కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/15 పేజీలు 14-19
  • యెహోవా చిత్తం చేయడానికి నేర్పబడుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా చిత్తం చేయడానికి నేర్పబడుతుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని చిత్తాన్ని చేయడానికి అధిక ప్రాధాన్యత
  • మన కూటాల్లో యెహోవా చిత్తం నేర్పబడుతుంది
  • దైవిక తలిదండ్రుల ద్వారా యెహోవా చిత్తం నేర్పబడుతుంది
  • ప్రేమించడం, పోరాడడం నేర్పబడుతుంది
  • మనకు మనం ప్రయోజనం చేకూర్చుకోవడాన్ని నేర్పించడం
  • నేటి వరకు యెహోవాచే బోధింపబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా—బోధించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “మీకు మాదిరి ఉంచాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/15 పేజీలు 14-19

యెహోవా చిత్తం చేయడానికి నేర్పబడుతుంది

“నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”—కీర్తన 143:10.

1, 2. (ఎ) మనం ఎప్పుడు మరియు ఏ వాస్తవమైన దృక్పథంతో నేర్పించబడాలి? (బి) యెహోవాచే నేర్పబడడం ఎందుకు అంత ప్రాముఖ్యము?

ఒక వ్యక్తి సజీవంగా చురుకుగా ఉన్న ప్రతి రోజూ అతనికి ఏదైనా ప్రయోజనకరమైనది నేర్పవచ్చు. అది మీ విషయంలోనూ ఇతరుల విషయంలోనూ నిజమే. కాని మరణమందు ఏమి సంభవిస్తుంది? ఆ స్థితిలో నేర్పబడడంగాని నేర్చుకోవడంగాని సాధ్యంకాదు. మృతులు “ఏమియు ఎరుగరు” అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. మానవజాతి యొక్క సామాన్య సమాధియైన పాతాళములో జ్ఞానము లేదు. (ప్రసంగి 9:5, 10) మనం నేర్చుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించుకోవడం వ్యర్థమని దీని భావమా? మనకు ఏమి నేర్పబడింది, ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేదానిపై అది ఆధారపడి ఉంటుంది.

2 మనకు కేవలం లోకసంబంధమైనది మాత్రమే నేర్పబడితే, మనకు నిరంతరం నిలిచే భవిష్యత్తు ఉండదు. అయితే సంతోషకరంగా, నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జనాంగాలలోని లక్షలాదిమంది ప్రజలకు దైవిక చిత్తం నేర్పబడుతోంది. ఈ నిరీక్షణకు ఆధారం, జీవాన్నిచ్చే జ్ఞానానికి మూలమైన యెహోవాచే నేర్పబడడంలో ఉంది.—కీర్తన 94:9-12.

3. (ఎ) యేసు దేవుని మొదటి విద్యార్థిగా ఉండెనని ఎందుకు చెప్పవచ్చు? (బి) మానవులు యెహోవాచే నేర్పబడతారని మనకు ఏ నిశ్చయత ఉంది, దాని ఫలితమేమిటి?

3 దేవుని జ్యేష్ఠ కుమారునికి ఆయన మొదటి విద్యార్థిగా, తన తండ్రి చిత్తాన్ని చేయడం నేర్పబడింది. (సామెతలు 8:22-30; యోహాను 8:28) ఫలితంగా, అనేకానేకమంది మానవులు తన తండ్రిచే నేర్పబడతారని యేసు సూచించాడు. దేవుని నుండి నేర్చుకొనే మన కొరకు ఏ ఉత్తరాపేక్షలు ఉన్నాయి? యేసు ఇలా అన్నాడు, “వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును . . . విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు . . . అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”—యోహాను 6:45-51.

4. దైవిక బోధ ద్వారా లక్షలాదిమంది ప్రజలు ఎలా ప్రభావితమౌతున్నారు, వారికి ఏ ఉత్తరాపేక్షలు ఉన్నాయి?

