కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 30-31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవహక్కుల పరిస్థితి: “దుఃఖకరమగుచున్నది”
  • ఫలసేకరణా రోబట్‌
  • నిద్రలేనివారికి సహాయం
  • వెలుపటి దృశ్యాన్ని చూస్తూ పనిచేయడంలోగల విలువ
  • స్త్రీలపై దౌర్జన్యం
  • మానవజాతిలో అధికభాగాన్ని క్షామం పీడిస్తోంది
  • సంచలనాత్మకమైన రీతిలో పెరుగుతున్న ఆదాయం
  • పిల్లల ఉద్యోగ విఫణి
  • వేలాది మొక్కలు అలక్ష్యం చేయబడ్డాయి
  • ఎయిడ్స్‌ కలుషిత రక్తంవల్ల అపాయములు
  • బుద్ధికుశలతగల బొమ్మలు
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
  • పిల్లలు—లాభమా నష్టమా?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 30-31

ప్రపంచ పరిశీలన

మానవహక్కుల పరిస్థితి: “దుఃఖకరమగుచున్నది”

“మానవహక్కులను గౌరవించడం మానవత్వ భవిష్యత్‌ ఉనికికే అగ్నిపరీక్ష,” అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవ హక్కుల ఒక కాన్ఫెరెన్సు నందు మానవహక్కుల కోసం సహాయ ప్రధానకార్యదర్శి అయిన ఇబ్రహీం ఫొల్‌ పేర్కొన్నారు. “అయినా అనేక (దేశాలలో), మానవ హక్కుల హింసాత్మక స్థాయి దుఃఖకరమైన రీతిలో కొనసాగుతుంది,” అని ఆయన అన్నారు. వరల్డ్‌ కాన్ఫెరెన్సు ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌, నేడు మానవ హక్కుల ఉల్లంఘన మూలంగా ప్రపంచ జనాబాలో కనీసం సగం మంది బాధననుభవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వార్తాలేఖ స్థిరపరుస్తుంది. మిస్టర్‌ ఫొల్‌ ఇంకా ఇలా అన్నారు: “మరణం, వినాశనం, పక్షపాతం, పేదరికం, హింస, అత్యాచారం, బానిసత్వం, ఆకలి మంటలు, మరియు ఎదుగూబొదుగూ లేని లేక కుంటుపడిన జీవితాలు లక్షలాదిమంది ప్రజల ప్రతిదిన శాపంగా మిగిలాయి.” మరీహీనమైనదేమిటంటే, “హక్కుల సమస్యలు నింగికెగుస్తున్నందు వల్ల శాపం వ్యాపిస్తుందని,” ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నది. (g94 7/8)

ఫలసేకరణా రోబట్‌

ఇటలీ వ్యవసాయక సాంకేతిక పరిజ్ఞానంలో ఇటీవలి క్రొత్తమార్పు ఏమంటే, “దాదాపు 2,500 నారింజ పండ్లను ఒక గంటలో నేరుగా చెట్లనుండి,” కోయగల సామర్థ్యమున్న ఒక కంప్యూటరైజ్డ్‌ రోబట్‌. ఈ యంత్రం ఎనిమిది “మిక్కిలి సున్నితమైన” యాంత్రిక చేతులను కలిగి, ప్రతిదీ ఒక ఎలక్ట్రానిక్‌ కన్నుతో (మానవ దృష్ఠిని పోలిన విధాన మందు పనిచేసే సాధనం) సమకూర్చబడి సిద్ధపర్చబడింది, మరియు ల స్థాంప్‌ తెల్పిన ప్రకారంగా “పక్వానికొచ్చిన రంగును తెలుసుకోడానికి,” మరియు “కోయదగిన ఫలాన్ని,” ఎన్నుకొని మరియు “కోయదగని దానిని బలహీనమైన వాటిగా భావించి పొరపాటుపడకుండా వాటిని దాటిపోవడానికి,” అది ప్రోగ్రామ్‌ చేయబడింది. పట్టాలపై అమర్చబడిన రోబట్‌ “డీజిల్‌ ఇంజన్‌ శక్తితో పనిచేస్తూ వాతావరణం బాగాలేనప్పుడు సహితం రేయింబగళ్లు పని చేయగలదు మరియు మూడు నుండి మూడున్నర మీటర్ల ఎత్తున్న చెట్లపైనున్న నారింజ పండ్లను కోయగలుగుతుంది. . . . వాటిని కోసే సమయంలో, గంటకు 8 కిలోమీటర్ల [5 మైళ్లు] వేగంతో కదుల్తుంది. మరియు గంటకు 14 కిలోమీటర్ల [9 మైళ్లు] ప్రయాణవేగాన్ని కల్గివుండి, దాదాపు 500 కిలోల [1,100 పౌన్లు] వరకు తీసుకొనివెళ్లగల్గే జతచేయబడిన ఒక తొట్టిని కల్గివుంది.” (g94 7/8)

నిద్రలేనివారికి సహాయం

గంభీరమైన నిద్రలేమి బాధననుభవిస్తున్న ప్రజల కోసం సంకలనం చేయబడిన ఒక సలహాల పట్టిక హార్‌వర్డ్‌ మెడికల్‌ పాఠశాల నందలి పరిశోధకుల వద్దవుంది. ది హార్‌వర్డ్‌ మెంటల్‌ హెల్త్‌ లెటర్‌ ప్రకారం, నిద్రపోవడానికి సుమారు 80 నిమిషాలు వెచ్చించాల్సిన రోగుల గుంపు గణనీయమైన అభివృద్ధిని సాధించగల్గారు. అనేక వారముల చికిత్స తరువాత, “వారు నిద్రపోవడానికి సగటున కేవలం పందొమ్మిది నిమిషాలే పట్టిందని,” ఆ లెటరు తెల్పుతోంది. సిఫారసు చేయబడిన పద్ధతులు ఇలా ఉన్నాయి: పడకమీద ఏడు గంటలకన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించడం మానివేయండి; మీరు నిద్రపోయే సగటు సమయం కన్నా ఒక గంటకు మించి ఎక్కువసేపు పడక మీదవుండొద్దు; ప్రతిదినము, వారాంతములలో సహితం ఒకేవేళకు లేవండి; నిద్రవస్తున్నప్పుడే పడకమీదకు వెళ్లండి; పడకమీదకు వెళ్లిన తరువాత 20 నిమిషాల వరకు నిద్రరాకపోతే లేచి, మీకు నిద్రవచ్చేంతవరకు ఆహ్లాదకరంగా ఉండే ఏదో ఒకటి చేయండి. (g94 6/22)

వెలుపటి దృశ్యాన్ని చూస్తూ పనిచేయడంలోగల విలువ

అమెరికా నందలి మిచిగన్‌ విశ్వవిద్యాలయమందలి పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పనిచేయు స్థలమందు కార్మికులు బయటి దృశ్యాలను చూస్తూ పని చేయడం మెరుగయ్యింది. ప్రఖ్యాతిగాంచిన నమ్మకానికి విరుద్ధంగా, అలా బయటికి చూస్తూ పనిచేయడం తప్పనిసరిగా పగటికలలను ప్రోత్సహించదు. “వెలుపటి దృశ్యాన్ని చూస్తూ పనిచేసే పనివాళ్లు తమ ఉద్యోగముల యెడల మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించారని, ఎక్కువ కలతచెందలేదని, ఎంతో ఓర్పును, శ్రేష్ఠమైన ఏకాగ్రతను, మరియు కొద్దిపాటి భౌతిక రుగ్మతలనే కల్గివున్నారని,” 1,200 మంది వ్యక్తుల సర్వే వెల్లడి చేసిందని బిజినెస్‌ వీక్‌ అనే పత్రిక చెబుతోంది. దీనికి విభిన్నంగా, కిటికీలులేని చిన్నచిన్న గదులలో పనిచేసే పనివాళ్లు “తక్కువ మానసికసామర్థ్యం, ఎక్కువ చికాకు” గలవారిగా ఉండి ఏకాగ్రతను ప్రదర్శించడంలో అనేకమైన సమస్యలను కల్గివున్నారు. (g94 6/22)

స్త్రీలపై దౌర్జన్యం

ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ ప్రకారంగా, కెనడా స్త్రీలలో 51 శాతం మంది 16 సంవత్సరాలు లేక ఆపై వయస్కులు, వయస్సు వచ్చిన తరువాత కనీసమొక్కసారైనా పురుష బలత్కారుల బాధితులవుతున్నారని ఇటీవల ఒక సర్వే వెల్లడిచేస్తోంది. ఇంటర్‌వ్యూ చేయబడిన స్త్రీలలో దాదాపు సగంమంది “బాయ్‌ఫ్రెండ్స్‌, భర్తలు, స్నేహితులు, కుటుంబసభ్యులు లేక వారికి బాగా పరిచయమున్న ఇతర పురుషుల నుండి దాడులు వచ్చాయని చెప్పారని,” ఈ కెనడా వార్తాపత్రిక నివేదించింది. సర్వేచేయబడిన స్త్రీలలో పది శాతం మంది గత సంవత్సరమందే గురయ్యారు మరియు దాడిచేయబడిన ప్రతి ఐదుగురిలో ఒకరు భౌతికంగా గాయపడేంత తీవ్రంగా గురయ్యారు. తమ భర్తలు లేక తమతోవున్న పురుష భాగస్వాములు తమను త్రోసారనీ, అకస్మాత్తుగా దాడిచేసారనీ, గెంటారనీ, చేతితో కొట్టారనీ, కాలితోతన్నారనీ, బాధించారనీ, లేక దెబ్బలు కొట్టారనీ అనేకమంది స్త్రీలు నివేదించారు. (g94 6/22)

మానవజాతిలో అధికభాగాన్ని క్షామం పీడిస్తోంది

మానవులను పోషించడానికి సరిపడేంత ఆహారాన్ని భూమి మునుపెన్నడూ యింత అధికంగా ఉత్పత్తి చేయలేదు. అయినా, మానవజాతిలో క్షామ పీడితులు ఇంత అధికంగా మునుపెన్నడూ లేరు. ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన ఇటీవల గణాంకాల ప్రకారంగా, మరెన్నడూ లేనంతగా, 1990 నందు దాదాపు 113 కోట్లమంది వ్యక్తుల జీవితాలను క్షామం తన పిడికిలిలో బిగించింది. ఇది అభివృద్ధిచెందుతున్న దేశాలలో జీవించుచున్న ప్రజలలో దాదాపు 30 శాతంపై ప్రభావాన్ని చూపింది. క్షామంచేత బాధింపబడుతున్న 56.2 కోట్ల (జనాబాలో 49 శాతం) ప్రజలుగల దక్షిణాసియా, 21.6 కోట్లమంది (జనాబాలో 47.8 శాతం) ప్రజలతో ఆఫ్రికా, 7.3 కోట్లమందితో (జనాబాలో 33.1 శాతం) తూర్పుకు సమీపంగావున్న ఆఫ్రికా మరియు ఉత్తర ఆఫ్రికా, 10.8 కోట్లమందితో (జనాబాలో 25.2 శాతం) లాటిన్‌ అమెరికా మరియు కారేబియన్లు ప్రపంచంలో మిక్కిలి దారుణంగా ప్రభావితమైన ప్రాంతములు. పౌష్ఠికాహారలోపం వల్ల బాధింపబడుతున్న దాదాపు వందకోట్లమంది వ్యక్తులు ఈ సంఖ్యలలో చేరలేదు. (g94 7/8)

సంచలనాత్మకమైన రీతిలో పెరుగుతున్న ఆదాయం

జర్మనీ నందలి పారాసైన్సెస్‌కి సంబంధించిన వైజ్ఞానిక పరిశోధనా అసోసియేషన్‌ 1993వ సంవత్సరారంభంలో, జ్యోతిష్కులు తయారు చేసిన 70 భవిష్యత్‌ విషయాలను సమకూర్చి సంవత్సరాంతమున ఫలితాలను అంచనా వేసింది. గడచిన సంవత్సరాలలో భవిష్యత్‌ విషయాల వైఫల్యాల దృష్ట్యా (అవేక్‌! జూన్‌ 8, 1992, పేజీ 29, మరియు జూలై 8, 1993, పేజీ 29 చూడండి), 1993 నందు జ్యోతిష్కులు మరింత సఫలులయ్యారా? వారు “అనేక అబద్ధాలను చెప్పారని,” నాస్‌సహుయిచ్‌ న్యూయి ప్రెస్‌ నివేదిస్తుంది. “తమ స్వంత వార్షిక ప్రవచనాలను అనేకమంది జ్యోతిష్కులు విశ్వసించరని,” ఆ అసోసియేషన్‌ ప్రతినిధి చెప్పాడు. అయినను జర్మనీ నందు జ్యోతిశ్శాస్త్రం 5.7 కోట్లడాలర్ల (10 కోట్ల డచ్‌ మార్కుల) వార్షికమొత్తంతో పెద్ద వ్యాపారంగా కొనసాగుతోంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి సంచలనాత్మకమైన జోస్యాలను “వార్తా శీర్షికలలో ప్రచురించడమే ఒక ప్రభావవంతమైన మార్గం,”గా అనేకమంది జ్యోతిష్కులు పరిగణిస్తున్నారని వార్తాపత్రిక నివేదిస్తుంది. (g94 7/8)

పిల్లల ఉద్యోగ విఫణి

బ్రెజిల్‌ నందు 80 లక్షలమంది పిల్లలు ఉద్యోగ విఫణిని హస్తగతం చేసుకున్నారని, ఓ ఇష్టాడో డి సావో పౌలో నివేదిస్తుంది. వయోజనులు చేసే పనినే ఈ పిల్లలు చేస్తున్నారు. తరుచుగా వారికి తక్కువ చెల్లిస్తున్నారు, అయినా, వారు కుటుంబ ఆదాయానికి కొంతమట్టుకు తోడ్పడుతున్నారు. బహుశ, ఈ పిన్న కార్మికులకు తగిన పాఠశాల వసతిలేనందున సగం విద్యావంతులుగా (చదవగలరు గాని వ్రాయలేరు) మిగిలి, తమ తల్లిదండ్రులవలే బీదవారిగా ఉన్నారు. అంతేకాకుండా, ది మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌కు చెందిన లూయిజ్‌ క్లౌడియో డి వాస్కోన్‌సాలొస్‌ ఏమంటున్నాడంటే, “పెద్దవారి వేతనంలో మూడవ భాగాన్ని తీసుకోవడానికి పిల్లవాడు ఇష్టపడుతున్నందున, వేరే కుటుంబములోని పెద్దవాళ్లు ఉద్యోగములను కోల్పోవడానికి కారణమౌతున్నాడు.” (g94 7/8)

వేలాది మొక్కలు అలక్ష్యం చేయబడ్డాయి

“చరిత్రలో మానవుల ఆహారం కోసం అనేక వేలమొక్కల జాతులు ఉపయోగింపబడుతున్నాయి, అయినా ఇప్పుడు సుమారు 150 మాత్రమే సాగుచేయబడుతున్నాయి మరియు మొక్కల నుండి వచ్చిన కేలరీలు, ప్రోటీన్లలో దాదాపు 60 శాతాన్ని మూడు మొక్కలకన్నా ఎక్కువేమీ అందించడంలేదని,” ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయిక సంస్థ చెబుతోంది. అంతర్జాతీయ వ్యవసాయక అధ్యయనాలు దీనిని బలపర్చాయి. మానవులకు పరిచయమున్న ముఖ్య సరుకులకు వారు అంటిపెట్టుకొని—బియ్యం, జొన్న, మరియు గోధుమ—ప్రకృతినందు దొరికే వేలాది ఇతర పోషకాహార మొక్కలను అలక్ష్యం చేస్తున్నారు. (g94 6/22)

ఎయిడ్స్‌ కలుషిత రక్తంవల్ల అపాయములు

వైద్యసిబ్బందికి హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షన్‌ రక్తం వల్ల ప్రమాదాలు ఎన్ని జరిగాయో నివేదికలను అందించమని జపాన్‌ ఆరోగ్య సంక్షేమశాఖ ఆసుపత్రులను కోరింది. ప్రత్యేకముగా గత పది సంవత్సరముల కాలంలో జరిగిన ప్రమాదాలపైనే శ్రద్ధనుంచారు. ది డైలీ యోమూరీ తెల్పినట్లు, “రక్త సంబంధిత ప్రమాదాలుగల 2,997 కేసులతో పాటు సూదుల వలన వచ్చిన ప్రమాదాల మొత్తం సంఖ్య 12,914” అని 276 ఆసుపత్రులు నివేదికను అందించాయి. వీటిలో ఒక వందకుపైగా హెచ్‌.ఐ.వి. కలుషిత రక్త కేసులున్నాయి. ఈ ప్రమాదాలకు గురైన వారందరు ఎయిడ్స్‌ వైరస్‌ హెచ్‌.ఐ.వి. లేదనే నిర్థారణ పరీక్షలను బాగా చేయించుకున్నవారే. (g94 6/22)

బుద్ధికుశలతగల బొమ్మలు

“భవిష్యత్తులో పెరగబోయే పోటీకోసం కృత్రిమమైన వినోదమందు తల్లిదండ్రుల వర్తకంగా నైపుణ్యాలను బోధించే బొమ్మలు విస్తృతంగా అమ్ముడు పోయాయని,” ఒక కెనడా వార్తా పత్రికయిన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ గుర్తించింది. “వినోదం కోసమే ఆడే బొమ్మలతో,” ఆడకుండా తమ పిల్లలను, తల్లిదండ్రులు ఆటంకపరుస్తున్నారు. బదులుగా “నైపుణ్యాలను బోధించే సామర్థ్యమున్న అనుకూలమైన వాటితో ఆటలాడే ప్రతిక్షణం పూర్తిగా నిమగ్నమైయుండాలని వారు కోరారని,” ఆ నివేదిక తెలియజేస్తుంది. అత్యున్నతమైన స్థాయిలో జ్ఞానాన్ని మరియు మంచి నిపుణతా సామర్థ్యాలను ఈ ఊపు ఉత్పన్నం చేయవచ్చని అనేకుల నమ్మకమైయుండగా, కొంతమంది ఏకీభవించడం లేదు. పిల్లల విలువైన వ్యవస్థీకరింపబడని ఆట సమయాన్ని దోచుకోవడం వారి సృజనాత్మకతను అణిచి వేస్తుందని, “మరియు చివరికి వారు నేర్చుకొనేది తక్కువేనని,” వారు భావించారని, ఆ వార్తాపత్రిక చెబుతోంది. (g94 6/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి