మీకు సమీపంలో జరిగే “దైవిక జీవిత మార్గము” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు ప్రణాళికలు వేసుకోండి!
అక్టోబరు 2, 1998లో ప్రారంభమై, 1998 డిసెంబరు నెలాఖరు వరకూ జరిగే యెహోవాసాక్షుల 17 జిల్లాసమావేశాలు ఇండియాలో జరుగుతాయి. కార్యక్రమం ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో జరుగుతాయి.
ప్రేరేపించే అనేక బైబిలు ప్రసంగాల్నీ, ఆచరణీయమైన ప్రదర్శనల్నీ తప్పిపోవద్దు. కుటుంబాలు చింతలతో ఎలా వ్యవహరించాలనే దాన్ని గూర్చిన నిజజీవిత నాటకాన్ని చూసి ఆనందించండి. కార్యక్రమాలన్నీ ఉచితం. క్రిందనివ్వబడిన సమావేశ స్థలాల్లో ఎక్కడైనాసరే హాజరవ్వండి.