కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/1 పేజీలు 27-30
  • వృద్ధులకు క్రైస్తవ ప్రేమను కనబర్చుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వృద్ధులకు క్రైస్తవ ప్రేమను కనబర్చుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “జ్ఞాన నిధులు”
  • “దైవభక్తిని అభ్యసించండి”
  • ఆత్మీయ అవసరతలయెడల క్రమమైన అవధానం
  • సంఘం ఏమి చేయగలదు
  • “కాలము నిండిన వృద్ధుడు”
  • క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయముచేయును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • వృద్ధులపట్ల శ్రద్ధ తీసుకోవడం—క్రైస్తవ బాధ్యత
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • క్రైస్తవులెట్లు వృద్ధులకు సహాయపడగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/1 పేజీలు 27-30

వృద్ధులకు క్రైస్తవ ప్రేమను కనబర్చుట

సామ్యూల్‌ జాన్‌సన్‌ అనే 18వ శతాబ్దానికి చెందిన ఒక రచయిత, స్నేహితులను సందర్శిస్తుండగా తన టోపీని ఎక్కడపెట్టాడో మర్చిపోయిన ఒక యౌవనస్థుని గూర్చిన కథను చెప్పాడు. ఇది ఏ వ్యాఖ్యానాన్నీ లేవదీయలేదు. “కాని అదే అజాగ్రత్త ఒక వృద్ధునిలో కనుగొనబడినట్లైతే, ప్రజలు దానికి తమ భుజాలు ఎగరేస్తూ, ‘ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడని’ అంటారు” అంటూ జాన్‌సన్‌ చెప్పాడు.

వృద్ధులు, బహుశా అల్పసంఖ్యాక వర్గాలవలే అన్యాయంగా అలాంటి అవహేళనకు గురౌతున్నారని జాన్‌సన్‌ చెప్పిన కథ చూపిస్తున్నది. వృద్ధుల అవసరతలను లక్ష్యపెట్టడమనేది ఒక సవాలే అయినప్పటికి, అందులో పాలుపంచుకొను వారందరికీ ప్రయోజనాలుంటాయి. మరి ఈ సవాళ్లు, ప్రతిఫలాలు ఏమైయున్నాయి, ఈ విషయం అనేకానేకమంది ప్రజలను ఎందుకు ప్రభావితం చేస్తుంది?

లెక్కల ప్రకారం, ప్రపంచ జనాబాలో 6 శాతంమంది 65 సంవత్సరాల వయస్సున్నవారు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ శాతం రెండంతలు అధికంగా వుంది. “యూరోపియన్‌ ఇయర్‌ ఆఫ్‌ ఓల్డర్‌ పీపుల్‌ అండ్‌ సాలిడారిటీ బిట్వీన్‌ జనరేషన్స్‌”గా 1993ని పిలిచిన యూరోపియన్‌ సమాజమందు, ముగ్గురిలో ఒకరు 50 సంవత్సరాలు పైబడ్డవారే. పారిశ్రామిక దేశాలలో వలెనే అక్కడ, జననాల సంఖ్య తగ్గిపోవడం, జీవన ప్రతీక్ష పెరగడం అనేవి జనాబాలోని అధిక భాగంలో మధ్యవయస్సు దాటినవారే ఉండేలా చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వృద్ధులను గూర్చి శ్రద్ధతీసుకోవడం అనేది స్పష్టంగా జ్ఞాపకార్థంగా నిలిచే కార్యమే. తూర్పు దేశాల చరిత్రలో విషయాలు ఎంత భిన్నంగా ఉండేవి!

“జ్ఞాన నిధులు”

హేండ్‌వోర్టెర్‌బుచ్‌ డెస్‌ బిబ్లిస్చెన్‌ ఆల్టర్‌టమ్స్‌ ఫర్‌ గెబిల్డెటె బైబిల్లెసెర్‌ (విద్యావంతులైన బైబిలు పాఠకుల కొరకు బైబిలు పూర్వచరిత్రను తెలిపే చిన్నపుస్తకం) అనే పుస్తకం సూచించేదేమంటే తూర్పుదేశ పూర్వచరిత్రలో “వృద్ధులు వివేకము, ఉన్నత జ్ఞానానికి సంబంధించిన సాంప్రదాయిక విలువలను కాపాడేవారుగా దృష్టించబడేవారు, ఆ కారణాన్ని బట్టే వారితో సాంగత్యంచేయాలనీ, వారినుండి నేర్చుకోవాలని యౌవనులకు ఉద్బోధింపబడేది.” స్మిత్స్‌ బైబిల్‌ డిక్స్‌నరీ యిలా వివరిస్తుంది: “ఇతర మానవసమాజంతో సంబంధంలేని జీవన పద్ధతిలో జ్ఞాన నిధిగా [వృద్ధులు] దృష్టించబడేవారు . . . మొదట వారి ఉద్దేశాన్ని చెప్పమని [యౌవనులు] వారిని అనుమతించేవారు.”

లేవీయకాండము 19:32 నందు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వృద్ధుల యెడల గౌరవమనేది ఇలా ప్రతిబింబించింది: “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.” కాబట్టి వృద్ధులు సమాజంలో ఆధిక్యతతో కూడిన స్థానాన్ని ఆక్రమించుకున్నారు, వారు విలువైన వారిగా పరిగణించబడ్డారు. స్పష్టంగా ఈ విధంగానే మోయాబీయురాలైన రూతు ఇశ్రాయేలీయురాలైన తన అత్త నయోమితో మాట్లాడింది.

తర్వాత నుండి నయోమి ఉపదేశాన్ని జాగ్రత్తగా వింటూ, రూతు మోయాబునుండి ఇశ్రాయేలునకు నయోమితోపాటు వెళ్లడానికి దృఢంగా నిర్ణయించుకుంది. ఒకసారి వారు బేత్లెహేములో ఉండగా, యెహోవా హస్తము వ్యవహారాల్లో నడిపింపునిస్తున్న సంగతిని నయోమి గమనించి, ఎలా ప్రవర్తించాలో ఆమె రూతుకు బోధించింది. (రూతు 2:20; 3:3, 4, 18) అనుభవంగల నయోమి నుండి నేర్చుకున్నందున దైవిక పద్ధతిలో రూతు జీవితం రూపుదిద్దుకున్నది. ఆమె అత్త జ్ఞాన నిధిగా నిరూపించుకుంది.

అదే తీరులో, ఈనాడు యౌవన క్రైస్తవ స్త్రీలు సంఘంలోని వృద్ధ స్త్రీలతో సహవసించడంద్వారా ప్రయోజనం పొందగలరు. బహుశ ఒక సహోదరి వివాహాన్ని గూర్చి యోచిస్తుండవచ్చు లేదా జఠిలమైన ఒక వ్యక్తిగత సమస్యతో బాధపడుతుండవచ్చు. ఆ విషయంలో అనుభవంగల ఒక వృద్ధస్త్రీ సలహాను, మద్దతును కోరినట్లైతే అది ఎంత వివేకవంతమైందిగా ఉంటుంది!

అంతేకాకుండా, పెద్దల సభ తమ మధ్యనున్న వృద్ధుల అనుభవంనుండి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందవచ్చు. ఈ విధంగా చేయుటలో విఫలుడైన లోతునుండి మనం పాఠం నేర్చుకోగలము. అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును మధ్య చెలరేగిన కలహము అందరిపై ప్రభావంచూపే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి నడిపింది. లోతు అవివేకమైన ఎంపిక చేసుకున్నాడు. మొదటిగా అబ్రాహామును సలహా అడిగివుంటే అది ఎంత శ్రేష్ఠంగా ఉండి ఉండేది! లోతు అనుభవయోగ్యమైన నడిపింపును పొందియుండేవాడు, అతని తొందరపాటు ఎంపిక వలన ఫలించిన దురవస్థనుండి తన కుటుంబాన్ని దూరంచేసేవాడు. (ఆదికాండము 13:7-13; 14:12; 19:4, 5, 9, 26, 29) ఒక ప్రశ్ననుగూర్చి మీ స్వంత నిర్ణయాన్ని తీసుకునేముందు అనుభవంగల పెద్దలు చెప్పేదానిని మీరు జాగ్రత్తగా ఆలకిస్తారా?

మొదటి శతాబ్దంలోని సుమెయోను, అన్న అనే వారివలెనే లెక్కలేనంతమంది వృద్ధులు యెహోవా సేవయెడల ఎడతెగని ఆసక్తిగల్గివుంటారు. (లూకా 2:25, 36, 37) అలాంటి వృద్ధులను వారికి సత్తువ వున్నంతకాలము, పండు ముసలితనంలో కూడా వారిని సంఘ కార్యకలాపాల్లో యిమిడ్చడమనేది వారియెడలగల గౌరవానికి, శ్రద్ధతీసుకునే దృక్పథానికి ఒక గుర్తయి ఉన్నది. బహుశా దైవపరిపాలనా పాఠశాలలో ప్రసంగానికి సిద్ధపడుటకు ఒక యౌవనునికి సహాయమవసరంకావచ్చు. సంఘంలో సరైన అనుభవజ్ఞానము, ఉపకారబుద్ధి, సమయము కల్గిన ఒక వృద్ధుడే శ్రేష్ఠమైన సలహాదారుడని చెప్పి సూక్ష్మబుద్ధిగల ఒక సంఘపెద్ద తీర్మానించవచ్చును.

అయినప్పటికి, వృద్ధుల అవసరతలను తీర్చడంలో మరెక్కువే యిమిడివుంది. ఒంటరితనం, నేరాన్నిగూర్చిన భయం మరియు ఆర్థిక కష్టాలను బట్టి అనేకమంది కలతచెందారు. అంతేకాకుండా, వృద్ధులు ఒకసారి వ్యాధిగ్రస్తులయ్యారంటే, క్షీణిస్తున్న ఆరోగ్యం మరియు కృశిస్తున్న తమ స్వంత బలంతో ఈ సమస్యలు జోడించబడతాయి. తర్వాత వారికి మరెక్కువ అవధానం అవసరం. దానికి ప్రతిఒక్కరూ మరియు సంఘమంతా ఎలా స్పందించాలి?

“దైవభక్తిని అభ్యసించండి”

మొదటి శతాబ్దంలో, పౌలు ఆత్మావేశంతో 1 తిమోతి 5:4, 16 నందు యిలా వ్రాశాడు: “ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.” వృద్ధుల యెడల శ్రద్ధవహించడమనేది కుటుంబ బాధ్యతయే. సంఘములోని ఒక వృద్ధునికి సహాయం అవసరమైతే కుటుంబం వారికి చేతనైనంత సహాయం చేసిన తరువాత యింకనూ సహాయం అవసరమైతే, ఆ బాధ్యత సంఘముపై పడుతుంది. ఈ నియమాలు మారలేదు.

క్రైస్తవులు తమ గృహంలో దైవభక్తిని అభ్యసించడంద్వారా వృద్ధులయెడల క్రైస్తవ ప్రేమను కనబర్చడానికి క్రైస్తవులకు సహాయపడినదేమిటి? వృద్ధుల యెడల శ్రద్ధను చూపడంలో కొంత అనుభవంగల అనేకమంది సాక్షులద్వారా యివ్వబడిన ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.

ఆత్మీయ అవసరతలయెడల క్రమమైన అవధానం

“దినవచనాన్ని కలిసి పరిశీలించడమనేది అమూల్యమైన సహాయకము,” అంటూ తన భార్య ఆమె తలిదండ్రులను జాగ్రత్తగా చూసుకొనుటలో సహాయపడిన ఫేలిక్స్‌ గుర్తుచేసుకుంటున్నాడు. “వ్యక్తిగత అనుభవాలు మరియు అభిలాషలు దేవుని నియమాలతో జోడించబడ్డాయి.” నిజంగా, వృద్ధులైన బంధువులయెడల శ్రద్ధతీసుకునే కార్యక్రమంలో మొట్టమొదటి కారకమేమంటే, వారి ఆత్మీయ జ్ఞానాభివృద్ధికి అవసరమైన అవధానమిచ్చుటయే. మత్తయి 5:3లో “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అనే యేసు మాటల దృష్ట్యా యిది తర్కబద్ధమైంది. బైబిలు పఠన కార్యక్రమం, బైబిలు ఆధారిత సాహిత్యాలు మరియు ప్రార్థన ద్వారా దినవచనాన్ని హెచ్చించవచ్చును. “వృద్ధులు కొంచెం నియమిత పద్ధతిని యిష్టపడుతున్నట్లు కనబడుతుందని,” పీటర్‌ గుర్తిస్తున్నాడు.

ఔను, ఆత్మీయ విషయాల్లో నియమిత పద్ధతి అనేది ప్రాముఖ్యమైంది. కేవలం ఆత్మీయ విషయాల్లో మాత్రమే కాకుండా అనుదిన జీవితంలో కూడ వృద్ధులు నియమిత పద్ధతిని మెచ్చుకుంటారు. ఏదో కొంచెం బలహీనతలున్నవారిని కూడ “ప్రతిరోజూ మంచంపైనుండి లేచి, మంచిగా దుస్తులు ధరించడానికి” ఆప్యాయంగా ప్రోత్సహించవచ్చని ఉర్సూలా అంటుంది. నిజమే, వృద్ధులను ఆదేశిస్తున్నామనే అభిప్రాయం రాకుండా ఉండాలని మనం కోరుకుంటాము. తరచూ తన అర్థవంతమైన ప్రయత్నాలు దుఃఖకరంగా తప్పుదోవపట్టించాయని డోరిస్‌ ఒప్పుకుంటుంది. “నేను పలురకాల పొరపాట్లు చేశాను. ప్రతి రోజూ తన చొక్కా మార్చుకోమని చెప్పి ఒక రోజు మా నాన్నను అడిగాను. ఆ తర్వాత, ‘ఆయనింకా నా భర్తేనమ్మా!’ అంటూ మా అమ్మ నాకు గుర్తుచేసింది.”

వృద్ధులు ఒకప్పుడు యౌవనులే, గనుక యౌవనులు వయస్సుమళ్లినవారి యెడల దయను, సున్నితత్వాన్ని తమంతట తాము కనుపర్చడమనేది బలవత్తరమైన విధియైయుంది. అయినా, వారి ప్రత్యేక అవసరతలను అర్థం చేసుకోడానికి అదే మూలం. పెరుగుతున్న వయస్సు నిరుత్సాహాన్ని తెస్తుంది. గర్హాట్‌ ఈ విధంగా వివరిస్తున్నాడు: “మా మావయ్య తన్నుతాను సతాయించుకున్నాడు, ఎందుకంటే ఆయన ప్రతి దాన్ని క్రితం చేస్తున్నట్లుగా ఇప్పుడు చేయలేకపోతున్నాడు. పరిస్థితిని అంగీకరించడమనేది ఆయనకు పూర్తిగా బాధాకరమైంది. ఆయన వ్యక్తిత్వం మారిపోయింది.”

మారుతున్న పరిస్థితులలో, ఇతరులను ప్రాముఖ్యంగా అతనిని గూర్చి శ్రద్ధతీసుకునేవారిని విమర్శించడంద్వారా తనలోని నిరాశాభావాలను వ్యక్తంచేయడమనేది ఒక వృద్ధునికి అసాధారణమేమీ కాదు. దానికిగల కారణం తేటగా కన్పిస్తుంది. వారి ప్రేమపూర్వకమైన అవధానమే క్షీణిస్తున్న బలాన్ని గూర్చి ఆయనకు గుర్తు చేస్తుంది. అనుచితమైన ఈ విమర్శ లేదా ఫిర్యాదుకు మీరెలా ప్రతిస్పందించాలి?

గుర్తుంచుకోండి, అలాంటి ప్రతికూల తలంపులు మీ ప్రయత్నాల యెడల యెహోవా దృష్టిని ప్రతిబింబించవు. అప్పుడప్పుడు మీకు అన్యాయపు వ్యాఖ్యానాలు ఎదురైనప్పటికీ, మంచిని చేయుటలో కొనసాగండి, నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోండి. (1 పేతురు 2:19 పోల్చండి.) స్థానిక సంఘం మంచి మద్దతును అందించగలదు.

సంఘం ఏమి చేయగలదు

మన ప్రియమైన వృద్ధ సహోదర సహోదరీలు చేసిన గత ప్రయత్నాలకు అనేక సంఘాలు బహుగా కృతజ్ఞులై ఉండడానికి కారణముంది. సంఘానికి పునాది వేసి, కొన్ని దశాబ్దాల క్రితంవున్న కేవలం కొద్దిమంది ప్రచారకులను వృద్ధిచేసినవారు బహుశా వీరే అయ్యుండవచ్చు. గతంలో వారు పట్టుదలతో చేసిన సేవ, బహుశా, ప్రస్తుత ఆర్థిక మద్దతు లేకపోతే సంఘమెక్కడుండేది?

వృద్ధుడైన ప్రచారకుని విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రాముఖ్యమైనప్పుడు, ఆ బాధ్యతను కేవలం బంధువులు మాత్రమే వహించాల్సిన అవసరంలేదు. అతనికి కావల్సిన సందేశాలను తీసుకురావడం, వంటచేయడం, శుభ్రంచేయడం, వృద్ధులను అలా నడిపించడానికి తీసుకువెళ్లడం, క్రైస్తవ కూటాలకు వెంట తీసుకెళ్లడం, లేదా రాజ్యమందిరంలో అతనితో మాట్లాడడం వంటివి చేయడం ద్వారా యితరులు సహాయం చేయవచ్చు. అందరూ అలా చేయడంలో పాల్గొనవచ్చు, అయినా పరస్పర సహకారంతో అందరూ సమానంగా కృషిచేసినప్పుడు సమర్థతతోను క్రమంగాను చేయవచ్చును.

సంఘపెద్దలు కాపరి సందర్శనాలను ఏర్పాటు చేసేటప్పుడు సమానావశ్యకతను గుర్తుంచుకోగలరు. ఈ విషయంలో కొన్ని సంఘాలు మాదిరికరంగా వున్నాయి, వృద్ధులను, బలహీనులను, తమ కుటుంబాలు చాలా మంచిగా చూసుకుంటున్న వారిని కూడా కాపరి సందర్శనాల సందర్భంగా దర్శించేలా సంఘపెద్దలు చూస్తున్నారు. అయినప్పటికి, మిగతా సంఘాలు కూడా వృద్ధుల యెడలగల తమ బాధ్యతను బహుగా ఎరిగినవారై యుండాలని యిది సూచిస్తుంది.

ఎనభైయేండ్ల వయస్సున్న విశ్వాసియైన ఒక సహోదరునిగూర్చి తన కుమార్తె, అల్లుడు శ్రద్ధతీసుకున్నారు, వారలా చేయడానికి బేతేలునే వదలిపెట్టారు. అయినను, సంఘంలోని యితరులు కూడా ఆయనను సందర్శించడం ఆయనకు ప్రాముఖ్యమే. “నేను రోగులను సందర్శిస్తున్నప్పుడు, నేను వారితో కలిసి ప్రార్థన చేసేవాణ్ని. కాని ఎన్నడూ ఎవరూ నాతో ప్రార్థించలేదు,” అంటూ ఆ సహోదరుడు విలపించాడు. బంధువుల ప్రేమపూర్వక అవధానం, పెద్దలు ‘తమ మధ్యనున్న దేవునిమందను పైవిచారణ చేయుచు దానిని కాసే’ బాధ్యతనుండి వారిని విముక్తిచేయదు. (1 పేతురు 5:2) అంతేకాకుండా, వృద్ధులనుగూర్చి శ్రద్ధతీసుకునేవారిని పురికొల్పి, తమ మంచిపనిని కొనసాగించేలా ప్రోత్సహించాలి.

“కాలము నిండిన వృద్ధుడు”

మీ వృద్ధాప్యాన్ని చూసి మీకు ఏదోకొంచెం విసుకుగా అన్పించడంలేదా అని ఒక యౌవనస్థురాలు 19వ శతాబ్దానికి చెందిన జర్మన్‌ శాస్త్రవేత్తయిన అలెగ్జాండర్‌ వాన్‌ హమ్‌బోల్ట్‌ను అడిగినప్పుడు ఆయన కడు వృద్ధుడైయున్నాడు. “నీవు చెప్పింది నిజమే, కాని ఎక్కువ కాలం జీవించాలంటే యిది తప్ప వేరేమార్గంలేదు” అంటూ ఈ విద్యావంతుడు సమాధానమిచ్చాడు. అదే రీతిలో, అనేకమంది సహోదర, సహోదరీలు దీర్ఘకాలం జీవించడమనే ఆధిక్యత ఫలితంగా వృద్ధాప్యంలోని అనేక కష్టాలను సమ్మతించడం ద్వారా ఈనాడు ఒక మంచి మాదిరినుంచారు. వీరు ‘కాలము నిండిన వృద్ధులైన’ అబ్రాహాము, ఇస్సాకు, దావీదు, యోబు కనపరచిన దృక్పథాన్నే ప్రతిబింబించారు.—ఆదికాండము 25:8; 35:29; 1 దినవృత్తాంతములు 23:1; యోబు 42:17.

పైబడుతున్న వయస్సు సహాయాన్ని హూందాగా అంగీకరించడం మనఃపూర్వకంగా కృతజ్ఞతను వ్యక్తంచేయడమనే సవాళ్లను తెస్తుంది. ప్రతి ఒక్కరు తమ శక్తికున్న హద్దులను గుర్తించాలంటే జ్ఞానం అవసరమౌతుంది. అయినను, అది వయస్సు మీరుతున్నవారిని క్రియాహీనులను చేయదు. మారియా 90 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సుగలదే, కాని ఆమె యింకనూ సంఘకూటాలకు హాజరై అక్కడ వ్యాఖ్యానాలు చేస్తుంది. ఆమె దానినెలా చేస్తుంది? “నేను యిక చదవలేను, కాని కేసెట్‌ద్వారా నేను వాచ్‌టవర్‌ను వింటాను. నేను విన్నకొంత భాగం మర్చిపోతుంటాను, కాని సాధారణంగా ఒక వ్యాఖ్యానం చేయగల్గుతాను.” మారియా వలెనే, ప్రోత్సాహకరమైన వ్యాపకాలను కలిగి ఉండడం ఒక వ్యక్తి చురుకుగా ఉంటూ, క్రైస్తవ వ్యక్తిత్వంతో కొనసాగడానికి సహాయపడుతుంది.

దేవుని రాజ్యంలో, వృద్ధాప్యం యిక ఉండదు. అప్పుడు ఈ వ్యవస్థలో వృద్ధులైనవారు, బహుశా మరణించినవారు తమయెడల చూపబడిన శ్రద్ధ, అవధానాన్ని గూర్చిన మధుర స్మృతులను కలిగి ఉంటారు. జీవితాన్ని, శక్తిని తిరిగిపొందిన అలాంటి వృద్ధులు, నిజంగా యెహోవాయెడల మిక్కుటమైన ప్రేమను, ఈ పాత విధానంలో వారు కష్టాలనెదుర్కొన్నప్పుడు తమను హత్తుకొనివున్న వారియెడల లోతైన కృతజ్ఞతాభావాన్ని తప్పకుండా కలిగి ఉంటారు.—లూకా 22:28 పోల్చండి.

ప్రస్తుతం వృద్ధుల యెడల శ్రద్ధవహిస్తున్నవారి విషయమేమిటి? తొందరలోనే, భూవ్యాప్తంగా రాజ్యం అధికారాన్ని వహించినప్పుడు, వారు తమ బాధ్యతలనుండి వైదొలగలేదు కాని వృద్ధులకు ప్రేమను కనబర్చడంద్వారా దైవభక్తిని అభ్యసించామని ఆనందం మరియు ఉపశమనంతో జ్ఞాపకం చేసుకుంటారు.—1 తిమోతి 5:4.

[30వ పేజీలోని బాక్సు]

వృద్ధులు మీ సందర్శనాలను కొనియాడతారు

ప్రాంతీయ సేవ అనంతరం ఒక వృద్ధుని సందర్శించడానికి కనీసం 15 నిమిషాలైనా కేటాయించాలని యోచించడం ద్వారా అత్యంత శ్రేష్ఠమైన దానిని నెరవేర్చ వచ్చును. ఈ క్రింది అనుభవం చూపుతున్నట్లుగా, అవకాశములకు అలాంటి సందర్శనములను విడిచి పెట్టడం అంత శ్రేష్ఠమైనది కాదు.

బ్రెగిట్టె, హానెలోరె కలిసి ప్రాంతీయ సేవ చేస్తూ, ఒక వృద్ధుని యింటివద్ద సంభాషిస్తున్నారు. ఆయన కూడా యెహోవా సాక్షేనని, వాళ్ల సంఘసభ్యుడేనని 5 నిమిషాలు మాట్లాడేవరకూ తెలుసుకోలేకపోయారు. ఎంతటి తికమకపెట్టే దృశ్యము! కాని ఈ అనుభవం స్నేహపూర్వకంగానే ముగిసింది. హానెలోరె ఆ సహోదరుని సందర్శించడానికి, ఆయన సంఘకూటాలకు హాజరయ్యేలా సహాయపడడానికి పథకం వేసింది.

మీరు ప్రాంతీయ సేవచేసే ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వృద్ధ ప్రచారకుని పేరు, చిరునామా మీకు తెలుసా? క్లుప్తంగా ముగించగల సందర్శనాన్ని మీరు ఏర్పాటు చేయగలరా? బహుశా అది ఎంతో మెచ్చుకోబడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి