కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/1 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • దానియేలు చెప్పిన ప్రవచనార్థక దినాలు, మన విశ్వాసము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • దానియేలు గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/1 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

“కావలికోట”లో యిచ్చిన విధంగా దానియేలు ప్రవచనాలను పఠించడాన్ని మేము ఆనందించాము. అయితే, ప్రకటన 11:3 నందలి మూడున్నర కాలముల తేదీలు “రెవలేషన్‌ క్లైమాక్స్‌” పుస్తకంనుండి ఎందుకు వేరుగా ఉన్నాయి?

అవును, నవంబరు 1, 1993 కావలికోట, ప్రకటన 11:3లోని తేదీల ఆధునిక దిన నెరవేర్పు విషయంలో స్వల్ప మార్పులను చూపింది. ఎందుకు?

“నలభైరెండు నెలలను” ప్రస్తావించే ప్రకటన 11:2ను మొదట చూద్దాం. మూడవ వచనంలో యిలా ఉంది: “నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచించెదరు.” అది ఎప్పుడు అన్వయించబడుతుంది?

ఈ ప్రవచనం, 1914లో “అన్యజనముల కాలములు సంపూర్ణమైన తర్వాత” అభిషక్త క్రైస్తవుల సంబంధంగా (అన్యరాజుల కాలము) నెరవేరిందని యెహోవాసాక్షులు ఎన్నడో గ్రహించారు. (లూకా 21:24; 2 కొరింథీయులు 1:21, 22) దీనిపై వ్యాఖ్యానిస్తూ రెవలేషన్‌—ఇట్స్‌ గ్రాండ్‌ క్లైమాక్స్‌ ఎట్‌ హాండ్‌!a (1988) 164 పేజీలో యిలా అంటోంది: “మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైన 1914 తర్వాతి భాగం నుండి 1918 తొలి భాగం వరకూ కొనసాగిన సమయంలో, దేవుని ప్రజలకు సంభవించిన కఠిన అనుభవాలు యిక్కడి ప్రవచనాలకు సరిపోయినవి ఆ మూడున్నర సంవత్సరాల కాలం ఆ సమయంగానే గుర్తించబడుతుంది.”

అక్కడ యివ్వబడిన తేదీ, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన “1914 తర్వాతి భాగం నుండి 1918 తొలి భాగం [వరకు] కొనసాగుతుందని” గమనించండి. “దెన్‌ ఈజ్‌ ఫినిష్డ్‌ ది మిస్టరీ ఆఫ్‌ గాడ్‌” (1969)* 261-4 పేజీలు వంటి పుస్తకాలలో తరచు యివ్వబడిన తేదీలకు ఇది సరిపోతుంది.

ఏమైనప్పటికీ, కావలికోట 3 1/2 సంవత్సరాలు లేక 42 నెలలని ప్రకటనలో తర్వాత ప్రస్తావించిన సమయానికి సరిగ్గా సరిపోయేలా రెండు సార్లు ప్రస్తావించిన దానియేలు ప్రవచనాలపై దృష్టినిసారించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే, “కాలము కాలములు అర్థకాలము” లేదా 3 1⁄2 కాలములు వరకు దేవుని పరిశుద్ధులు హింసించబడతారని దానియేలు 7:25 చెబుతోంది. తర్వాత, దానియేలు 12:7 “ఒకకాలము కాలములు అర్థకాలము” లేక 3 1/2 కాలములను అది ప్రవచిస్తోంది. “పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింప”బడుటతో సమాప్తమయ్యే కాలం మహత్తర ముగింపుకొస్తుంది.

కనుక దానియేలు 7:25, దానియేలు 12:7, ప్రకటన 11:2, 3 అలాగే ప్రకటన 13:5 ఒకదానితో నొకటి సమపోలికగల కాలాన్ని తెలిపే ప్రవచనాలై ఉన్నాయి. ఇవన్నీ 1914-18 మధ్య కాలంలో నెరవేరాయని మా ప్రచురణలు చూపించాయి. అయితే ఈ ప్రవచనాలను విడివిడిగా పరిశీలించినప్పుడు, ఈ తేదీల ఆరంభము ముగింపు కొద్దిగా మారాయి.

అయితే 1993 నవంబరు 1 కావలికోట యిలా ప్రశ్నించింది: “సమపోలికగల ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయి?” అవును, దానియేలు 7:25, దానియేలు 12:7 ప్రకటన 11:3 నందు ప్రస్తావించబడిన మూడున్నర కాలముల ప్రవచనాలు “సమాంతర ప్రవచనాలని” గుర్తించబడ్డాయి. కనుక, వాటి ప్రారంభము వాటి అంతము విషయంలో ఒకదానికొకటి సంబంధం కల్గి ఉంటాయి.

వాటి ముగింపు సమయాన్ని గూర్చి, జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, అలాగే వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి యితర డైరెక్టర్లకు జూన్‌ 1918లో “అబద్ధ ఆరోపణలపై దీర్ఘకాలం జైలు శిక్ష విధించబడిన”ప్పుడు దేవుని అభిషక్తులు హింసించబడడం (దానియేలు 7:25) ఎలా ఉచ్చస్థితికి చేరుకున్నదో ఆ పత్రిక చూపించింది. ఆ సంఘటనతో దానియేలు 12:7 సూచించినట్లు ఖచ్చితంగా “పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడి”నది అని అది పేర్కొన్నది.

జూన్‌ 1918 నుండి మనం వెనక్కు లెక్కిస్తే అది మనలను డిసెంబరు 1914కు నడుపుతుంది. ఆ 1914 చివరి నెలలో భూమిపైనున్న దేవుని అభిషక్త ప్రజలు, రాబోయే సంవత్సరానికి లేఖనాంశంగా “‘నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా?’—మత్తయి 20:20-23” అనే దాన్ని నేర్చుకున్నారు. ఆ అంశాన్ని వివరించిన శీర్షిక యిలా హెచ్చరించింది: “గొర్రెపిల్లను నమ్మకంగా అనుసరించేవారికి 1915లో ఏ ప్రత్యేకమైన శ్రమ బాధ లేక అవమానకరమైన పాత్ర కనిపెట్టుకుని ఉందో ఎవరికి తెలుసు!” దానియేలు 7:25 ఆ 3 1/2 కాలముల సమయాన్ని గూర్చి చెప్పినట్లుగా ‘సర్వోన్నతుని పరిశుద్ధులపైకే హింస చెలరేగి కొనసాగింది.’ మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన దేశాలకు, అన్యాయమైన హింసను సాగించడానికి తద్వారా సులభతరం అయ్యింది. కనుక ముగింపు ఏమంటే: “దానియేలు 7:25, 12:7 మరియు ప్రకటన 11:3లోని సమాంతర ప్రవచనాలు డిసెంబరు 1914 నుండి జూన్‌ 1918 మధ్యనున్న 3 1/2 సంవత్సరాలు లేక 42 నెలల్లో నెరవేరాయి.

ఇది ప్రకటన 11:3 నెరవేర్పు కాలాన్ని లెక్కించడంలో గల స్వల్ప మార్పును వివరిస్తుంది. భవిష్యత్తులో రెవలేషన్‌ క్లైమాక్స్‌ పుస్తకాన్ని పఠించి ఉపయోగించేటప్పుడు ఈ మార్పును మనం మనస్సులో ఉంచుకోగలము.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి వారు ప్రచురించారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి