కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 4/8 పేజీలు 9-10
  • నేరం లేని లోకం ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేరం లేని లోకం ఎలా?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేర సంస్థలనుండి బయటికి రావడం
  • లోకాత్మ నుండి తెగతెంపులు చేసుకోండి
  • సంస్థీకృత నేరం ఎందుకు వర్ధిల్లుతోంది?
    తేజరిల్లు!—1997
  • సంస్థీకృత నేరం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తోంది?
    తేజరిల్లు!—1997
  • సంస్థీకృత నేరంతో సంబంధాలను తెంచుకోవడం “నేను యాకూజాగా ఉండేవాడిని”
    తేజరిల్లు!—1997
  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 4/8 పేజీలు 9-10

నేరం లేని లోకం ఎలా?

వ్యవస్థీకృత నేరానికి విరుద్ధంగా పోరాటం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. “మాఫియాకు విరుద్ధంగా జరిగే పోరాటంలో చాలా స్వల్పవ్యవధిలోనే గణనీయమైన అభివృద్ధి సాధించబడింది” అని ప్రకటించింది యు.ఎస్‌.న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌. “ఇది చాలామట్టుకు రాకెటీర్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్‌ అండ్‌ కరప్ట్‌ ఆర్గనైజేషన్స్‌ యాక్ట్‌, లేక RICO అనే ఒకే ఒక్క శాసనం ఫలితమే” అని కూడా ఆ రిపోర్టు అంటుంది. ఈ చట్టం కేవలం వ్యక్తిగత కార్యకలాపం ఆధారంగా మాత్రమే కాక రాకెటీరింగ్‌ జరిగే పద్ధతి ఆధారంగా నేర సంస్థలపై నేరస్థాపన చేసేందుకు అనుమతిస్తోంది. ఇదీ, దీనితోపాటు టెలిఫోన్‌ టాపింగ్‌, గ్యాంగ్‌ సభ్యులలో ఉదార శిక్షను కోరుకునే ఇన్‌ఫార్మంట్లద్వారా సంపాదించిన సమాచారమూ అమెరికాలోని మాఫియాకు విరుద్ధంగా జరిగే పోరాటంలో విజయానికి దోహదపడ్డాయి.

ఇటలీలో కూడా అధికారులు గ్యాంగులమీదికి విరుచుకుపడుతున్నారు. సంస్థీకృత నేరం శక్తిమంతంగావున్న సిసిలీ, సార్డీనియా, కాలాబ్రియా వంటి ప్రాంతాల్లో నేర సంస్థల సభ్యుల దాడులను నివారించడానికి జనావాస భవనాలనూ, ముఖ్యమైన ప్రాంతాలనూ కావలికాయడానికి సైనిక సమూహాలు పంపించబడ్డాయి. ప్రభుత్వం ఇది ఓ అంతర్యుద్ధంలా ఉందన్నట్లే దృష్టిస్తోంది. నేర సిండికేట్ల పేరొందిన నాయకులు జైల్లో ఉండడంతోనూ, ఒక మాజీ ప్రధాన మంత్రిపై మాఫియాతో సంబంధాలున్నాయని నేరం మోపబడడంతోనూ ఇటలీ కొంత ఫలితాలను చూస్తోంది.

జపాన్‌లో, 1992, మార్చి 1న యాంటీ-ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ లాను అమలులోనికి తీసుకువచ్చినప్పుడు ప్రభుత్వం యాకూజాపై ఆంక్షలను విధించింది. ఈ శాసనం క్రింద, ఒక్కసారి ఏదైనా అల్లరిమూకతో కూడిన సంస్థ ఆ విధంగా నిర్ధారించబడిందటే, నోరు కట్టివేయడానికిచ్చే లంచం, సంరక్షణా ముఠాల్లో పాల్గొనడం, డబ్బుతీసుకుని వివాదాల్ని పరిష్కరించడానికి జోక్యంకలుగజేసుకోవడం వంటివి ఇమిడివున్న 11 హింసాత్మక బలాత్కారంతో కూడిన కార్యకలాపాలు కొనసాగించడం నుండి ఆ సంస్థ నిషేధించబడిందని అర్థం. ఈ శాసనాన్ని అమలుపర్చడంద్వారా ముఠాలకుండే ఆదాయ మూలాలన్నింటినీ అరికట్టాలని ప్రభుత్వం గురిగా పెట్టుకుంటుంది. ఈ శాసనం నేర సంస్థలన్నింటిపైనా గట్టి దెబ్బపడేలా చేసింది. కొన్ని గుంపులు చిన్నాభిన్నమయ్యాయి, ఒక నేర సంస్థకు చెందిన బాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు—దానికి కారణం ఆ శాసనం కచ్చితంగా అమలుచేయబడడమేనని స్పష్టమౌతుంది.

నిజానికి, ప్రభుత్వాలూ శాసనాన్ని అమలుపర్చే ఏజెన్సీలూ సంస్థీకృత నేరానికి వ్యతిరేకంగా గట్టిపోరాటాన్ని చేస్తున్నాయి. అయినా, 1994లో ప్రపంచం నలుమూలల నుండీ వచ్చిన జడ్జీలూ, పోలీసు అధికారుల సమావేశం గురించి నివేదిస్తూ మైనిచీ డైలీ న్యూస్‌ ఇలా అంది: “సంస్థీకృత నేరం సంవత్సరానికి దాదాపు ఒక లక్ష కోట్ల అమెరికా డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తూ ప్రపంచంలో దాదాపు ప్రతి భాగంలో శక్తిమంతంగానూ, సంపన్నంగానూ తయారౌతోంది.” విచారకరంగా, నేర సిండికేట్లను భూమ్మీదనుండి నిర్మూలించడంలోని మానవ ప్రయత్నాలు పరిమితంగానే ఉన్నాయి. దానికొక కారణం ఏమంటే అనేక కేసుల్లో న్యాయం త్వరితంగానూ, కచ్చితంగానూ జరగడం లేదు. చాలామంది ప్రజల విషయంలో శాసనం బాధితునికి అనుకూలంగా కాదు గానీ నేరస్థునికి అనుకూలంగా ఉన్నట్లుగా తరచూ అనిపిస్తోంది. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం బైబిలు ఇలా చెప్పింది: “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.”—ప్రసంగి 8:11.

నేర సంస్థలనుండి బయటికి రావడం

నేర సంస్థలపైన బయటినుండి విరుచుకుపడడానికితోడు, ప్రభుత్వాలు నేర సిండికేట్లలో ఉన్నవారు బయటికి రావడానికి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాయి. అటువంటి ప్రయత్నం సులభసాధ్యమైనది కాదు. ఒక పాత సామెత ప్రకారం, “మాఫియానుండి బయటికి రావడానికి దారి శవపేటికే.” ఒక గుండా ఒక యాకూజా సంస్థను విడిచిపెట్టాలంటే అతడు పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాలి లేకపోతే తన చిటికెన వ్రేలినో దానిలో కొంత భాగాన్నో కోసేయించుకోవాలి. చీకటి సామ్రాజ్యంతో తెగతెంపులు చేసుకోవడంలో ఇమిడివున్న భయానికి తోడు, ఒక మాజీ గుండా నిజాయితీతో కూడిన జీవితం జీవించడంలోని కఠోర వాస్తవాన్ని ఎదుర్కోవాలి. తరచూ అతని ఉద్యోగ దరఖాస్తులను త్రిప్పికొడతారు. అయితే, తెగతెంపులు చేసుకోవడానికి ప్రయత్నించేవారికీ, తర్వాత మర్యాదపూర్వకమైన ఉద్యోగాలను సంపాదించుకోవడంలో కష్టాన్ని ఎదుర్కొంటున్నవారికీ సహాయం చేయడానికి కొన్ని దేశాల్లో పోలీస్‌ హాట్‌ లైన్లు ఉన్నాయి.

గ్యాంగునుండి వచ్చే ఒత్తిళ్లనూ, సమాజం చూపించే దురభిమానాన్నీ ఎదుర్కోవడానికి ఒక గుండాకు నిజాయితీతో కూడిన జీవితాన్ని ప్రారంభించడానికి బలమైన ప్రేరేపణ ఉండాలి. ఆయనను ఏది కదిలించగలదు? అది తన కుటుంబం కొరకైన ప్రేమే కావచ్చు, శాంతియుతమైన జీవితం కొరకైన తీవ్రవాంఛయే కావచ్చు, లేక సరియైనది చేయాలనే కోరికే కావచ్చు. అయితే, అన్నింటికన్నా శక్తిమంతమైన ప్రేరేపణ ఈ సంచికలోని 26వ పేజీతో మొదలయ్యే యాసూవో కాటావోకా కథలో చక్కగా ప్రదర్శితమైంది.

యాసూవో కాటావోకా, తమ జీవితాల్ని సంపూర్ణంగా మార్చివేసుకున్న వందలాది మంది వంటివాడే. తాము మునుపు ప్రదర్శించిన మృగంలాంటి లక్షణాల స్థానంలో “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన” నూతన వ్యక్తిత్వం వచ్చింది. (ఎఫెసీయులు 4:24) ఇప్పుడు, మునుపు తోడేళ్లలా ఉన్న వ్యక్తులు దయాపూర్వకమైన, గొర్రెపిల్లల్లాంటి పౌరుల మధ్య శాంతితో నివసిస్తున్నారు.—యెషయా 11:6.

లోకాత్మ నుండి తెగతెంపులు చేసుకోండి

ముందటి శీర్షికలో పేర్కొనబడినట్లుగా, అదృశ్య అధికారియైన అపవాదియైన సాతాను క్రింద ఉన్నది నేర సిండికేట్లన్నీ మాత్రమే కాదు గానీ పూర్తి ప్రపంచమే ఆయన క్రింద ఉంది. ప్రజలు దానిని గ్రహించను కూడా గ్రహించరు, అయితే సాతాను తన నేర సంబంధ లక్ష్యాలను నెరవేర్చే విధంగా లోకాన్ని సంస్థీకరించాడు. నేర సిండికేట్లు సంపదనూ, మిథ్యా కుటుంబ వ్యవస్థనూ అందించినట్లే, ఆతడు ప్రజలకు ధనమూ, సౌఖ్యాలూ, దగ్గరితనపు భావనా వంటివి అందిస్తూ ఔదార్యవంతుడైన యజమాని పాత్రను పోషిస్తున్నాడు. మీరది గ్రహించలేకపోయినప్పటికీ, మీరు ఆతని దుష్ట పథకాలచే మోసపుచ్చబడి ఉంటారు. (రోమీయులు 1:28-32) ‘లోకముతో స్నేహము దేవునితో వైరము’ అని బైబిలు చెబుతుంది. (యాకోబు 4:4) సాతాను ప్రభావం క్రిందనున్న ఈ లోకంతో దగ్గరిసంబంధాలు పెట్టుకోవడం సురక్షితం కాదు. విశ్వ సృష్టికర్తదగ్గర యేసుక్రీస్తు క్రింద ఉన్న దేవదూతల సైన్యం ఉంది, వారు సాతానూ, వాని దయ్యాల దుష్ట ప్రభావంనుండి ఈ లోకాన్ని కాపాడడానికి వారిని చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నారు.—ప్రకటన 11:18; 16:14, 16; 20:1-3.

మరైతే మీరు సాతాను లోక ప్రభావం నుండి బయటికి ఎలా రాగలరు? అందరికీ దూరంగా ఉంటూ ఋషిలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా కాదు గానీ లోకంలో ప్రబలంగా ఉన్న ప్రవృత్తులనుండీ, మనో వైఖరులనుండీ శృంఖలాలను తెంచుకోవడం ద్వారానే మీరలా చేయగలరు. అలా చేయడానికి, మీరు సాతానుయొక్క భయపెట్టే కుయుక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి వాడు అందించే ప్రోత్సాహకాలను ఎదిరించాలి. (ఎఫెసీయులు 6:11, 12) ఇందులో త్యాగాలు చేయాల్సివుంటుంది, కానీ ఒకవేళ మీరు దృఢనిశ్చయం కల్గివుంటే, యెహోవాసాక్షులు అందించే సహాయానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకుంటే ఇతరుల్లాగే మీరూ స్వేచ్ఛను పొందవచ్చు.

నేరంతో నిండి అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకాన్ని శుభ్రపరచడానికి దేవుడు చర్యగైకొన్న తర్వాత ఏమి జరుగుతుంది? “భక్తిహీనుల సంతానము నిర్మూలమగును” అని చెబుతూ, బైబిలు ఇంకా ఇలా కొనసాగిస్తోంది, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:28, 29) అప్పుడు, మృగంలాంటి లక్షణాలుండే వారికి ఏమాత్రం భయపడనవసరం లేదు, ఎందుకంటే వారు “యెహోవాను గూర్చిన జ్ఞానము” ద్వారా పరివర్తనం చెందివుంటారు, ఆ జ్ఞానంతో భూమి నిండిపోతుంది.—యెషయా 11:9; యెహెజ్కేలు 34:28.

నేడు అటువంటి పరివర్తనం ఇప్పటికే ఒక వాస్తవమైంది. జపాన్‌లోని ఒక మాజీ యాకూజా అయిన ఒక వ్యక్తి జీవిత కథ దీన్ని చూపిస్తోంది. ఈ సంచికలోని 26వ పేజీతో ఆ జీవిత కథ మొదలౌతుంది.

[10వ పేజీలోని చిత్రం]

దేవుని నూతన లోకంలో, అందరూ తమ స్వహస్తాలతో చేసే పనిలో ఆనందాన్ని అనుభవిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి