కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 5/1 పేజీలు 15-20
  • సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సామాన్యంగా ఉండవలసిన అర్హతలు
  • పరిచారకులపై కేంద్రీకృత దృష్టి
  • పెద్దల అర్హతలపై దృష్టిసారించుట
  • అర్హతలకు చేరుకొనుట
  • సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • సంఘ పరిచారకులు విలువైన సేవలు అందిస్తారు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • తండ్రి మరియు పెద్ద—రెండు పాత్రలను నిర్వర్తించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పెద్దలు మరియు పరిచారకుల మధ్య అనుగుణ్యతను కాపాడుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 5/1 పేజీలు 15-20

సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?

“మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది”—2 కొరింథీయులు 3:5.

1. ఎటువంటి వ్యక్తులకు క్రైస్తవ సంఘములో స్థానములేదు?

యెహోవా దేవుడు, యేసుక్రీస్తు పనివారైయున్నారు? యేసు చెప్పెను: “నాతండ్రియిదివరకు పనిచేయుచున్నాడు. నేనును చేయుచున్నాను.” (యోహాను 5:17) పనిచేయుటకు నిరాకరించువారిని దేవుడు అంగీకరించడు; ఆలాగే ఇతరులపై అధికారము చెలాయించుటకు బాధ్యతను సంపాదించగోరువారిపై ఆయన అనుగ్రహము ఉండదు. ఉపేక్ష చూపేవారికి లేదా స్వార్థకోరికలు గలవారికి క్రైస్తవ సంఘములో స్థానములేదు.—మత్తయి 20:25-27; 2 థెస్సలొనీకయులు 3:10.

2. నేడు పురుషులు క్రైస్తవ సంఘములో బాధ్యతలను చేపట్టవలసిన గొప్ప అవసరత ఎందుకున్నది?

2 సత్య ఆరాధన అనే “పర్వతమునకు” యిప్పుడు అనేకులు ప్రవాహమువలె వచ్చుచున్నందున ‘ప్రభువు కార్యాభివృద్ధిలో పనిచేయుటకు యెహోవా సాక్షులకు ఎంతో పని ఉన్నది.’ (1 కొరింథీయులు 15:58; యెషయా 2:2-4) సంఘములో బాధ్యతలను చేపట్టుటకు ఆత్మీయ అర్హతగలవారి అవసరత ఎంతో ఉన్నది. స్వార్థకోరికలచే ఈడ్వబడకపోతే అట్టివారు తమ్మును కాక యెహోవాను ఘనపర్చెదరు. (సామెతలు 8:13) ‘క్రొత్తనిబంధనకు పరిచారకులైనవారికి సామర్థ్యము కల్గించినట్లు’ సంఘబాధ్యతలకు అర్హులగుటకు దేవుడు తమకును సహాయముచేయునని వారికి తెలుసు.—2 కొరింథీయులు 3:4-6.

3. ప్రాథమికంగా, పెద్దలు, పరిచారకుల బాధ్యతలు ఏమిటి?

3 తొలిక్రైస్తవులవలె నేడుకూడ పురుషులు పెద్దలు, పరిచారకులుగా సేవచేయు నిమిత్తము, పరిశుద్ధాత్మచేత, యెహోవా సంస్థాపర ఏర్పాటుద్వారాను నియమించబడుచున్నారు. (అపొస్తలులకార్యములు 20:28; ఫిలిప్పీయులు 1:1; తీతు 1:5) పెద్దలు సంరక్షణా పర్యవేక్షణను అందించి, దేవుని మందను ఆత్మీయంగా కాయుచున్నారు. పరిచారకులు వారికి సహాయపడుచున్నారు. వారి కార్యములు నేరుగా ఆత్మీయ పర్యవేక్షణతో ముడిపడియుండవు. (1 పేతురు 5:2; పోల్చుము అపొస్తలులకార్యములు 6:1-6.) పరిచారముచేయుటకు వచ్చిన దేవుని కుమారునివలె, నియమితులైనవారు తోటి విశ్వాసులకు సేవచేయగోరుదురు. (మార్కు 10:45) నీవు క్రైస్తవ పురుషుడవైతే, అట్టి భావనను కల్గియున్నావా?

సామాన్యంగా ఉండవలసిన అర్హతలు

4. సంఘ బాధ్యతలు అప్పగించబడినవారి కొరకైన అర్హతల పట్టికను మనము ముఖ్యంగా ఎచ్చట కనుకొనగలము?

4 సంఘ బాధ్యతలు అప్పగించబడిన వారినుండి ముఖ్యంగా కోరబడుచున్నవాటిని అపొస్తలుడైన పౌలు 1 తిమోతి 3:1-10, 12, 13 మరియు తీతుకు 1:5-9 నందు వ్రాసెను. ఈ అర్హతలను మనము చర్చించుచుండగా, అందులో కొన్ని పెద్దలకు పరిచారకులకు యిద్దరికి అన్వయించబడుచుండగా, లోక ప్రమాణములను బట్టి మనము వాటిని దృష్టించకూడదు. కాని మొదటి శతాబ్దములోవాటి ఏర్పాటును, యెహోవా ప్రజల మధ్య అవి ఎలా అన్వయించబడునో అనే దృష్టితో మనము వాటిని చూడాలి. ఈ అర్హతలను చేరుటకు పరిపూర్ణత అవసరములేదు. అట్లయితే ఎవ్వరూ అర్హులుకాజాలరు. (1 యోహాను 1:8) నీవు ఒకక్రైస్తవుడవైతే, ప్రస్తుతము నీకు సంఘబాధ్యతలున్నను లేకున్నను నీ వ్యక్తిగత అర్హతలను ఎందుకు పరిశీలించకూడదు?

5. నిందారహితుడైయుండుట అంటే అర్థమేమిటి?

5 నిందారహితుడు; వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడు; అనింద్యుడైయుండాలి. (1 తిమోతి 3:2, 7, 8, 10; తీతు1:6, 7) నియమించబడునపుడు మరియు సేవచేస్తు ఉన్నప్పుడు పరిచారకులు, పెద్దలు నిందారహితులైయుండాలి, అనగా ఎట్టి నిందలేనివారై ఒక చెడు ప్రవర్తన బోధవలనవచ్చే నిజమైన నిందనుబట్టి గద్దించవలసిన అవసరతలేని వారైయుండాలి. “కపటసహోదరులు” లేక యితరులు చేసే అబద్ధ ఆరోపణలు ఒకని నిందితునిగా చేయజాలవు. సంఘములో సేవచేయుట ఒకవ్యక్తిని అనర్హునిగా చేయుటకు ఆరోపణ తుచ్ఛమైనది కాకూడదు. అది లేఖన ప్రమాణములతో నిరూపించబడవలెను. (2 కొరింథీయులు 11:26; 1 తిమోతి 5:19) సంఘములో నియమితుడు “నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు, సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడైయుండవలెను.” ఒకడు గతములో తీవ్రమైన పాపముచేస్తే, ఎట్టి నిందలేనివాడుగా జీవించుచు, మంచి పేరు సంపాదించినపుడు మాత్రమే అతనిని నియమించవచ్చును.

6. ఏకపత్నీపురుషుడైయుండుట అంటే అర్థమేమిటి?

6 ఏకపత్నీ పురుషుడు. (1 తిమోతి 3:2, 12; తీతు 1:6) కేవలం వివాహితులు మాత్రమే పరిచారకులుగా పెద్దలు ఉండాలని దీని అర్థం కాదు. వివాహితుడైతే జీవిస్తున్న ఒక భార్యను కల్గియుండి, ఆమె యెడల నమ్మకముగా ఉండాలి. (హెబ్రీయులు 13:4) మొదటి శతాబ్ధమందు క్రైస్తవులు కాని అనేకులవలె బహు భార్యాత్వముa కల్గియుండ కూడదు.

7. (ఎ) ఒక వ్యక్తి పెద్దగా మామూలు వయస్సు అర్హునిచేస్తుందా? (బి) ఇంటివారిని బాగుగా ఏలుటయందు ఏమియిమిడియున్నది?

7 సంపూర్ణ మాన్యతకలిగి తనపిల్లలను స్వాధీనపరచుకొనుచు తనయింటివారిని బాగుగా ఏలువాడునైయుండాలి. ( 1 తిమోతి 3:4, 5, 12; తీతు 1:6) పెద్దలు కనీసము 30 సంవత్సరముల వయస్సుకల్గియుండాలని కొందరు తలంచవచ్చును, కాని బైబిలు కనిష్ట వయస్సును నిర్ణయించలేదు. అయితే ఆత్మీయభావములో అతడు వృద్ధునివలె మెలగాలి. పరిచారకులు, పెద్దలు పిల్లలను కల్గియుండేంత వయస్కులైయుండాలి. వివాహితులైతే, యింటి వద్ద క్రూరుడుగాను వేరొక చోట దైవికంగాను ప్రవర్తిస్తుంటే అతడు అనర్హుడు. బైబిలు నియమములనుబట్టి తన కుటుంబమును బాగుగా ఏలుచున్నాడనే గౌరవమును అతడు సంపాదించాలి. ప్రతికుటుంబ సభ్యుని నుండి ఆత్మీయ విజయాన్ని పొందగల్గే గురిని అతడు కలిగియుండాలి. సాధారణంగా తండ్రియైయున్న పెద్ద మంచి ప్రవర్తనగల ‘విశ్వాసులైన’ పిల్లలను కల్గియుండాలి. వారు దేవునికి సమర్పించుకొనుటకు ముందుకు సాగుచున్నవారైన లేదా యెహోవాసాక్షులుగా యిప్పటికే బాప్తిస్మము తీసుకొన్న వారిగానైనా ఉండాలి. తన పిల్లలలో విశ్వాసమును వృద్ధిచేయలేక పోతే ఇతరులలో కూడ చేయలేడు.

8. కుటుంబాన్ని కల్గియున్న వ్యక్తి పెద్ద అయ్యేముందు ఏమి చేయనేర్చుకోవాలి?

8 సంఘములో ఆత్మీయ పర్యవేక్షణను అందించ సమర్థుడైన పెద్దగా అయ్యేముందు తన కుటుంబాన్ని ఎలా నడిపించాలో నేర్చుకోవాలి. ‘ఎవడైనను తనయింటివారిని ఏలుట పొట్ల ఎరుగని వాడైతే అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?’ (1 తిమోతి 3:5) నిజమే, అవిశ్వాసియైన భార్య అతనిని వ్యతిరేకించవచ్చును. (మత్తయి 10:36; లూకా 12:52) లేదా అతని పిల్లలలో యితరులు ఆత్మీయంగా ఉన్నను, ఒకడు తీవ్రమైన పాపములో పడవచ్చును. అయినను చేయదగినదంతా అతడు చేసి మరి ముఖ్యంగా తనకుటుంబములోని యితరుల ఆత్మీయ విజయాన్ని పొందగల్గితే, ఒక కుటుంబ సభ్యుడు అతని శ్రేష్టమైన నడిపింపును తృణీకరించినంతమాత్రమును పరిచారకునిగా లేదా పెద్దగా ఉండుటకు అనర్హుడుకాదు.

9. మద్యపానీయము విషయములో పెద్ద లేదా పరిచారకుడు ఎట్టి శ్రద్ధచూపాలి?

9 మద్యపానియు కొట్టువాడును లేక మిగుల మద్యపానాసక్తుడైయుండ కూడదు. (1 తిమోతి 3:3, 8; తీతు 1:7) ఒక పరిచారకుడు లేక ఒక పెద్ద మద్య పానముతో మితిమీరకూడదు. వాటికి బానిసలైతే, ఆలోచనలు భావోద్రేకాలు పట్టుసడలి, మద్య ప్రభావమువలన కొట్టుటకు లేదా జగడములకు దారితీయును. మిగుల మద్య పానాసక్తుడై యుండకూడదు లేదా త్రాగుటకు అలవాటు పడిన వాడని లేదా ఎక్కువగా త్రాగేవాడనే పేరును కల్గియుండకూడదు. (సామెతలు 23:20, 21, 29- 35) కాపరి సందర్శనమునందు తన్నుతాను అదుపులో ఉంచుకొననట్లు ప్రవర్తించుట ఎంత విచారకరము! ఒక సహోదరుడు త్రాగదల్చితే, కూటములలో, పరిచర్యలో, లేక యితర పవిత్రసేవలో పాలుపంచు కొనుచున్నపుడు అలాచేయకూడదు.— లేవీయకాండము 10:8-11; యెహెజ్కేలు 44:21.

10. ధనాపేక్షులు, దుర్లాభాపేక్షులు పెద్దలు పరిచారకులుగా ఉండుటకు ఎందుకు అర్హులు కాదు?

10 ధనాపేక్షగలవాడు లేదా దుర్లాభమునపేక్షించువాడునైయుండకూడదు. (1 తిమోతి 3:3, 8; తీతు 1:7) ధనాపేక్షులు ఆత్మీయ ఆపదలో ఉన్నారు. మరియు “దురాశపరులు” దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అందుచేత అట్టి వ్యక్తులు పెద్దలు లేక పరిచారకులుగా ఉండుటకు అర్హులుకారు. (1 కొరింథీయులు 6:9, 10; 1 తిమోతి 6:9, 10) గ్రీకులో దీని మూల పదము “మోసము” అని తర్జుమాచేయబడెను, అనగా ‘అవమానకరమైన’ అని యర్థము “అపేక్షించుట” అని తర్జుమా చేయబడిన ప్రకారము లాభము లేక ప్రయోజనమునకు వర్తించును. (ఫిలిప్పీయులు 1:21; 3:4-8) అవును, దేవుని “గొఱ్ఱెలను” అవమానకరంగా చూస్తున్నాడని ఎవని ప్రవర్తన చూపునో అతడు సంఘబాధ్యతలకు అర్హుడు కాజాలడు. (యెహెజ్కేలు 34:7-10; అపొస్తలులకార్యములు 20:33-35; యూదా 16) ఒకవ్యక్తి నియమించబడిన తరువాత అతనికి నిధులు అప్పగించవలసివచ్చునని, అందులో కొంత ద్రవ్యమును దొంగిలించుటకు శోధించబడవచ్చునేమోనని మనము గుర్తించినట్లయిన సిఫారసు చేయునప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరతను హెచ్చిస్తాము.—యోహాను 12:4-6.

11. క్రొత్తగా “చేరినవాడిని” సంఘబాధ్యతకు ఎందుకు సిఫారసు చేయకూడదు?

11 క్రొత్తగాచేరినవాడై యుండకూడదు, వారు మొదట పరీక్షింపబడవలెను. (1 తిమోతి 3:6, 10) తనకు అప్పగించబడిన పనులను నమ్మకముగా కొనసాగించగలడని నిరూపించుకొనుటకు క్రొత్తగా బాప్తిస్మము పొందిన వ్యక్తికి తగినంత సమయము లేదు. నలిగినవారియెడల సానుభూతి లేదా తోటి ఆరాధికులకు సహాయముచేయు జ్ఞానము లేకపోవచ్చును. ఇతరులను చులకనగా చూడవచ్చు కూడా. పరిచారకునిగా సిఫారసు చేయబడకమునుపు మరి ముఖ్యంగా పెద్దగా సిఫారసు చేయబడకముందు ఒకడు “పరీక్షింపబడి” మంచిసాక్ష్యము, నమ్మకత్వపు రుజువును చూపాలి. ఈ పరీక్షకు నిర్ణయిత సమయము లేదు, ఆత్మీయాభివృద్ధిలో వ్యక్తివ్యక్తికి తేడా ఉంటుంది. అయితే క్రొత్త వ్యక్తిని సిఫారసు చేయుటలో పెద్దలు త్వరపడకూడదు, ఎందుకంటె “అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడు” ప్రమాదమున్నది. అట్టివానిని మొదట క్రీస్తులాంటి వినయమును కనుపర్చనీయండి.—ఫిలిప్పీయులు 2:5-8.

పరిచారకులపై కేంద్రీకృత దృష్టి

12. పరిచారకుల కొరకు పేర్కొనబడిన ఆవశ్యకతలను వారు మాత్రమే పాటించవలెనా?

12 పరిచారకుల నిమిత్తము కొన్ని ఆవశ్యకతలు పేర్కొనబడినవి. అయితే, అట్టి ఆవశ్యకతలకు పెద్దలు కూడ చేరుకొనకపోతే సేవచేయుటకు అర్హులు కారు. క్రైస్తవునిగా నీవు వీటివిషయములో అర్హుడవైయున్నావా?

13. గంభీరత కల్గియుండాలంటే ఏమిటి?

13 గంభీరత. (1 తిమోతి 3:8) పరిచారకునిగా సేవచేయుటకు అర్హుడగువాడు బాధ్యతను తేలికగా తీసుకొన కూడదు. గౌరవమును పొందగల్గు పెద్దమనిషి తరహాలో అతడు నడచుకొనవలెను. అప్పుడప్పుడు హాస్యంగా ప్రవర్తించుటకు అనుమతించబడినను, తదేకంగా అతడు అలా కొనసాగుచున్నయెడల అర్హుడు కాడు.

14. (ఎ) రెండు నాలుకలుండటమంటే అర్థమేమిటి? (బి) పవిత్ర మనస్సాక్షిని కల్గియుంటే ఏమిచేయాలి?

14 ద్విమనుస్కులుకాక; పవిత్ర మనస్సాక్షిగలవారై యుండవలెను. (1 తిమోతి 3:8, 9) పరిచారకులు (మరియు పెద్దలు) సత్యవంతులైయుండి వదరుబోతు లేదా పెడత్రోవను నడుపు వారు కాకూడదు. వారికి రెండు నాలుకలు ఉండకూడదు. గనుక వేషధారులవలె, ఒకవిషయాన్ని ఒకవిధంగా వేరొకనికి మరోవిధంగా చెప్పకూడదు. (సామెతలు 3:22; యాకోబు 3:17) వీరు “విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారైయుండి” బయల్పరచబడిన సత్యమును గట్టిగా బలపర్చువారునైయుండాలి. దేవునియెదుట, తాను నిర్మలుడని, నీచమైన లేదా చెరచివేయు దేనినైనా తాను ఆచరించుటలేదని అతని మనస్సాక్షి సాక్ష్యమియ్యవలెను. (రోమీయులు 9:1; 2 కొరింథీయులు 1:12; 4:2; 7:1) సత్యమునకు దైవికసూత్రములకు హత్తుకొనియుండకపోతే దేవుని మందను కాయుటకు ఎవ్వరూ అర్హులు కారు.

పెద్దల అర్హతలపై దృష్టిసారించుట

15. ఇప్పుడు ఎవరి అర్హతలు పరిశీలించబడును, వాటిలో ముఖ్యంగా ఏమి ఇమిడియున్నది?

15 కొన్ని అర్హతలు ముఖ్యంగా పెద్దలకే వర్తించి, కాపరులు మరియు బోధకులుగా ఎక్కువ వారిపనికి సంబంధించినవైయున్నది. క్రైస్తవునిగా, నీవు ఈ అర్హతలను చేరుకొనుచున్నావా?

16. (ఎ) అలవాట్లలో మితముగా ఉండుటకు ఏమి అవసరము? (బి) ఒకపెద్ద ఎలా ఆశానిగ్రహమును కల్గియుండగలడు?

16 మితమైన అలవాట్లు; ఆశానిగ్రహము ఉండాలి. (1 తిమోతి 3:2; తీతు 1:8) ఒక పెద్ద చెడు అలవాట్లకు బానిసకాకుండా, తగుమాత్రపు అలవాట్లను కల్గియుండాలి. అతడు శోధనలను ఎదుర్కొనినప్పుడు, కీర్తనల గ్రంథకర్తవలె అతడును ప్రార్థించినయెడల సమతూక స్థితిని కల్గియుండుటకు దేవుడాతనికి సహాయముచేయును: “నా హృదయ వేదనలు అతివిస్తారములు; ఇక్కట్టులో నుండి నన్నువిడిపింపుము.” (కీర్తన 25:17) అధ్యక్షునిగా ఒకడు దేవుని ఆత్మకొరకు కూడ ప్రార్థించి ఆశానిగ్రహము యిమిడియున్న ఆత్మఫలములను ఫలించాలి. (లూకా 11:13; గలతీయులు 5:22, 23) ఆలోచనలు, మాట మరియు చర్యలను గమనించుకొనగల్గితే, సంఘమునకు ఆత్మీయనడిపింపు నిచ్చువానిగా మితిమీరిన అలవాట్లను తప్పించుకొనుటలో పెద్దకు అవి తోడ్పడగలవు.

17. స్వస్థబుద్ధి గలవాడైయుండుటలో యిమిడియున్నదేమి?

17 స్వస్థబుద్ధి. (1 తిమోతి 3:2) ఒకపెద్ద వివేకియు, బుద్ధిమంతుడును, జాగరూకతగలవాడైయుండాలి. మాటలోను క్రియలోను సంకల్పముగలవాడై వివేక విశిష్టతను చూపాలి. వినయము, సమతూకముగల అతని ఆలోచన దేవుని జ్ఞానముపైన యెహోవా వాక్యమందలి శ్రేష్టమైన బోధలపైన ఆధారపడియుంటుంది. దానిని అతడు శ్రద్ధతో పఠించు విద్యార్థియై యుండాలి.—రోమీయులు 12:3; తీతు 2:1.

18. మర్యాదస్థుడైయుండాలంటే పెద్ద ఏమిచేయాలి?

18 మర్యాదస్థుడు. (1 తిమోతి 3:2) ఇచ్చట వాడబడిన గ్రీకుపదము 1 తిమోతి 2:9 నందు “చక్కగా క్రమపరచుకొనిన” అని తర్జుమా చేయబడెను. కనుక ఒకపెద్ద మంచి క్రమబద్ధమైన జీవనవిధానమును కల్గియుండాలి. దృష్టాంతమునకు అతడు క్రమము తప్పకూడదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు రికార్డులను భద్రపర్చుకొనుటను ఒక ముఖ్యాంశముగా చేయలేదు, ఆలాగే నేడు అధ్యక్షుడైన వాడు కూడా అనుభవశాలియైన గణకుడు లేదా గుమస్తా కానవసరంలేదు. ఈ విషయములలో అవసరమైనవాటిని పరిచారకులు చేపడతారు. అయితే “మర్యాదస్థుడు” అనుదానిని గ్రీకు పదము మంచి క్రమబద్ధమైన ప్రవర్తనకు వర్తించగలదు; అతడు ఒక పద్ధతిలేనివానిగా లేదా క్రమము లేనివానిగా ఉన్నయెడల పెద్దగా ఉండుటకు అర్హుడుకాడు.—1 థెస్సలొనీకయులు 5:14; 2 థెస్సలొనీకయులు 3:6-12; తీతు 1:10.

19. ఆతిధ్యమిచ్చువాడు గనుక ఒక పెద్ద ఏమిచేస్తాడు?

19 అతిథిప్రియుడు. (1 తిమోతి 3:2; తీతు 1:8) ఒక పెద్ద ‘ఆతిధ్యమిచ్చువాడైయుంటాడు.’ (రోమీయులు 12:13; హెబ్రీయులు 13:2) “ఆతిథ్యము” అనుదాని గ్రీకు పదము అక్షరార్థముగా “క్రొత్తవారియెడల ప్రియముగా ఉండుట’ అని అర్థము. ఆ విధంగా ఆ ఆతిథ్యమిచ్చు పెద్ద, క్రొత్తవారిని క్రైస్తవకూటములకు ఆహ్వానించి ధనికులయెడల చూపే శ్రద్ధనే పేదవారియెడల కూడ చూపిస్తాడు. క్రైస్తవ ఆసక్తి ప్రయాణించుచున్న వారికి అతడు ఆతిథ్యమిచ్చి ‘దేవునికి తగినట్టుగా ‘వారిని సాగనంపును. (3 యోహాను 5-8) నిజమే, తోటి ఆరాధికుల అవసరతలనుబట్టి తనపరిస్థితులు అనుకూలించినంత మేరకు ఒకపెద్ద ఆతిధ్యమిచ్చును.—యాకోబు 2:14-17.

20. ఒకపెద్ద ఏవిధములందు బోధించుటకు అర్హుడైయుండాలి?

20 బోధింపతగినవాడు. (1 తిమోతి 3:2) ఆత్మీయబోధకునిగా ఒక పెద్దకున్న సామర్ధ్యము మానసిక యోగ్యత లేదా లోక జ్ఞానమువలన కల్గేదికాదు. (1 కొరింథీయులు 2:1-5, 13) అతడు “హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడైయుండుట” వలన అది వస్తుంది. (తీతు 1:9 పోల్చుము అపొస్తలుల కార్యములు 20:18-21, 26, 27.) అతడు “ఎదురాడువారికి సాత్వికముతో ఉపదేశించువాడైయుండవలెను.” (2 తిమోతి 2:23-26) సంఘములో మంచి బహిరంగ ప్రసంగీకుడు కాలేకపోయినను ఒకపెద్ద దేవునివాక్యముయొక్క మంచి విద్యార్థియైయుండి, బైబిలును పఠించుచున్న తోటివిశ్వాసులకు ఉపదేశించి హెచ్చరించగల నైపుణ్యమును కల్గియుండాలి. (2 కొరింథీయులు 11:6) కుటుంబములు, వ్యక్తులు దైవిక జీవితాన్ని చేపట్టుటకు తోడ్పడే “హితబోధను చేయ సమర్థుడైయుండాలి”.—తీతు 2:1-10.

21. (ఎ) ఒక పెద్ద కొట్టువాడైయుండకూడదని ఎందుకు చెప్పబడింది? (బి) సాత్వికుడైయుండుట అనగా ఏమిటి? (సి) జగడమాడని వాడుగా ఉండుట అంటే అర్థమేమి?

21 కొట్టువాడుకాక, సాత్వికుడును, జగడమాడనివాడైయుండాలి. (1 తిమోతి 3:3; తీతు 1:7) సమాధానకరమైన వానిగా ఒకపెద్ద ప్రజలను భౌతికంగా కొట్టడంగాని దూషణ లేక కత్తిపోటు వంటి మాటలతో వారిని బెదరించడంగాని చేయడు. (2 కొరింథీయులు 11:20 పోల్చుము.) (దీనికి ముందు “మద్యపానియుకాక” అని చెప్పబడిన వ్యాఖ్య అతడు తరచు వివాదాలను నడిపే మద్యపానమును నిషేధిస్తాడని చూపుచున్నది.) సాత్వికునిగా (లేక లోబడేవానిగా) అధికారియై, ఒప్పింప కష్టతరమైన వానిగాయుండక, చిన్నచిన్న విషయాలను పెద్ద సమస్యలుగా చేయడు. (1 కొరింథీయులు 9:12; ఫిలిప్పీయులు 4:5; 1 పేతురు 2:18) జగడమాడని వానిగా ఒకపెద్ద వివాదములను విడనాడి “కోపపడుటకు త్వరపడడు.”—తీతు 3:2; యాకోబు 1:19, 20.

22. ఒకపెద్ద స్వేచ్ఛాపరుడు కాకూడదనుటలో ఏమి సూచించబడింది?

22 స్వేచ్ఛాపరుడు కాకూడదు. (తీతు 1:7) “స్వప్రీతిపరుడుకాకూడదు” అని దీని అక్షరార్థభావము. (2 పేతురు 2:10 పోల్చుము.) ఒక పెద్ద మొండివాదము చేయువాడైయుండక తన సామర్ధ్యముల విషయమై వినయదృక్పథము కల్గియుండాలి. ఇతరులకంటె తాను విషయాలను బాగుగా చేపట్టగలనని తలంచక యితరులతో పాటు వినయంగా బాధ్యతలను పంచుకొని పెక్కు సలహాదారుల విలువను గుర్తిస్తాడు.—సంఖ్యాకాండము 11:26-29; సామెతలు 11:14; రోమీయులు 12:3, 16.

23. (ఎ) “ఒక పెద్ద సద్విషప్రియుడు” అనుదానిని నీవు ఎలా నిర్వచిస్తావు? (బి) నీతిమంతుడైయుండుట అంటే ఏమిటి?

23 సద్విషయప్రియుడు, నీతిమంతుడు. (తీతు 1:8) పెద్దగా అర్హుడు కావాలంటే ఒకవ్యక్తి సద్విషయములను ప్రేమించువాడును, నీతిపరుడునైయుండాలి. సద్విషయమును ప్రేమించువాడు యెహోవా దృష్టికి ఏది మంచిదో దానిని ప్రేమించి, దయార్థ, సహాయక పనులను చేయుచు, యితరుల మంచితనమును మెచ్చుకొనువాడైయుంటాడు. (లూకా 6:35; పోల్చి చూడుము అపొస్తలులకార్యములు 9:36, 39; 1 తిమోతి 5:9, 10.) నీతిమంతుడైయుండుట అనగా దేవుని శాసనములకు నియమములకు అనుగుణ్యముగానుండుట అనియర్థము. మరి యితరమైన వాటితోపాటు, అట్టివాడు నిష్పక్షపాతియై, నీతిని పవిత్రతను, యోగ్యమైనవాటిని మనస్సునందుంచుకొనును. (లూకా 1:6; ఫిలిప్పీయులు 4:8, 9; యాకోబు 2:1-9) మంచితనము న్యాయము కోరుదానికంటె మించిచేయునదైయుండి నీతికి వేరైయున్నది గనుక మంచితనమును ప్రేమించు వ్యక్తి తాను యితరులకు చేయవలసియున్నదానికన్నా ఎక్కువ చేయును.—మత్తయి 20:4, 13-15; రోమీయులు 5:7.

24. యథార్థవంతుడై యుండుటకు ఏమిచేయాలి?

24 యథార్థవంతుడు. (తీతు 1:8) ఒకపెద్దగా అర్హుడుకాదలచినవాడు దేవునియెడల చలించని భక్తిని కల్గియుండి, తన యథార్థత పరీక్షించబడినను దైవ శాసనములకు హత్తుకొనినవాడైయుండాలి. అతడు నమ్మకమైన రాజ్యప్రచారకునిగా సేవచేయుటతో పాటు, యెహోవా తననుండి ఏమి ఆశించుచున్నాడో దానిని నిర్వర్తించును.—మత్తయి 24:14; లూకా 1:74, 75; అపొస్తలులకార్యములు 5:29; 1 థెస్సలొనీకయులు 2:10.

అర్హతలకు చేరుకొనుట

25. ఇప్పుడు చర్చించిన అర్హతలు ఎవరికి ఉండాలి, అట్టివాటిని ఎలా సాధించవచ్చును?

25 ఇప్పుడు చర్చించిన అర్హతలు చాలామట్టుకు ప్రతి యెహోవాసాక్షికి ఉండవల్సినవే. తన పఠనము, ప్రయత్నము, మంచి సహవాసము, మరియు ప్రార్థనలపై దేవుని ఆశీర్వాదము ఉంటే దానిని సాధించవచ్చును. కొందరు వ్యక్తులు కొన్ని అర్హతలలో యితరుల కంటే దృఢముగా ఉండవచ్చును. అయితే పరిచారకులు పెద్దలు తమ ఆధిక్యతల కొరకు యివ్వబడిన అవసరతలను తగినంతమట్టుకు చేరుకొనవలెను.

26. క్రైస్తవ పురుషులు సంఘబాధ్యతలకు తమ్మును తాము ఎందుకు సమర్పించుకోవాలి?

26 దేవుని సేవలో సాధ్యమగు ప్రతిదానిని యెహోవాసాక్షులైన ప్రతి ఒక్కరు చేరగోరవలెను. సంఘ బాధ్యతలకు తమ్మును తాము సమర్పించుకొనుటకు అది క్రైస్తవ పురుషులను నడిపించును. నీవును సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొనినవ్యక్తివా? అట్లయితే వీటిని చేరుటకు, సేవచేయ అర్హుడవగుటకై ప్రయత్నముచేయుము. (w90 9/1)

[అధస్సూచీలు]

a దివాచ్‌టవర్‌ మార్చి 15, 1983 పేజి 29 నందు “లేఖనాధారవిడాకులు” అనే ఉప శీర్షికనుకూడ చూడుము

మీరు ఎట్లు జవాబిచ్చుదురు?

◻ బాప్తిస్మము తీసికొనిన పురుషులు సంఘబాధ్యతను చేపట్టు అవసరత యిప్పుడు ఎందుకు ఎక్కువగా ఉన్నది?

◻ పరిచారకులకు ఉండవలసిన కొన్ని అర్హతలేమిటి?

◻ పెద్దలు చేరుకొనవలసిన అవసరతలు కొన్నిఏమి?

◻ ఒకపెద్ద తనయింటివారిని ఎందుకు బాగుగా ఏలువాడైయుండాలి?

◻ సంఘ పనులకు తమ్మును తాము అందుబాటులో ఉంచుకొనుటకు క్రైస్తవ పురుషులను ఏది పురికొల్పును?

[16, 17వ పేజీలోని చిత్రాలు]

పెద్దలు మరియు పరిచారకులు బైబిలు సూత్రముల ప్రకారము తమ గృహములను ఏలవలెను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి