“వ్రాయబడిన విధానం అద్భుతం”
వాచ్‌టవర్ సొసైటీకి, అమెరికాలోని కాలిఫోర్నియానుండి ఒక పాఠకురాలు ప్రశంసతో ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ:
“ఇటీవల వచ్చిన పత్రికలను చదువుతున్నపుడు నేను ఎంతో ఆనందిస్తున్నాను, తేజరిల్లు! ‘ఒంటరితనము—దీన్ని గూర్చి నీవేం చేయగలవు’ (జనవరి 8, 1994) అనే శీర్షిక నేను ఉత్తరాన్ని వ్రాయటానికి పురికొల్పింది. వ్రాయబడిన విధానం అద్భుతం, ఒంటరితనముపై వ్రాయబడిన శీర్షికలు ఎంతో చక్కగా వ్రాయబడి కావ్యరూపంలో వున్నాయి. ఇదికాక, ఒంటరితనమునుగూర్చిన బాధ్యత అనేది ఆ ఒంటరి వ్యక్తిపైననే ఉంచుటలోని నిజాయితీని నేను ప్రశంసిస్తున్నాను. నిజంగా ఈ శీర్షికలు యెహోవాయొక్క ప్రగాఢమైన ప్రేమను, తన ప్రజలపై ఆయన కలిగియున్న శ్రద్ధతోకూడిన ఆసక్తిని వ్యక్తపరుస్తున్నాయి.”
యెహోవాసాక్షులు కావలికోట మరియు తేజరిల్లు! అనే పత్రికలు ప్రపంచవ్యాప్తముగా పంచిపెడుతున్నారు. మొదటిది, బైబిలు ఆధారిత చర్చలను సమయోచిత శీర్షికలతో, 115 భాషల్లో ప్రచురింపబడుతూ, సగటున ప్రతి సంచిక 1.6 కోట్ల ప్రతులు ముద్రింపబడుతున్నాయి. రెండవది, చాలామందికి తెలిసిన విషయాల్ని విద్యాపరమైన సమాచారముగా అందిస్తూ, సగటున ప్రతి సంచిక 1.3 కోట్ల ప్రతులు ఇప్పుడు 73 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
మీరుకూడా ఈ పత్రికలను పొందటానికి ఇష్టపడుతుంటే, దయచేసి మీకు దగ్గర ప్రాంతములోని రాజ్యమందిరంలో యెహోవాసాక్షులను సంప్రదించండి, లేదా 5వ పేజీలోని మీకు తగిన చిరునామాకు వ్రాయండి.