కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 140
  • యేసు రక్షిస్తాడు—ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు రక్షిస్తాడు—ఎలా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • రక్షణ పొందడానికి మనం ఏమి చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • రక్షణ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 140
వేర్వేరు జాతుల ప్రజల మధ్య ఉన్న యేసు

యేసు రక్షిస్తాడు—ఎలా?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవునికి నమ్మకంగా ఉండే మనుషుల్ని రక్షించాడు. (మత్తయి 20:28) అందుకే బైబిలు యేసును ‘లోక రక్షకుడు’ అని పిలుస్తుంది. (1 యోహాను 4:14) బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న వేరే ఏ పేరూ భూమ్మీద లేదు.”—అపొస్తలుల కార్యాలు 4:12.

తన మీద విశ్వాసం ఉంచే “ప్రతీ మనిషి కోసం యేసు మరణాన్ని రుచి చూశాడు.” (హెబ్రీయులు 2:9; యోహాను 3:16) ఆ తర్వాత, “దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.” అప్పుడు, యేసు ఆత్మ ప్రాణిగా తిరిగి పరలోకానికి వెళ్లాడు. (అపొస్తలుల కార్యాలు 3:15) “తన పేరున దేవునికి ప్రార్థించేవాళ్లను యేసు పూర్తిస్థాయిలో రక్షించగలడు . . . ఎందుకంటే వాళ్ల తరఫున వేడుకోవడానికి ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు.”—హెబ్రీయులు 7:25.

యేసు మన కోసం ఎందుకు వేడుకోవాలి?

మనమందరం పాపులం. (రోమీయులు 3:23) మనకు, దేవునికి పాపం ఓ అడ్డుగోడలా ఉంది, అంతేకాకుండా ఆ పాపం వల్ల మనం చనిపోతున్నాం. (రోమీయులు 6:23) కానీ తన విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచేవాళ్ల తరఫున యేసు ఒక ‘న్యాయవాదిలా’ పనిచేస్తాడు. (1 యోహాను 2:1, అధస్సూచి) వాళ్ల ప్రార్థనల్ని వినమని, తాను అర్పించిన విమోచన క్రయధన బలి ఆధారంగా వాళ్ల పాపాల్ని క్షమించమని యేసు దేవుణ్ణి వేడుకుంటాడు. (మత్తయి 1:21; రోమీయులు 8:34) దేవుని ఇష్టానికి అనుగుణంగా యేసు చేసే అలాంటి విన్నపాలకు యెహోవా జవాబిస్తాడు. “లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడేందుకే” దేవుడు యేసును భూమ్మీదికి పంపించాడు.— యోహాను 3:17.

రక్షణ పొందాలంటే, కేవలం యేసు మీద విశ్వాసం ఉంచితే సరిపోతుందా?

సరిపోదు. రక్షణ పొందాలంటే మనం యేసు మీద విశ్వాసం ఉంచడమే కాకుండా, ఇంకా ఎక్కువే చేయాలి. (అపొస్తలుల కార్యాలు 16:30, 31) బైబిలు ఇలా చెప్తుంది: “ప్రాణం లేని శరీరంలా చేతలు లేని విశ్వాసం కూడా నిర్జీవమే.” (యాకోబు 2:26) మనం రక్షణ పొందాలంటే ఈ పనులు చేయాలి:

  • యేసు గురించి, ఆయన తండ్రైన యెహోవా గురించి తెలుసుకోవాలి.— యోహాను 17:3.

  • వాళ్ల మీద విశ్వాసం ఉంచాలి.—యోహాను 12:44; 14:1.

  • వాళ్లు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడడం ద్వారా విశ్వాసాన్ని మన చేతల్లో చూపించాలి. (లూకా 6:46; 1 యోహాను 2:17) “ప్రభువా” అని తనను పిలిచే ప్రతీఒక్కరు రక్షణ పొందరుగానీ “పరలోకంలో ఉన్న [తన] తండ్రి ఇష్టాన్ని చేస్తున్నవాళ్లే” రక్షణ పొందుతారని యేసు బోధించాడు.—మత్తయి 7:21.

  • కష్టాలు వచ్చినా మనం విశ్వాసం చూపిస్తూనే ఉండాలి. ఎందుకంటే “అంతం వరకు సహించిన వాళ్లే రక్షించబడతారు” అని యేసు స్పష్టంగా చెప్పాడు.—మత్తయి 24:13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి