దేవుని వాక్యంలో ఉన్న సంపద
కష్టమైన పనులు చేయడానికి నామోషిగా అనిపిస్తుందా?
ప్రధానయాజకుడు, ఆయన సహోదరులు యెరూషలేము గోడల్ని తిరిగే కట్టే పనిని చేశారు; దాన్ని చేయడం వాళ్లకు నామోషిగా అనిపించలేదు (నెహె 3:1)
కొంతమంది ప్రముఖులు మరమ్మతు పనులు లాంటి చిన్న పనులు చేస్తే తమ మర్యాదకు భంగం కలుగుతుందని అనుకున్నారు (నెహె 3:5; w06 2⁄1 10వ పేజీ, 1వ పేరా)
కష్టమైన, ప్రమాదకరమైన ఈ పనిలో నమ్మకమైన స్త్రీలు ఇష్టపూర్వకంగా పాలుపంచుకున్నారు (నెహె 3:12; w19.10 23వ పేజీ, 11వ పేరా)
సంఘంలో కొన్ని రకాల పనులు చెమటోడ్చి చేసేంత కష్టంగా ఉంటాయి, కొన్ని సమాజం దృష్టిలో తక్కువస్థాయిగా అనిపించే పనులు ఉంటాయి, ఇంకొన్ని తెరవెనుక చేసే పనులు ఉంటాయి.—w04 8⁄1 18వ పేజీ, 16వ పేరా.
ఇలా ప్రశ్నించుకోండి, ‘మంచివార్త కోసం అలాంటి పనులు చేయాల్సి వస్తే నేను చేస్తానా?’—1కొ 9:23.