4 దేవుని సూచనార్థక స్త్రీయైన పరలోక సీయోనును సంబోధిస్తున్న యెషయా 54:13ను యేసు సూచిస్తుండెను. ఆ ప్రవచనం యేసుక్రీస్తు యొక్క ఆత్మాభిషిక్త శిష్యులైన 1,44,000 మందియగు ఆమె కుమారులకు ప్రత్యేక అన్వయింపును కలిగివుంది. ఆ ఆత్మీయ కుమారుల శేషం భూగోళవ్యాప్త బోధనా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తూ, నేడు చురుకుగా ఉంది. ఫలితంగా, “గొప్ప సమూహము” వారైన లక్షలాదిమంది ఇతరులు కూడా యెహోవాచే నేర్పబడడం నుండి ప్రయోజనం పొందుతున్నారు. మరణాన్ని రుచి చూడకుండా నేర్చుకోవడంలో కొనసాగే విశేషమైన ఉత్తరాపేక్ష వారికుంది. అదెలా? వారు త్వరగా సమీపిస్తున్న “మహా శ్రమ”ను తప్పించుకుని, పరదైసు భూమిపై నిత్యజీవాన్ని అనుభవిస్తారు.—ప్రకటన 7:9, 10, 13-17.

దేవుని చిత్తాన్ని చేయడానికి అధిక ప్రాధాన్యత

5. (ఎ) 1997 కొరకైన వార్షిక లేఖనం ఏది? (బి) క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం గురించి మనమెలా భావించాలి?

5 ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80,000 కంటే ఎక్కువ సంఘాల్లో, 1997వ సంవత్సరంలో, యెహోవాసాక్షులు కీర్తన 143:10 నందలి ఈ ప్రారంభ మాటలను మనస్సులో ఉంచుకుంటారు: “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.” అది 1997 కొరకు వార్షిక లేఖనంగా ఉంటుంది. రాజ్యమందిరాల్లో ప్రముఖంగా ప్రదర్శించబడే ఆ మాటలు, దైవిక విద్యను నేర్చుకోవడానికి విశేషమైన స్థలం సంఘ కూటాలవద్దనే అనే దానికి మనకు జ్ఞాపికగా పనిచేస్తాయి. అక్కడ మనం నిరంతరం కొనసాగే ఉపదేశ కార్యక్రమంలో భాగం వహించవచ్చు. మహాగొప్ప ఉపదేశకుని ద్వారా నేర్పబడడానికి కూటాల వద్ద మన సహోదరులతో కలిసేటప్పుడు, మనం కీర్తనల గ్రంథకర్తవలె భావించవచ్చు, ఆయనిలా వ్రాశాడు: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.”—కీర్తన 122:1; యెషయా 30:20.

6. దావీదు మాటల్లో మనం ఏమి గుర్తిస్తాము?

6 మన శత్రువైన అపవాది చిత్తం లేక అపరిపూర్ణ మానవుల చిత్తం బదులుగా దేవుని చిత్తం చేయడానికి నేర్పబడడాన్ని మనం కోరుకుంటాము. కాబట్టి, దావీదు వలె, మనం ఆరాధించి సేవ చేసే దేవున్ని మనమిలా గుర్తిస్తాము: “నీవే నా దేవుడవు . . . దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.” (కీర్తన 143:10) దావీదు పనికిమాలినవారితో సాంగత్యము చేసేబదులు, యెహోవా ఆరాధన జరిగే స్థలంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. (కీర్తన 26:4-6) దేవుని ఆత్మ తనకు నడిపింపునిస్తుండగా, దావీదు నీతిమార్గములలో నడవగలిగాడు.—కీర్తన 17:5; 23:3.

7. క్రైస్తవ సంఘంపై దేవుని ఆత్మ ఎలా పనిచేసింది?

7 పరిశుద్ధాత్మ అన్ని విషయాలు బోధించి, తాను చెప్పిన విషయాలను జ్ఞాపకం చేస్తుందని మహాగొప్ప దావీదైన యేసుక్రీస్తు అపొస్తలులకు హామీ ఇచ్చాడు. (యోహాను 14:26) పెంతెకొస్తు సమయం నుండి యెహోవా తన లిఖిత వాక్యమందున్న “దేవుని మర్మములను” క్రమానుసారంగా బయల్పరుస్తూ వచ్చాడు. (1 కొరింథీయులు 2:10-13) దీన్ని ఆయన, ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ అని యేసు పిలిచిన దృశ్య మాధ్యమం ద్వారా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల సంఘాల బోధనా కార్యక్రమంలో పరిశీలించబడే ఆత్మీయ ఆహారాన్ని అది అందజేస్తుంది.—మత్తయి 24:45-47.

మన కూటాల్లో యెహోవా చిత్తం నేర్పబడుతుంది

8. కావలికోట పఠనంలో భాగం వహించడం ఎందుకంత విలువైనది?

8 వారపు సంఘ కావలికోట పఠన సమాచారంలో తరచూ బైబిలు సూత్రాల అన్వయింపు ఇమిడి ఉంటుంది. జీవిత చింతలను ఎదుర్కోవడానికి ఇది మనకు తప్పక సహాయం చేస్తుంది. ఇతర పఠనాల్లో స్పష్టమైన ఆత్మీయ సత్యాలు లేక బైబిలు ప్రవచనాలు పరిశీలించబడతాయి. అలాంటి పఠనాల్లో మనకు ఎంతగా నేర్పబడుతుందోకదా! అనేక దేశాల్లో ఈ కూటాలు జరిగేటప్పుడు రాజ్యమందిరాలు పూర్తిగా నిండిపోతాయి. అయినప్పటికీ మరనేక దేశాల్లో, కూటాల హాజరు తగ్గిపోయింది. కారణమేమిటని మీరనుకుంటున్నారు? “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” క్రమంగా కలిసి సమావేశమయ్యే విషయంలో లౌకిక ఉద్యోగం ఆటంకం కలిగించడాన్ని కొందరు అనుమతిస్తున్నారా? లేక కూటాలన్నింటికీ హాజరవ్వలేనంతగా సామాజిక కార్యకలాపాల్లో లేక టివి చూడడంలో అనేక గంటలు గడుపుతూ తమ వ్యక్తిగత విషయాల్లో నిమగ్నమై ఉంటున్నారా? హెబ్రీయులు 10:23-25 నందలి ప్రేరేపిత ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం ‘ఆ దినము సమీపించడాన్ని’ చూస్తుండగా దైవిక ఉపదేశం కొరకు కలిసి సమావేశమవ్వడం మరింత ప్రాముఖ్యం కాదా?

9. (ఎ) సేవా కూటం మనల్ని పరిచర్య కొరకు ఎలా సంసిద్ధులను చేయగలదు? (బి) సాక్ష్యమివ్వడం గురించి మన దృక్పథం ఏమైవుండాలి?

9 దేవుని పరిచారకులుగా సేవ చేయడమనేది మన ప్రధానమైన బాధ్యతల్లో ఒకటి. దీన్ని మనం ప్రభావవంతంగా ఎలా నెరవేర్చవచ్చుననేది మనకు బోధించడానికి సేవా కూటం రూపొందించబడింది. ప్రజలను ఎలా సమీపించాలో, ఏమి చెప్పాలో, అనుకూల ప్రతిస్పందన ఉన్నప్పుడు ఎలా ప్రతిస్పందించాలో, చివరికి ప్రజలు మన వర్తమానాన్ని నిరాకరించినప్పుడు ఏమి చేయాలో మనం నేర్చుకుంటాము. (లూకా 10:1-11) ఈ వారపు కూటంలో ప్రభావవంతమైన విధానాలు చర్చించబడి ప్రదర్శించబడుతుండగా, ఇంటింటికి వెళ్లేటప్పుడు మాత్రమే కాకుండా వీధుల్లోనూ పార్కింగ్‌ స్థలాల్లోనూ ప్రజా రవాణా సౌకర్యాల్లోనూ విమానాశ్రయాల్లోనూ వ్యాపార స్థలాల్లోనూ లేక పాఠశాలల్లోనూ ప్రకటించేటప్పుడు కూడా మనం చక్కగా సిద్ధపడి ఉంటాము. “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” అనే మన విన్నపానికి అనుగుణంగా, మన యజమాని కోరినట్లుగా ఇలా చేయడానికి ప్రతి అవకాశం నుండి ప్రయోజనం పొందాలని మనం కోరుకుంటాము: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్తయి 5:16.

10. ‘యోగ్యులైన వారికి’ మనం నిజంగా ఎలా సహాయం చేయగలము?

10 ఇతరులను శిష్యులుగా చేయడం కూడా అలాంటి సంఘ కూటాల్లో మనకు నేర్పబడుతుంది. ఒకసారి ఆసక్తిని కనుగొన్న తర్వాత లేక సాహిత్యాన్ని అందించిన తర్వాత, పునర్దర్శనాలు చేయడంలో మన ఉద్దేశం గృహ బైబిలు పఠనాలు ప్రారంభించాలన్నదే. ఒక విధంగా ఇది, యేసు ఆజ్ఞాపించిన విషయాలను ‘యోగ్యులైన వారికి’ బోధించడానికి శిష్యులు ‘వారితో కలిసి ఉండడం’ వంటిదే. (మత్తయి 10:11; 28:19, 20) నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకం వంటి చక్కని సహాయకాలు ఉన్నందున మనం మన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చడానికి నిజంగా పూర్తిగా సంసిద్ధులమై ఉన్నాము. (2 తిమోతి 4:5) ప్రతివారం మీరు సేవా కూటానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు హాజరవుతుండగా, దేవుని చిత్తాన్ని చేస్తూ ఆయన పరిచారకులుగా పూర్తిగా యోగ్యులైనవారిగా మిమ్మల్ని సిఫారసు చేసే సహాయకరమైన విషయాలను గ్రహించి ఆ తర్వాత ఉపయోగించడానికి ప్రయత్నించండి.—2 కొరింథీయులు 3:3, 5; 4:1, 2.

11. మత్తయి 6:33 నందు కనుగొనబడే మాటలయందు విశ్వాసాన్ని కొందరు ఎలా చూపించారు?

11 మనం దేవుని “రాజ్యమును నీతిని మొదట వెదక”డం ఆయన చిత్తమైవుంది. (మత్తయి 6:33) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నా [లేక నా జత యొక్క] లౌకిక ఉద్యోగం కూటాలకు హాజరు కావడానికి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకుంటే నేను ఈ సూత్రాన్ని ఎలా అన్వయించుకుంటాను?’ ఆత్మీయంగా పరిణతి చెందిన అనేకులు ఈ విషయం గురించి తమ యజమానులతో మాట్లాడడానికి చర్యలు తీసుకుంటారు. సంఘ కూటాలకు హాజరయ్యేందుకు ప్రతి వారం తనకు సమయం కావాలని ఒక పూర్తికాల పరిచారకురాలు తన యజమానికి తెలియజేసింది. ఆయన ఆమె విన్నపాన్ని అంగీకరించాడు. అయితే కూటాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన కూటాలకు హాజరవుతానన్నాడు. అక్కడాయన త్వరలో జరుగనైవున్న జిల్లా సమావేశాన్ని గురించిన ప్రకటనను విన్నాడు. ఫలితంగా, సమావేశం వద్ద మొత్తం దినమంతా గడపడానికి ఆ యజమాని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదాహరణ నుండి మీరు ఏ పాఠం నేర్చుకుంటారు?

దైవిక తలిదండ్రుల ద్వారా యెహోవా చిత్తం నేర్పబడుతుంది

12. పిల్లలకు యెహోవా చిత్తాన్ని నేర్పించడానికి క్రైస్తవ తలిదండ్రులు సహనంతోనూ స్థిరత్వంతోను ఏమి చేయాలి?

12 అయితే దైవిక చిత్తాన్ని చేయడానికి నేర్పబడేందుకు సంఘ కూటాలు మరియు సమావేశాలే ఏకైక ఏర్పాటు కాదు. తమ పిల్లలు యెహోవాను స్తుతించేందుకు, ఆయన చిత్తాన్ని చేసేందుకు వారికి తర్ఫీదును, శిక్షణను ఇచ్చి వారిని పెంచాలని దైవిక తలిదండ్రులకు ఆజ్ఞాపించబడింది. (కీర్తన 148:12, 13; సామెతలు 22:6, 15) అలా చేయడానికి మనం మన ‘పిల్లలను’ కూటాలకు తీసుకు వెళ్లడం అవసరం, అక్కడ వారు ‘విని నేర్చుకోగలుగుతారు,’ కాని వారికి ఇంటి వద్ద పరిశుద్ధ లేఖనాలలో నుండి బోధించడం విషయమేమిటి? (ద్వితీయోపదేశకాండము 31:12; 2 తిమోతి 3:15) అనేక కుటుంబాలు మనస్సాక్షిపూర్వకంగా క్రమ కుటుంబ బైబిలు పఠన కార్యక్రమాలను ప్రారంభించాయి, కాని ఎంతో కాలం అలా క్రమంగా కొనసాగించలేకపోయాయి. మీకు అలాంటి అనుభవం కలిగిందా? అలాంటి క్రమమైన పఠనాన్ని సిఫారసు చేయడం సముచితం కాదనే లేక మీ కుటుంబం భిన్నమైనది కాబట్టి అది మీ విషయంలో పనిచేయదనే నిర్థారణకు మీరు వస్తారా? పరిస్థితి ఏదైనప్పటికీ, తలిదండ్రులైన మీరు ఆగస్టు 1, 1995 కావలికోట నందలి “మన ఘనమైన ఆత్మీయ వారసత్వం” మరియు “పట్టుదలకు లభించే ప్రతిఫలాలు” వంటి చక్కని శీర్షికలను దయచేసి పునఃపరిశీలించండి.

13. దిన వచనాన్ని పరిశీలించడం మూలంగా కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

13 ప్రతిదినము లేఖనములను పరిశీలించుట నుండి అనుదిన లేఖనాన్ని పరిశీలించే అలవాటు చేసుకోమని కుటుంబాలు ప్రోత్సహింపబడుతున్నాయి. కేవలం లేఖనాన్ని వ్యాఖ్యానాలను చదవడం మంచిదే, కాని లేఖనాన్ని చర్చించి దాన్ని అన్వయించుకోవడం మరింత ప్రయోజనకరమైనది. ఉదాహరణకు, ఎఫెసీయులు 5:15-17 వచనాలను పరిశీలిస్తుంటే, వ్యక్తిగత పఠనం కొరకు, ఏదోవిధమైన పూర్తికాల పరిచర్యలో భాగం వహించడానికి, ఇతర దైవపరిపాలనా నియామకాల గురించి శ్రద్ధ తీసుకోవడానికి ‘సమయాన్ని సద్వినియోగం’ ఎలా చేసుకోవచ్చుననేదాని గురించి కుటుంబ సభ్యులు తర్కించుకోవచ్చు. అవును, దిన వచనాన్ని కుటుంబం చర్చించడం ఒకరు లేక అనేకమంది ‘యెహోవా చిత్తమేమిటో మరింత పూర్ణంగా గ్రహించుకోవడానికి’ నడిపించగలదు.

14. తలిదండ్రులు ఏవిధమైన బోధకులై ఉండాలని ద్వితీయోపదేశకాండము 6:6, 7 వచనాలు సూచిస్తున్నాయి, దానికి ఏమి అవసరము?

14 తలిదండ్రులు తమ పిల్లలకు పట్టుదలతో బోధించేవారై ఉండాలి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) అంటే దాని భావం వారు కేవలం తమ పిల్లలను గద్దించడం లేక వారికి ఆజ్ఞాపించడం చేయాలని కాదు. తండ్రి మరియు తల్లి కూడా వినాలి, ఆవిధంగా అయితే దేన్ని వివరించవలసిన, స్పష్టపరచవలసిన, ఉదాహరించవలసిన, లేక పునరుద్ఘాటించవలసిన అవసరం ఉందో తెలుసుకోవచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో, తమకు అర్థంకాని వాటి గురించి లేక తమకు వ్యాకులత కలిగించే వాటి గురించి ప్రశ్నలు అడగమని తలిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించడం ద్వారా మనస్సువిప్పి సంభాషించడాన్ని పురికొల్పారు. అలా వారు, యెహోవాకు ఆరంభం లేదనే విషయాన్ని అర్థం చేసుకోవడం యౌవనుడైన తమ కుమారునికి కష్టంగా ఉందని తెలుసుకోగలిగారు. సమయం మరియు అంతరిక్షం అంతం లేనివని అంగీకరింపబడ్డాయని చూపించే వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురణల నుండి సమాచారాన్ని తలిదండ్రులు ఉపయోగించుకోగలిగారు. విషయాన్ని వివరించడానికి ఆ సమాచారం సరిపోయింది, అది వారి కుమారున్ని సంతృప్తిపరచింది. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడం గురించి నేర్చుకోవడం ఎంతో సంతృప్తికరంగా ఉండగలదని తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేస్తూ, వారి ప్రశ్నలకు స్పష్టంగా, లేఖనాల నుండి సమాధానం ఇవ్వడానికి సమయం తీసుకోండి. దేవుని ప్రజలకు అంటే పిన్నలకు, పెద్దలకు నేడు ఇంకా ఏమి నేర్పబడుతుంది?

ప్రేమించడం, పోరాడడం నేర్పబడుతుంది

15. మన సహోదర ప్రేమ యొక్క యథార్థత ఎప్పుడు పరీక్షించబడవచ్చు?

15 యేసు క్రొత్త ఆజ్ఞకు అనుగుణంగా, మనం ‘ఒకరి నొకరం ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడ్డాము.’ (1 థెస్సలొనీకయులు 4:9) పరిస్థితులు ప్రశాంతంగా ఉండి అంతా సవ్యంగా వెళుతున్నప్పుడు, మనం మన సహోదరులందరినీ ప్రేమిస్తున్నామని మనం భావించవచ్చు. అయితే, వ్యక్తిగత తేడాలు ఉత్పన్నమైనప్పుడు లేక మరో క్రైస్తవుడు అన్నదాన్నిబట్టి లేక చేసినదాన్నిబట్టి మనం అభ్యంతరపడితే ఏమి జరుగుతుంది? ఈ సమయంలో మన ప్రేమ యొక్క యథార్థత పరీక్షించబడవచ్చు. (2 కొరింథీయులు 8:8 పోల్చండి.) అలాంటి సందర్భాల్లో ఏమి చేయమని బైబిలు మనకు బోధిస్తుంది? ఒక విషయమేమిటంటే, సంపూర్ణ భావంలో ప్రేమ చూపడానికి ప్రయత్నించడం. (1 పేతురు 4:8) మన స్వంత ఆసక్తుల కొరకు చూడడం, స్వల్ప పొరపాట్లనుబట్టి చిరాకుపడడం, లేక బాధ కలిగించిన విషయాలను మనస్సులో ఉంచుకోవడం వంటివి చేసే బదులు, ప్రేమ అనేకమైన పాపాలను కప్పడాన్ని అనుమతించేందుకు మనం కృషి చేయాలి. (1 కొరింథీయులు 13:5) దేవుని వాక్యం దాన్నే బోధిస్తుంది గనుక అది ఆయన చిత్తమని మనకు తెలుసు.

16. (ఎ) క్రైస్తవులు ఏ విధమైన యుద్ధంలో పాల్గొనడానికి నేర్పబడుతున్నారు? (బి) మనం ఎలా సంసిద్ధులమౌతున్నాము?

16 అనేకులు యుద్ధాన్ని ప్రేమతో జతచేయరు. అయినప్పటికీ యుద్ధం మనకు నేర్పబడుతుంది, అయితే అది సాధారణ యుద్ధంకాదు. యుద్ధాన్ని ఎలా కొనసాగించాలనేది యెహోవా తనకు నేర్పించవలసిన అవసరం ఉందని దావీదు గుర్తించాడు, అయితే ఆయన కాలంలో ఇశ్రాయేలు శత్రువులకు వ్యతిరేకంగా అక్షరార్థంగా పోరాడడం కూడా దానిలో ఇమిడివుండినది. (1 సమూయేలు 17:45-51; 19:8; 1 రాజులు 5:3; కీర్తన 144:1) నేడు మన పోరాటం విషయమేమిటి? మన ఆయుధాలు శారీరకమైనవి కావు. (2 కొరింథీయులు 10:4) మనది ఆత్మీయ పోరాటం, దాని కొరకు మనం ఆత్మీయ కవచంతో సంసిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. (ఎఫెసీయులు 6:10-13) మనం విజయవంతమైన ఆత్మీయ పోరాటాన్ని పోరాడడానికి యెహోవా తన వాక్యం ద్వారా, సంఘంగా కూడిన తన ప్రజల ద్వారా మనకు నేర్పిస్తాడు.

17. (ఎ) మనల్ని పెడత్రోవ పట్టించడానికి అపవాది ఏ కుతంత్రాలను ఉపయోగిస్తాడు? (బి) మనం జ్ఞానయుక్తంగా ఏమి నివారించాలి?

17 ప్రాముఖ్యతలేని విషయాలవైపుకి మనల్ని మరల్చడానికి అపవాది తరచూ లోకసంబంధమైన శోధనలను, మత భ్రష్టులను, సత్యాన్ని వ్యతిరేకించే ఇతరులను మోసకరమైన, కుయుక్తితో కూడిన మార్గాలలో ఉపయోగించుకుంటాడు. (1 తిమోతి 6:3-5, 11; తీతు 3:9-11) నేరుగా, సూటియైన దాడి ద్వారా మనలను తాను జయించగలిగే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి, మనం ఎలాంటి ఆత్మీయ విలువలేని మన అల్ప ఫిర్యాదులను మరియు అవివేకపు ప్రశ్నలను వ్యక్తం చేసేలా మనలను పడగొట్టేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్టుగా అది ఉంటుంది. జాగరూకతగల యోధులుగా మనం సూటియైన దాడుల విషయంలో ఉన్నట్లుగానే అలాంటి ప్రమాదాల విషయంలో ఎంతో జాగరూకత కలిగివుండాలి.—1 తిమోతి 1:3, 4.

18. ఇక మీదట మనకోసం జీవించకపోవడంలో నిజంగా ఏమి ఇమిడివుంది?

18 మనం మనుష్యుల కోరికలను గానీ లేక జనాంగాల చిత్తాన్ని గానీ ఉన్నతపర్చము. మనం ఇక మీదట మన కోసం జీవించకూడదు; బదులుగా మనం క్రీస్తు యేసు కలిగివున్నటువంటి మానసిక స్థితిని కలిగివుండి, దేవుని చిత్తం కొరకు జీవించాలని యేసు ఉదాహరణ ద్వారా యెహోవా మనకు నేర్పించాడు. (2 కొరింథీయులు 5:14, 15) గతంలో, మనం అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేస్తూ, ఎంతో మితిమీరిన విశృంఖలమైన జీవితాన్ని గడిపి ఉండవచ్చు. అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, అవినీతి ఈ దుష్ట ప్రపంచం యొక్క గుణలక్షణాలు. ఇప్పుడు మనకు దేవుని చిత్తాన్ని చేయడం నేర్పబడుతోంది గనుక, ఈ భ్రష్ట ప్రపంచం నుండి వేరై ఉండేందుకు మనం కృతజ్ఞత కలిగిలేమా? కాబట్టి, కలుషితం చేసే ప్రపంచ ఆచారాలలో పాల్గొనకుండా ఉండేందుకు మనం ఆత్మీయంగా తీవ్ర పోరాటం సల్పుదాము.—1 పేతురు 4:1-3.

మనకు మనం ప్రయోజనం చేకూర్చుకోవడాన్ని నేర్పించడం

19. యెహోవా చిత్తం నేర్పబడి ఆ తర్వాత దాన్ని చేయడం ఏ ప్రయోజనాలకు దారితీస్తుంది?

19 యెహోవా చిత్తాన్ని చేయడానికి నేర్పబడడం మనకు ఎంతో ప్రయోజనకరమైనదని గుర్తించడం చాలా అవసరం. అర్థం చేసుకొనదగినట్లుగా, ఆయన కుమారుని ద్వారా అలాగే ఆయన వాక్యం ద్వారా మరియు సంఘంగా కూడిన ప్రజల ద్వారా మనకు లభించే ఉపదేశాలను నేర్చుకుని, అనుసరించేందుకు మనం సన్నిహిత అవధానాన్నివ్వడం ద్వారా మనం మన వంతు పనిని చేయాలి. (యెషయా 48:17, 18; హెబ్రీయులు 2:1) మనం అలా చేయడం ద్వారా, ఈ విపత్కరమైన కాలాల్లో స్థిరంగా నిలబడడానికి, రానున్న తుపానులను తట్టుకోవడానికి మనం బలపర్చబడతాము. (మత్తయి 7:24-27) ఇప్పుడు కూడా, మనం దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా ఆయనను ప్రీతిపరుస్తాము, మన ప్రార్థనలకు సమాధానం లభించిందని నిశ్చయత కలిగివుంటాము. (యోహాను 9:31; 1 యోహాను 3:22) మరియు మనం నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాము.—యోహాను 13:17.

20. 1997వ సంవత్సరమంతటిలో వార్షిక వచనాన్ని చూస్తూ మీరు దేని గురించి ధ్యానించడం మంచిది?

20 1997 సంవత్సరంలో, “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” అనివున్న వార్షిక వచనమైన కీర్తన 143:10ని చదివి పరిశీలించే అవకాశం మనకు తరచుగా లభిస్తుంది. మనమిది చేస్తుండగా, పైన చెప్పబడినట్లుగా, మనకు నేర్పించడానికి దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి ఆలోచించడానికి మనం కొన్ని సందర్భాలను ఉపయోగించుకుందాము. “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని తెలుసుకొని, ఆ మాటలను అలా ధ్యానించడాన్ని ఆ విన్నపానికి అనుగుణంగా ప్రవర్తించడానికి ఒక పురికొల్పుగా ఉపయోగించుకుందాము.—1 యోహాను 2:17.

మీరెలా సమాధానమిస్తారు?

◻ యెహోవా చిత్తాన్ని చేయడం నేడు ఎవరికి నేర్పబడుతోంది?

◻ 1997లో కీర్తన 143:10 మనల్ని ఎలా ప్రభావితం చేయాలి?

◻ యెహోవా చిత్తాన్ని చేయడానికి మనకెలా నేర్పబడుతుంది?

◻ తమ పిల్లలకు నేర్పడానికి క్రైస్తవ తలిదండ్రులకు ఏమి అవసరము?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి