనించండి. [యోబు 21:7 చదవండి.] మీరెప్పుడైనా దేవుణ్ణి ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] జీవితానికి సంబంధించిన మూడు అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు భూవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సంతృప్తికరమైన సమాధానాలను ఎలా కనుగొన్నారో ఈ పత్రిక వివరిస్తోంది.”