కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 28-29
  • అపొస్తలుడైన పౌలు స్త్రీలకు వ్యతిరేకియా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపొస్తలుడైన పౌలు స్త్రీలకు వ్యతిరేకియా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు అధికారపత్రాలు
  • పౌలు పత్రికల్లో స్త్రీలు
  • స్త్రీవ్యతిరేక పక్షపాత వైఖరా?
  • “స్త్రీలు . . . మౌనముగా ఉండాలి”
  • స్త్రీపురుషులు వారి గౌరవప్రదమైన పాత్రలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు
    కావలికోట: దేవుడు స్త్రీలను పట్టించుకుంటాడా?
  • నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు —దేవుని ప్రశస్త ఆరాధకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 28-29

బైబిలు ఉద్దేశము

అపొస్తలుడైన పౌలు స్త్రీలకు వ్యతిరేకియా?

అపొస్తలుడైన పౌలు బోధలు “క్రైస్తవ . . . చర్చిలోనే పక్షపాతమును చూపు విధముగా స్త్రీలకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నవి.” అని 1993లో న్యూజీలాండ్‌కు చెందిన ఆక్లాండ్‌ నివాసి జడ్జి సెసిలె రష్టన్‌ 1993లో సైప్రస్‌నందు జరిగిన కామన్‌వెల్త్‌ న్యాయ సభకు సమర్పించిన పత్రంలో పేర్కొన్నది. “ఆయన ఆలోచనను తిమోతికి వ్రాసిన లేఖ బయలుపరుస్తున్నది” అని ఆమె అన్నది. ‘స్త్రీని బోధించవద్దు అన్నందుకుకాదు, లేదా పురుషుని నుండి అధికారమును అపహరించనందుకు కాదు, కాని మౌనముగా ఉండమని చెప్పినందుకు నేను బాధపడుతున్నాను.’—1 తిమోతి 2:12, కింగ్స్‌ జేమ్స్‌ వర్షన్‌.

పౌలు స్త్రీలయొక్క స్థానాన్నిగూర్చి, పాత్రనుగూర్చి ఎంతో మర్యాదగా వ్రాస్తున్నపుడు, ఆయన కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరస్తున్నాడా, లేదా ఆయన దైవిక ప్రేరణతో వ్రాస్తున్నాడా? ఆయన లేఖలలోగాని, లేదా ఉత్తరాలలోగాని, మొత్తంమ్మీద పౌలు వాస్తవంగా స్త్రీవ్యతిరేక పక్షపాతవైఖరిని కనపర్చాడా? పౌలు తిమోతికి ఏ సంబంధంతో పై మాటలను ఉదహరించి చెబుతున్నాడు, వాటి అన్వయమేమిటి?

పౌలు అధికారపత్రాలు

క్రైస్తవ గ్రీకు లేఖనాలందు 27 పుస్తకాల్లో, 14 పౌలు వ్రాసినవే. ఆయన అద్భుతమైన సామర్థ్యంతో అనేకమైన భాషలను మాట్లాడుటకు పరిశుద్ధాత్మ క్రియను జరిగించెనని సూచించుచున్నది. అదనంగా, ఆయన దర్శనములనుగూర్చి కూడ సాక్ష్యమిచ్చాడు. (1 కొరింథీయులు 14:18; 2 కొరింథీయులు 12:1-5) ఆయన స్వయం-త్యాగం, పూర్ణాత్మ మరియు ప్రేమతోకూడిన మాదిరి తనకు, తోటి క్రైస్తవ సమకాలికుల మధ్య ఒక దగ్గరి సంబంధాన్ని కల్గించింది. (అపొస్తలుల కార్యములు 20:37, 38) ఆయన వ్రాతలు, స్త్రీలనుగూర్చి ఆయన చెప్పిన దానితో సహా అవన్నీ, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును . . . ప్రయోజనకరమై యున్నవి” అని చెప్పబడిన దానిలోని భాగమే.—2 తిమోతి 3:16.

పౌలు పత్రికల్లో స్త్రీలు

స్త్రీలయెడల పౌలు గుర్తింపు మరియు ఆదరణకూడా ఆయన వ్రాతలన్నింటిలో కావలసినంత సాక్ష్యాన్ని కలిగివున్నాయి. కుటుంబంలోను మరియు సంఘంలోను వీరు వహించే వివిధ పాత్రలగూర్చి ఆయన పదేపదే పేర్కొన్నాడు. ఆయన పత్రికలలో ఒకదానియందు, ఒక క్రైస్తవకాపరికి ఉండాల్సిన కోరదగిన లక్షణాలను స్తన్యమిచ్చు తల్లికుండు లక్షణాలతో పోల్చాడు.—1 థెస్సలొనీకయులు 2:7.

అనేకమంది అపొస్తలుల క్రైస్తవ సహోదరీలను, తన లేఖల్లో వారిని పేరుపేరున పేర్కొని రోములోని సంఘ సభ్యులకు ఆయన తన అభివాదములు తెలిపినవారిలో వారిని మెచ్చుకున్నాడు. “ప్రభువునందు బహూగా ప్రయాసపడిన” కొంతమంది స్త్రీలకు ప్రత్యేకించి వ్రాసినవారుకూడా వున్నారు. (రోమీయులు 16:12) యువొదియను, సుంటుకేను వివరిస్తూ, “ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని” ఫిలిప్పీలోనున్న సహోదరులను ప్రోత్సహించాడు. (ఫిలిప్పీయులు 4:3) తిమోతికి వ్రాసిన పత్రికలో, ఆ యౌవనస్థుని అవ్వయైన లోయి మరియు తల్లియైన యునీకే ప్రదర్శించిన మాదిరికరమైన విశ్వాసాన్నిగూర్చి మాట్లాడాడు.—2 తిమోతి 1:5.

మరి, క్రైస్తవ సహోదరీలు పౌలునుగూర్చి ఏవిధంగా భావించారనే సూచన ఏమైనా ఉన్నదా? కృతజ్ఞతా పూర్వకంగా, వివాహజతయైన అకుల మరియు ప్రిస్కిల్లతో తనకున్న సన్నిహిత వ్యక్తిగత సహవాసమునుగూర్చి సాక్ష్యమిచ్చాడు. ఆయన ఒక్క అకులతో మాత్రమేకాదు, ప్రిస్కిల్లనుగూర్చి చెపుతూ, “వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి,” అని ఆయన వ్రాశాడు.—రోమీయులు 16:3, 4.

స్త్రీవ్యతిరేక పక్షపాత వైఖరా?

“వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధస్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవనస్త్రీలను హెచ్చరింపుము.” (1 తిమోతి 5:1, 2) తిమోతికి పౌలు వ్రాసిన ఈ మాటలలో స్త్రీజాతిపట్ల ఆయనకున్న సంపూర్ణ గౌరవము ప్రతిబింబించుటలేదా? క్రైస్తవ సంఘంలో స్త్రీపురుషులకు ఇద్దరికి సమానమైన సన్మానాన్ని నియమించాడు. “యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు” అని ఆయన వ్రాశాడు.—గలతీయులు 3:28.

వివాహబంధంలో దేవుడు నియమించిన కార్యభారాన్ని గౌరవము, పౌలు యిలా వ్రాశాడు: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు.” (ఎఫెసీయులు 5:22, 23; 1 కొరింథీయులు 11:3కు పోల్చండి.) ఔను, భర్తకు, భార్యకుయివ్వబడిన మర్యాదపూర్వకమైన కార్యభారాలలో వ్యత్యాసమున్నప్పటికి, అందులో ఒకరికి తక్కువ హోదాను యిచ్చినట్లుకాదు. పాత్రలు ప్రశంసనీయమైనవి, అంతేకాకుండా ప్రతిపాత్రకు ఓ సవాలుంటుంది; దాన్ని ఎదురుకోగల్గితే అప్పుడది కుటుంబ శ్రేయస్సుకు సహాయపడుతుంది. ఇంకా ఎక్కువగా, భర్త తన శిరస్సత్వాన్ని చూపుతూ, ప్రేమలేకుండా, అణిచివేసే విధంగా ఉండకూడదు. పౌలు యిలా అంటున్నాడు: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు” అంటే వారికొరకు ఇష్టపూర్వకముగా అనేకమైన త్యాగాలను చేయవలసియున్నారు. (ఎఫెసీయులు 5:28, 29) పిల్లలు మాత్రం తల్లిదండ్రులిద్దరికి లోబడియుండాలి.—ఎఫెసీయులు 6:1, 2.

వైవాహిక అన్యోన్యతల విషయంలో పౌలు పలికిన మాటలిక్కడ గమనించదగినవే. పక్షపాతములేనివానిగా పౌలు ఇలా వ్రాస్తూ: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకేగాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.”—1 కొరింథీయులు 7:3, 4.

“స్త్రీలు . . . మౌనముగా ఉండాలి”

మొదటి పేరాలో పేర్కొనబడిన 1 తిమోతి 2:12, లోని పౌలు మాటల దృష్ట్యా, స్త్రీలు ‘మౌనంగా ఉండాలి’ అని ఆయన చెప్పినప్పుడు అది స్త్రీలకు వ్యతిరేకంగా ఉండే పక్షపాత వైఖరి నుండి ఉద్భవించిందా? లేదు! “మౌనముగా” ఉండాలని అంటే సంఘంలో బోధించడానికి లేదా ఆత్మీయ అధికారం నిర్వహించడానికి సంబంధించినది. దైవికంగా సిఫారసు చేయబడి స్త్రీపురుషుల సంబంధాన్ని గౌరవిస్తూనే ఉంది యిది.a

స్త్రీలు దైవిక సత్యాలను బోధించకూడదని దాని భావంకాదు. వృద్ధస్త్రీలు, యౌవనస్త్రీలకు “మంచి ఉపదేశము చేయువారునై” ఉండాలని పౌలు ప్రోత్సహించాడు. యునీకే మరియు లోయిల మాదిరి గమనిస్తే, వాళ్లు తిమోతికి ఉపదేశించిన దానినిబట్టి, క్రైస్తవ తల్లులు తమ పిల్లలకు దైవికమార్గంలో తర్ఫీదునిస్తూ పెంచాలి. (తీతు 2:3-5; 2 తిమోతి 1:5) ఈనాడు కూడా, యెహోవాసాక్షుల సంఘాలల్లో, లక్షలాదిమంది క్రైస్తవ స్త్రీలు, యువొదియ, సుంటుకేల మాదిరిని అనుకరించడంలో, బహిరంగంగా సువార్తను ప్రకటిస్తూ, స్త్రీపురుషులను శిష్యులుగా తయారుచేస్తూ, ఆత్మీయ నెరవేర్పును కలిగియున్నారు.—కీర్తన 68:11; మత్తయి 28:20; ఫిలిప్పీయులు 4:2, 3.

అయితే, మీ అంచనా ఏమిటి? పౌలు వ్రాతలను ఆద్యంతం పరిశీలించి చూస్తే, అవి స్త్రీవ్యతిరేక పక్షపాతవైఖరిని సమర్థిస్తున్నాయా?

[అధస్సూచీలు]

a మొదటి తిమోతి 2:11,లో “పూర్తిగా విధేయత” అని చెప్పబడిన రీతినిగూర్చి, బైబిలు స్కాలర్‌ డబ్ల్యు. యి. వైన్‌ వివరిస్తూ: “ఈ ఉత్తర్వు నేరుగా మనస్సును మరియు అంతరాత్మను పూర్తిగా అర్పించమని, వ్యక్తిగత తీర్పులో కర్తవ్యాన్ని వదులుకోమని చెప్పటంలేదుగాని; ఈ పదము ‘విధేయత అంతటిలో’ అనగా ఉదాహరణకు క్రింది వచనం ప్రకారంగా, అధికారమును అపహరించుటను హెచ్చరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి