కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 1/8 పేజీలు 16-18
  • “మేము మానేశాం—మీరూ మానగలరు!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మేము మానేశాం—మీరూ మానగలరు!”
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగాకు వ్యాప్తి
  • మీరెలా మానుకోగలరు?
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 1/8 పేజీలు 16-18

“మేము మానేశాం—మీరూ మానగలరు!”

జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి

కొన్ని కథనాల ప్రకారం, 1500లలో జపాన్‌ సముద్రంలో ఆగిన యూరోప్‌ నౌకలు పొగత్రాగే సందర్శకులను తీసుకువచ్చింది. “వాళ్ళు తమ ఉదరంలో నిప్పంటించుకుంటున్నట్లు” అనిపించింది. మొదట ఆశ్చర్యం కలిగింది, ఆ తర్వాత జిజ్ఞాస కలిగింది. అలా 1880లు వచ్చేసరికి పొగత్రాగే అలవాటు జపాన్‌లో సర్వసాధారణమైంది. మొదట ఆశ్చర్యపోయిన ఆ జపానీయుల సంతతివారే నేడు ప్రపంచంలో అత్యధికంగా పొగత్రాగేవారి కోవలో ఉంటారని ఎవరు అనుకుని ఉంటారు?

“పెద్దవాళ్ళమయ్యామన్న భావన మాకు కలగాలనీ, పెద్దవాళ్ళకు కలిగేటటువంటి భావోద్వేగాలతో మాకు పరిచయం కావాలని మేము కోరుకున్నాం.”—ఆకీయో, ఓసామూ, యోకో.

“నేను బరువు తగ్గాలని అనుకున్నాను.”—ట్సుయా.

“నా జిజ్ఞాసవల్ల అలా చేశాను.”—టోషీహీరో.

“పొగాకు మాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మేము అనుకోలేదు.”—ర్యోహే, జునీచీ, యాసుహీకో.

“నేను రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు వేవిళ్ళను ఆపే ఉద్దేశంతో మొదలుపెట్టాను.”—చీయకో.

“బిజినెస్‌ మీటింగ్‌లు జరిగేటప్పుడు చికాకుగా ఉండే క్షణాల్లో తాగేవాడ్ని.”—టాట్సుహీకో.

ఎందుకు సిగరెట్లు త్రాగడం మొదలుపెట్టారు అని ఒక గుంపు ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు పై కారణాలను చెప్పారు. పొగత్రాగేవారి పరదైసు అని కొందరు జపాన్‌ను పిలుస్తున్నారు కాబట్టి, అలాంటి విశదీకరణలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే, పైన పేర్కొనబడిన వాళ్ళందరూ పొగాకు త్రాగే అలవాటును మానుకున్నారన్నది గమనార్హమైన విషయం. వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళకు కలిగిన ఆటంకాలను బట్టి, నిజంగా అది గొప్ప విజయమని చెప్పవచ్చు. వాళ్ళు ఎలా మానుకున్నారా అని మీరు ఆలోచిస్తున్నారా? మొదటిగా, నేడు జపాన్‌లో పొగాకు ఉపయోగం ఎంత వ్యాప్తి చెందిందో చూద్దాం.

పొగాకు వ్యాప్తి

అమెరికాలో 15 ఏండ్లు లేదా అంతకన్నా పెద్దవాళ్ళైన మగవాళ్ళలో కేవలం 28 శాతం మంది మాత్రమే పొగ త్రాగుతుండగా, జపాన్‌లోని వయోజనుల్లో దాదాపు 56 శాతం మంది పొగత్రాగుతున్నారు. జపాన్‌లో పొగత్రాగే 3,40,00,000 మందిలో దాదాపు 22 శాతం మంది స్త్రీలు ఉన్నారు. వారిలో చాలా మంది యువతులే. పెద్దవాళ్ళ మాదిరీ, నేర్పుగా రచించబడిన ప్రకటనలూ పొగత్రాగే యౌవనస్థుల సంఖ్య అతి త్వరగా పెరిగిపోవడానికి చాలా దోహదపడ్డాయి. టీవీలోనూ, రేడియోలోనూ ఇవ్వబడే సిగరెట్‌ ప్రకటనలు జపాన్‌లో ఇప్పుడు నిషేధించబడ్డాయి. అమెరికాలో అయితే, రెండు దశాబ్దాలకన్నా పూర్వమే నిషేధించబడ్డాయి.

అంతేగాక, జపాన్‌లో వీధి మూలల్లో అమ్మబడే మెషీన్లలో సిగరెట్లు సులభంగా లభ్యమౌతాయి. సిగరెట్‌ ప్యాకెట్లు ఒకసారి చేతికి అందాక, వాటి మీద ముద్రితమైన జీవంలేని, పసలేని మాటలను అనుసరించేవారు అరుదు. ఆ లేబల్‌ ఇలా ఉంటుంది: “ఎక్కువ త్రాగకుండా ఉందాం; అది హానికరం కావచ్చు.” పొగ త్రాగడం వల్ల కలిగే భయంకరమైన ప్రమాదాలను అలక్ష్యం చేయడం తరచూ పరిపాటవ్వడమే కాక, అనేక మంది ప్రముఖుల చెడ్డ మాదిరి కూడా జపానీయులను పొగత్రాగేందుకు ప్రోత్సహించి, తమకు ఎటువంటి హానీ కలగదన్న తప్పుడు తలంపును వాళ్ళలో కలుగజేసి వాళ్ళ మనస్సును నిమ్మళింపజేస్తుంది.

తన పౌరుల్లో అనేకమంది పొగాకు త్రాగడాన్ని మానలేకపోతున్నా కూడా జపాన్‌ శ్రద్ధ చూపకపోవడం ఎంతో శోచనీయమని పొగత్రాగకూడదని బోధించేవాళ్ళు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పొగత్రాగడం ఆరోగ్యాన్నీ, ప్రాణాన్నీ అపాయంలో పడవేస్తుందని ప్రజలకు హెచ్చరికనివ్వవలసిన ప్రాముఖ్యతను విద్యావేత్తలు గుర్తించడం మొదలుపెట్టారు. అన్నిప్రాంతాల్లోనూ, పొగత్రాగేవారిలో ఈ రోగాల లక్షణాలు కనిపిస్తున్నాయి: నాసియా, శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం చికాకు కలిగించే దగ్గు, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, జలుబు సులభంగా అంటుకోవడం, బహుశా, కాలక్రమేణా, శ్వాసనాళ క్యాన్సర్‌, హృద్రోగం, లేదా మరితర సమస్యలు. చివరి మూడింటి వల్ల చివరికి అకాల మరణం కూడా సంభవించవచ్చు. అవును, పొగత్రాగే జపానీయుల్లో కూడా ఈ లక్షణాలే కనిపిస్తున్నాయి.

1985, ఏప్రిల్‌ 1న, జపానీస్‌ పొగాకు పరిశ్రమను ప్రైవెటీకరణ చేయడంతో, దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంగా ఉన్న పొగాకు పరిశ్రమ అంతరించిపోయింది. అయినా కూడా, ప్రభుత్వానికి వాటిపై ఇప్పటకీ గట్టి పట్టు ఉండడంవల్ల, పొగత్రాగడాన్ని నిరుత్సాహపర్చడంలో, నిజమైన ప్రగతిని సాధించేందుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. జపాన్‌ నేడు పొగత్రాగేవారి ఆశ్రయ స్థానంగా మారింది అని పొగత్రాగడాన్ని వ్యతిరేకించే గ్రూపులు ఎందుకనుకుంటున్నాయో ఇది విశదంగా తెలియజేస్తుంది. “పొగత్రాగడాన్ని ప్రోత్సహించే సమాజం” జపానేనన్న వాస్తవాన్నిబట్టి అక్కడి డాక్టర్‌లు విచారిస్తున్నారని ద డెయిలీ యోమీయురీ అనే వార్తాపత్రిక ఎందుకు నివేదించిందో ఇది విశదంగా తెలుపుతుంది.

ఈ అలవాటును మానుకోవడంలో కొందరు ఎలా సఫలీకృతులయ్యారో చూసేందుకు “మేమెలా మానుకున్నామంటే” అనే బాక్స్‌ను చూడండి.

మీరెలా మానుకోగలరు?

బాక్స్‌లో పేర్కొన్నవాళ్ళకుమల్లే, మునుపు పొగత్రాగడాన్ని అతిగా ప్రేమించినవాళ్ళ సలహాను సంగ్రహ రూపంలో ఇలా చెప్పవచ్చు: మానుకోవాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ఉంచుకోండి. దేవుడి మీద ప్రేమా, ఆయనను ప్రీతిపరచాలనే కోరికా అందుకు శ్రేష్ఠమైన మార్గం కాగలవు. మీ పొరుగువాళ్ళను ప్రేమించడం కూడా మరొక మంచి మార్గం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దాని ప్రకారం చేయండి. మీరు మానుకోబోతున్నారని అందరికీ తెలపండి—మీ స్నేహితులకు చెప్పండి. మీ కుటుంబ సభ్యుల సహాయాన్ని తీసుకోండి. సాధ్యమైతే అర్ధాంతరంగానే మానేయండి. పొగత్రాగే వాతావరణాన్ని నివారించేందుకు మీకు సాధ్యమైనదంతా చేయండి.

మీరు బైబిలు పఠిస్తున్నట్లయితే, యెహోవాసాక్షులతో మీ సహవాసాన్ని పెంచుకోండి. మీరు వాళ్ళ మధ్యన ఉంటే, పొగత్రాగాలనే మీ కోరికను త్వరలోనే విడిచిపెట్టగలుగుతారు. ఒకవేళ మీరు ఒక యెహోవాసాక్షిగా పొగత్రాగుతున్న ఒకరితో బైబిలు పఠిస్తున్న వ్యక్తయితే, ఆయనకు సహాయం చేయండి. తన చెడు అలవాటు కన్నా ఎక్కువగా యెహోవానే ప్రేమించేందుకు అతనికి సహాయపడండి.

[16-17వ పేజీలోని బాక్సు/చిత్రం]

“మేమెలా మానుకున్నామంటే”

మీకో: “నేను యెహోవాసాక్షులతో పఠించనారంభించినప్పుడు, నేను పొగత్రాగడం మానుకోలేనని నాకు ఖచ్చితంగా తెలుసు. కనీసం నా పిల్లలైనా జీవం వైపుకు నడిపే మార్గాన్ని తెలుసుకోవాలన్నదే నేను పఠించాలనుకున్నదాని ఉద్దేశం. తల్లిదండ్రులు తప్పనిసరిగా మంచి మాదిరినుంచాలని త్వరలోనే తెలుసుకున్నాను, కనుక, సహాయం కోసం యెహోవా దేవుడికి పట్టుదలగా ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను దేని కోసం ప్రార్థించానో, దానిని సాధించేందుకు చాలా గట్టి ప్రయత్నమే అవసరమైంది. నేనొక దౌర్భాగ్యుడనని కొంత కాలం భావించాను. చివరికి నేను ఈ చెడ్డ అలవాటు నుండి విముక్తిని పొందగలిగినప్పుడు నా మనస్సాక్షి నిర్మలం కాగా నాకు కలిగిన మంచి అనుభూతిని ఎన్నటికీ మరువలేను.”

మాసాయూకి: “రోజుకు మూడు ప్యాకెట్లు త్రాగడం అలవాటైన నేను దాన్ని మానుకోవడానికి అనేక సార్లు, ప్రయత్నించడమూ, విఫలమవ్వడమూ జరిగిన తర్వాత, చివరికెలాగైతేనేమి, నా చివరి సిగరెట్‌ను పూర్తిగా కాల్చేసి, పొగాకుకు గుడ్‌బై చెప్పాను. నేను ఆ అలవాటు మానుకోవడానికి నా కుటుంబమూ, నా తోటి సాక్షులూ, యెహోవా దేవుడూ నాకు సహాయం చేశారు. నేను పొగత్రాగడం మానేశానన్న విషయాన్ని నేను పనిచేస్తున్న బ్యాంకులోనివాళ్ళెవ్వరూ నమ్మలేకపోయారు. మన కస్టమర్‌లకు మంచి మర్యాద చూపించడంలో భాగంగా, పని సమయంలో జనరల్‌ బ్యాంకింగ్‌ ఏరియాలోని ఆఫీస్‌ వర్కర్‌లు పొగ త్రాగకూడదని సూచించాను. అక్కడ పనిచేస్తున్నవారిలో 80 శాతం మంది పొగత్రాగేవారే అయినప్పటికీ, నేను ఇచ్చిన సూచన అమలుపరచబడింది. ఈ పద్ధతి ఇప్పుడు మా బ్యాంక్‌ యొక్క ఇతర 260 శాఖల్లో కూడా వ్యాపించింది.”

ఓసామూ: “నేను దేవుడి వాక్యమైన బైబిలు నుండి సత్యాన్ని తెలుసుకున్నాను గనుక, నేను పొగత్రాగడం మానేయవలసి ఉందని నాకు తెలుసు. నేను పొగత్రాగడం మానడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. నేను వదిలిపెట్టాక కూడా, మరో ఆరు నెలలు పొగత్రాగాలన్న కోరికతో పోరాడవలసి వచ్చింది. నేను మానుకోవాలనే కోరిక నాకుండాలని నా అంతర హృదయం నాకు చెబుతూనే ఉంది.”

టోషీహీరో: “నేను కనీసం పొగత్రాగడాన్నైనా త్యజించాలి అని నేను భావించేంతగా యేసు క్రయధన బలి నా హృదయపు లోతుల్ని స్పృశించింది.”

యాసుహీకో: “యెహోవా దేవుడికి విధేయత చూపించాలన్న నా నిర్ణయమూ, నేను పొగత్రాగడాన్ని మానుకోవడమూ నా జీవితాన్ని కాపాడాయి. ఒకరోజు, నేను పనిచేస్తున్న గదిలో, ప్రొపేన్‌ గ్యాస్‌ లీకై ఆ గదంతా నిండి పోయింది. మామూలుగా అయితే, నేను సిగరెట్‌ వెలిగించేవాడ్ని. అలా అది గొప్ప విస్ఫోటనానికి దారితీసి ఉండేది. కానీ, నేను కొన్ని రోజుల క్రితమే పొగత్రాగడం మానేశాను గనుక, నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఇలా మాట్లాడగల్గుతున్నాను.”

ఆకీయో: “నాకు తరచూ నాసియా వస్తున్నట్లు ఉండడం వల్ల, పొగత్రాగడమే నన్ను ఇలా వేధిస్తుందని అనుమానించబడింది. కానీ, నేను పొగత్రాగడం మానుకోలేదు. పొగత్రాగడం వల్ల కలిగే ప్రమాదాలను గురించిన యథార్థ సమాచారం మొదట నా భార్య నుండే నాకు అందింది. అప్పటికే ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరైంది. త్వరలోనే నేను బైబిలు పఠించడం మొదలుపెట్టాను. పొగత్రాగేవాడు, తనకు తాను హానికలుగజేసుకోవడమే కాక తన కుటుంబ సభ్యులకు కూడా హాని కలిగిస్తున్నాడు అని వాచ్‌ టవర్‌ ప్రచురణల నుండి తెలుసుకున్నాను. నేను వెంటనే మానేశాను!”

ర్యోహే: “నా భార్య నాకోసం సిగరెట్లు కొనిపెట్టేది—ప్రతిసారి 20 ప్యాకెట్లు చొప్పున కొనిపెట్టేది. కాని సాక్షులతో బైబిలు పఠించిన తర్వాత, నాకు ఏది హానికలిగిస్తుందని తను తెలుసుకుందో దానిని కొనిపెట్టడానికి ఆమె నిరాకరించింది. తర్వాత నేనే సొంతంగా ఒక సిగరెట్‌ షాప్‌ మొదలుపెట్టాను. నేను రోజుకు మూడున్నర ప్యాకెట్లు త్రాగేవాడ్ని. తర్వాత నేను సాక్షులతో బైబిలు పఠించడం మొదలుపెట్టాను. త్వరలోనే నేను బైబిలు అంశాలను గురించి ప్రావీణ్యంతో ప్రసంగించేవాడనవ్వాలని కోరుకున్నాను. దానికోసం దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో తర్ఫీదును పొందేందుకు యోగ్యుడనయ్యేందుకుగాను నేను పొగత్రాగడం మానేశాను.”

జునీచీ: “మా పాప నా జీవితం విషయమై బెంగపెట్టుకుంది. మా పాప ఒక యెహోవాసాక్షి. నేను పొగ త్రాగడం మానేస్తానని నేను మాటిచ్చేలా చేసింది. అలా నేను మానేశాను.”

ట్సుయా: “నేను మొదటిసారిగా రాజ్యమందిరాన్ని సందర్శించినప్పుడు, నేను లోపలికి ప్రవేశించాక, ఒక ఆష్‌ట్రేను, అగ్గిపెట్టెను అడిగాను. అయితే అక్కడున్న ఎవరూ కూడా పొగత్రాగరని వాళ్ళు చెప్పినప్పడు ఆశ్చర్యపోయాను. నేను పొగత్రాగడం మానాలని నాకు తెలుసు. పొగత్రాగడాన్ని మానడం నుండి వెనుదిరగడం వల్ల కలిగే భయంకరమైన ఫలితాలను ఇంకా చవిచూడవలసిన పరిస్థితి రాకూడదని నిర్ణయించుకునేలా నేను ఆసుపత్రిలో గడిపిన ఎనిమిది దుర్దినాలు చేశాయి.”

యోకో: “యెహోవాసాక్షుల పత్రికల్లోనూ, ఇతర ప్రచురణల్లోనూ నేను ఈ అంశాన్ని గురించి పఠించి, హింసాకొయ్యపై మేకులతో వ్రేలాడదీయబడి చనిపోబోతున్నప్పుడు, తనకు ఇవ్వజూపిన మత్తుమందులను యేసు ఎలా నిరాకరించాడన్న విషయాన్ని పునఃసమీక్షించాను. యెహోవా దేవుడి నామాన్ని స్తుతించే శుభ్రతగల వ్యక్తిగా కావాలని కోరుకుంటున్నానని చెబుతూ నేను యెహోవాకు ప్రార్థించాను. ఆ తర్వాత, నేను మరెన్నడూ పొగత్రాగలేదు. నా చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు పొగత్రాగినప్పుడు, వాళ్ళు త్రాగి విడిచిన దానిని పీల్చుకోవాలని కూడా కోరుకునేంతగా వెళ్ళాను. కాని, పొగత్రాగాలన్న కోరిక మళ్ళీ తలెత్తకూడదని అనుకున్నాను గనుక ఆ కోరికను వెంటనే మనస్సులో నుండి పారద్రోలుకున్నాను.”

మునుపు పొగత్రాగిన ఈ వ్యక్తులందరూ కూడా ఇకెన్నడూ పొగత్రాగకూడదని నిర్ణయించుకున్నారు. మీరు కూడా ఈ అలవాటును మానుకోవాలనుకుంటున్న పొగత్రాగుతున్న వ్యక్తా?

మీకో

ఓసామూ

యాసుహీకో

ఆకీయో, అతని భార్య సచికో

జునీచీ, ఆయన కూతురు మెరి

యోకో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి