కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 144
  • శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • శవదహనం గురించి ఉన్న అపోహలు
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • తిరిగి మంటికి చేరడం—ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మృతులు గౌరవించబడాలా?
    తేజరిల్లు!—1999
  • “పాదాలకు కాదు, నోటికి ఆహారాన్ని అందించండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 144
అస్థికల్ని భద్రపరిచే పాత్ర, పక్కన చనిపోయిన వ్యక్తి ఫోటో

శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

శవదహనానికి సంబంధించిన స్పష్టమైన నిర్దేశం ఏదీ బైబిల్లో లేదు. చనిపోయినవాళ్లను పాతిపెట్టాలనే లేక దహనం చేయాలనే ఆజ్ఞ కూడా బైబిల్లో లేదు.

అయితే బైబిల్లో, దేవుని నమ్మకమైన సేవకులు తమ ప్రియమైనవారి మృతదేహాల్ని పాతిపెట్టిన వృత్తాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, అబ్రాహాము తన భార్యయైన శారా మృతదేహాన్ని పాతిపెట్టే స్థలాన్ని సంపాదించడానికి ఎంతో కృషిచేశాడు.—ఆదికాండము 23:2-20; 49:29-32.

బైబిల్లో, నమ్మకమైన సేవకులు మృతదేహాల్ని దహించిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన సౌలు, ఆయన ముగ్గురు కుమారులు యుద్ధంలో చనిపోయారు. అయితే వాళ్ల మృతదేహాలు శత్రుదేశంలో ఉన్నాయని, శత్రువులు వాటిని అగౌరవపరుస్తున్నారని ఇశ్రాయేలు నమ్మకమైన యోధులకు తెలిసింది. దాంతో వాళ్లు సౌలు, ఆయన కుమారుల మృతదేహాల్ని తీసుకొచ్చి, వాటిని దహించి, అవశేషాల్ని పాతిపెట్టారు. (1 సమూయేలు 31:8-13) ఆ పద్ధతి ఆమోదయోగ్యమైనదేనని బైబిలు సూచిస్తోంది.—2 సమూయేలు 2:4-6.

శవదహనం గురించి ఉన్న అపోహలు

అపోహ: శవదహనం చేస్తే మానవ శరీరాన్ని అగౌరవపర్చినట్లు అవుతుంది.

నిజం: చనిపోయినవాళ్లు తిరిగి మట్టిలో కలిసిపోతారని బైబిలు చెప్తుంది. సాధారణంగా మృతదేహం కుళ్లిపోయిన తర్వాత అదే జరుగుతుంది. (ఆదికాండము 3:19) కాకపోతే శవదహనం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే శరీరం బూడిద అవుతుంది కాబట్టి అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది.

అపోహ: బైబిలు కాలాల్లో, దేవుని అనుగ్రహం లేనివాళ్ల మృతదేహాల్ని మాత్రమే దహనం చేసేవాళ్లు.

నిజం: ఆకాను, ఆయన కుటుంబసభ్యులు వంటి కొంతమంది నమ్మకంగాలేని ప్రజల మృతదేహాల్ని అగ్నితో కాల్చేశారు. (యెహోషువ 7:25) అయితే అది వాళ్ల విషయంలో అలా జరిగిందే తప్ప, దేవుని అనుగ్రహం లేనివాళ్ల మృతదేహాల్ని మాత్రమే దహనం చేయాలనే నియమమేమీ లేదు. (ద్వితీయోపదేశకాండము 21:22, 23) మనం పై పేరాల్లో పరిశీలించినట్లుగా, సౌలు రాజు కొడుకైన యోనాతాను లాంటి కొంతమంది నమ్మకమైనవాళ్ల మృతదేహాల్ని కూడా దహనం చేశారు.

అపోహ: దహనం చేస్తే దేవుడు వాళ్లను పునరుత్థానం చేయలేడు.

నిజం: చనిపోయినవాళ్లను పునరుత్థానం చేసే విషయానికొస్తే, చనిపోయిన ఒక వ్యక్తిని పాతిపెట్టినా, దహనం చేసినా, లేదా అతను సముద్రంలో కొట్టుకుపోయినా, అతన్ని క్రూరమృగాలు తినేసినా దేవుడు పునరుత్థానం చేయగలడు. (ప్రకటన 20:13) సర్వశక్తిగల దేవుడు ఒక వ్యక్తి శరీరాన్ని మళ్లీ తేలిగ్గా సృష్టించగలడు.—1 కొరింథీయులు 15:35, 38.

చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దహనం చేయాలా లేక పాతిపెట్టాలా అనేది ఎలా నిర్ణయించాలి?

ఏమి చేయాలో నిర్ణయించే ముందు ఈ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి:

  • చనిపోయిన వ్యక్తి కోరికలు. తాము చనిపోయిన తర్వాత, తమ శరీరాన్ని ఏమి చేయాలనే విషయంలో ఇచ్చిన నిర్దేశాల్ని కుటుంబసభ్యులు గౌరవించిన ఉదాహరణలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి.—ఆదికాండము 50:4, 5; నిర్గమకాండము 13:19.

  • స్థానిక ఆచారాలు. అంత్యక్రియలు నిర్వహించే విషయంలో స్థానిక కట్టుబాట్ల ప్రభావం చాలావరకు ఉంటుంది. (యోహాను 19:40) ఉదాహరణకు బైబిలు కాలాల్లో, చనిపోయినవాళ్లను పాతిపెట్టడం ఆనవాయితీగా ఉండేది. (ఆదికాండము 49:31; 1 సమూయేలు 28:3) అదేవిధంగా నేడు, స్థానిక ఆచారాలు బైబిలు సూత్రాలకు విరుద్ధంగా లేనట్లయితే, అంత్యక్రియల్ని స్థానిక ఆచారాల ప్రకారం జరిగించాలని నిర్ణయించవచ్చు.

  • చట్టబద్ధమైన నిబంధనలు. ప్రభుత్వ అధికారులకు లోబడమని బైబిలు ప్రోత్సహిస్తుంది. (రోమీయులు 13:1) కొన్ని ప్రాంతాల్లో, మృతదేహాల్ని ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం కొన్ని చట్టాల్ని ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు శవదహనాన్నే తీసుకుంటే, దహించిన తర్వాత అస్థికల్ని ఏమి చేయాలనే విషయంలో కొన్ని ప్రభుత్వాలు నిర్దిష్టమైన నియమాల్ని ఇస్తాయి.

  • ఇతరుల మనోభావాలు. ఇతరుల మీద శ్రద్ధ చూపించాలని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (ఫిలిప్పీయులు 2:4) కాబట్టి, అంత్యక్రియల్ని ఏ పద్ధతిలో చేయాలో నిర్ణయించే ముందు మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: మృతదేహాన్ని పాతిపెడితే లేదా దహనం చేస్తే ఇతర కుటుంబసభ్యులు ఎలా భావిస్తారు? ఇలాంటి పద్ధతుల్ని స్థానిక ప్రజలు ఎలా చూస్తారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి